సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రోకలిబండతో హత్య చేసింది.
మైలవరం (కృష్ణా జిల్లా) : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రోకలిబండతో హత్య చేసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శాంతకుమార్ (30) అనే మహిళ జి.కొండూరు మండలానికి చెందిన పొనుసూరి బాబూ రాజేంద్ర ప్రసంగి (38) అనే వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది.
జి.కొండూరు వెళ్లిపోదామని ప్రసంగి ఒత్తిడి తేవడంతో ఆగ్రహించిన శాంతకుమార్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో రెండు సార్లు మోదింది. తీవ్రంగా గాయపడిన ప్రసంగి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత శాంతకుమార్ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.