ప్రతీకాత్మక చిత్రం
పాయకాపురం(విజయవాడ రూరల్): వాంబేకాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25) మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వాంబేకాలనీ హెచ్ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న శంకర్ ట్యాటూస్ వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరిరువురి మధ్య గొడవ జరిగింది.
చదవండి: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్
దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటకు వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకొని చున్నీతో ఫ్యాన్‌రాడ్ కు ఉరివేసుకొన్నాడు. అర్ధరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపుతీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతుని తమ్ముడు రామకృష్ణకు ఫోనులో సమాచారం అందజేసింది. అతను కిటికీలో నుంచి చూడగా శంకర్ ఉరివేసుకొన్నట్టు గమనించి పగులకొట్టి లోపలికి వెళ్లాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment