'నా నగలు ఎత్తుకెెళ్లారు'.. లావణ్య సంచలన ఆరోపణలు! | Raj Tarun-Lavanya Case: Lavanya Files A Complaint Against Raj Tarun & Actress Malvi Malhotra | Sakshi
Sakshi News home page

Lavanya- Raj Tarun Case: రాజ్ తరుణ్ - లావణ్య కేసు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు!

Sep 10 2024 3:43 PM | Updated on Sep 10 2024 4:04 PM

Lavanya Files A Complaint Against

టాలీవుడ్‌ రాజ్‌తరుణ్‌-లావణ్య కేసు మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య పాటు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రూ.12 లక్షల విలువైన బంగారం దొంగిలించారని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నగలకు సంబంధించిన బిల్లులతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై  కంప్లైంట్‌ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. 

నా బంగారు గాజులు, పుస్తెల తాడు, బ్రేస్ లెట్ , చైన్ మాల్వీనే దొంగిలించారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. మా ఇంటికి మాల్వి మూడు సార్లు వచ్చిందని.. నగలు దాచిన  బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది.

నా రాజ్‌ను పంపించు...

హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన రాజ్‌ను తిరిగి పంపించు.. నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా రాజ్ తరుణ్‌ను మాల్వీ తన గ్రిప్‌లో పెట్టేసుకుందని.. నేను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు రాజ్ ఇచ్చాడని లావణ్య తెలిపింది.

నిందితుడిగా రాజ్ తరుణ్ పేరు..

అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో పోలీసులు ఇటీవలే నేర అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో హీరో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో సహజీవనం చేసింది వాస్తవమేనని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారింది. కాగా.. మరోవైపు ఈ వారంలో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement