రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు! | Sensational Comments Malvi Malhotra On Raj Tarun and Lavanya Dispute | Sakshi
Sakshi News home page

Malvi Malhotra: రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్‌.. మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు!

Published Mon, Jul 15 2024 8:29 PM | Last Updated on Tue, Jul 16 2024 8:39 AM

Sensational Comments Malvi Malhotra On Raj Tarun and Lavanya Dispute

రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులతో ఫుల్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో కేసులు కూడా నమోదయ్యాయి. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఇటీవల లావణ్య సూసైడ్ చేసుకుంటున్నానంటూ పోలీసులను పరుగులు పెట్టించించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమ పేరుతో తమ ఆస్తులని లాక్కుందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ  ఫ్లైట్ టికెట్స్, మెసేజెస్ వీడియో కాల్స్, కాల్ లిస్ట్‌ను ఆమె బయటపెట్టింది. తన కొడుకు యోగేశ్‌ను ట్రాప్ చేసి జైలుకు పంపించిందని మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. తాజా ట్విస్ట్‌తో రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా- లావణ్య టాపిక్‌ మరింత చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement