Young Man Arrested Kidnapping Two College Girls Living Relationship At Kanyakumari - Sakshi
Sakshi News home page

పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్‌చేసి సహజీవనం

Published Tue, Nov 1 2022 8:41 AM | Last Updated on Tue, Nov 1 2022 11:12 AM

Young Man Arrested Kidnapping Two College Girls Living Relationship.At Kanyakumari - Sakshi

సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్‌ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్‌గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్‌–2 విద్యార్థిని ప్రేమించాడు.

అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్‌–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్‌ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు.  
చదవండి: జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement