
టాలీవుడ్‌లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్‌చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.
Comments
Please login to add a commentAdd a comment