kanyakumari district
-
వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్ బాత్‌లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్‌కు సూచించారు. మురుగన్‌కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్‌ను, బార్ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. -
కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ.. 45 గంటలు ధ్యానంలోనే..
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్‌లో 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు మోదీ. ధోతీ తెల్లటి శాలువ ధరించిన ప్రధాని.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, మోదీకి పూజారులు ప్రత్యేక హారతి అందించారు. అలాగే ఓ శాలువ, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని ప్రధానికి అందించారు.నేటి సాయంత్రంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముసిగింది. ర్యాలీలు పర్యటనలు, బహిరంగ సభలతో బిజీ బిజీగా గడిపిన ప్రధాని మోదీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో మునిగిపోనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. కాగా ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడం ఇదేం తొలిసారి కాదు. 2019లో కేదార్‌నాథ్‌ను, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.ప్రత్యేకత ఇదే..అయితే ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892 లో స్వామి వివేకానంద.. ఈ వివేకానంద రాక్ మెమొరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌ను నిర్మించారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనుండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 వ తేదీ వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. ఈ క్రమంలోనే భారత తీర రక్షక దళం, భారత నావికాదళం గట్టి నిఘా ఉంచాలని కోరింది.ఇదిలా ఉండగా ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా.. జూన్ ఒకటిన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ భావిస్తోంది. -
పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలతో సహజీవనం
సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్‌గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్–2 విద్యార్థిని ప్రేమించాడు. అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. -
మహిళపై యజమాని లైంగిక దాడి: ఆపై వీడియో తీసి నీచంగా..
సాక్షి, చెన్నై: మహిళపై అత్యాచారం చేసి చిత్ర హింసలకు గురిచేసిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళ(36) భర్త నుంచి విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి బుద్ధన్ సంతైలోని ఓ సంస్థలో పనిచేసేది. సంస్థ యజమాని జబర్షన్ మిన్సీలాల్ ఆమెను లైంగిక దాడి చేసి వీడియో తీశాడు. దానిని చూపెట్టి నీచంగా మాట్లాడుతూ.. తన బ్లాక్మెయిల్ చేశారని.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి తిరువొత్తియూరు: రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన మధురైలో చోటుచేసుకుంది. కె .పుదూరుకు చెందిన న్యాయవాది మహమ్మద్ రాజబుద్దీన్ (42), మారి (41), నాగూర్ మీరాన్ (46), రామనాథపురం జిల్లా దేవిపట్టణానికి చెందిన బాబు వాహెబ్ (47) పేరైయూర్‌లోని స్నేహితుడి ఇంట్లో జరిగే కార్యక్రమం కోసం ఆదివారం కారులో వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు మధురై నుంచి కాశీమణి (46), భార్య రామ ముక్కళంజియం (42), కుమారుడు రాహుల్ (19), అల్లుడు తలైమలై (26), బంధువు గౌతమ్ (28) సొంతూరైన రాజపాలయానికి కారులో వస్తున్నారు. కుండ్రత్తూర్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహ్మద్ రాజబుద్దీన్, నాగూర్ మీరాన్, బాబు వాహెబ్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: Tamilnadu: మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. మాజీ డీజీపీకి ఊరట -
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
-
అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వం
-
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వల కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా కన్యాకుమారి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నిర్వాహకులపై 93 మందిపై వేటు పడింది. దీనిగురించి ఈపీఎస్, ఓపీఎస్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే పార్టీ విధానాలకు, లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా 93 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక వైఫల్యం తర్వాత అనేక జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులను ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మూకుమ్మడిగా పార్టీ నుంచి తొలగిస్తున్నారు. దినకరన్ వర్గానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు. -
కన్యాకుమారి అతలాకుతలం..
-
బాంబుల కలకలం
ఒకే సారి రెండు చోట్ల దొరికిన బాంబులు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. కన్యాకుమారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంటి వద్ద 11 బాంబులు దొరికాయి. అలాగే మదురై జిల్లా మేలూరులో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన ఇద్దరు అరెస్టయ్యారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : కన్యాకుమారి జిల్లా కులచ్చల్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సబీన్ (33) ఇంటికి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఇద్దరు బైక్‌పై వచ్చి ఇంటి తలుపు తట్టారు. వారిని అనుమానించిన ఇరుగుపొరుగువారు మీరెవరని ప్రశ్నించగా చేపలు తెచ్చినట్లు బదులిచ్చారు. చేపలను ఇంటిముం దు పెట్టి వెళ్లండి వారు నిద్రలేచిన తరువాత తీసుకుంటారని స్థానికులు చెప్పడంతో వారి వెంట తెచ్చిన బకెట్‌ను అక్కడ పెట్టి వెళ్లిపోయారు. వారి కదలికలను అనుమానించిన స్థానికులు బకెట్‌ను తనిఖీ చేయగా అందులో 11 బాంబులను గుర్తించి భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లా ఎస్పీ మణివణ్ణన్ కులచ్చల్‌కు చేరుకుని కాంగ్రెస్ నేత సబీన్ తదితరులను విచారించారు. కొట్టిల్పాట్టికి చెందిన జేరోమ్, కులచ్చల్‌కు చెందిన డయానీని అరెస్ట్ చేశారు. జేరోమ్పై వరకట్న వేధింపుల కేసు కొనసాగుతుండగా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కోర్టు అతనిపై పీటీ వారెంట్ జారీ చేసింది. తనపై కేసు బనాయించడంలో కాంగ్రెస్ అధ్యక్షులు సబీన్ ప్రోద్బలం ఉండొచ్చని అనుమానించి హతమార్చేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలు స్వాధీనం-ఇద్దరు అరెస్ట్ శివగంగై జిల్లా ప్రాన్మలైలో సందేహాస్పదంగా కొందరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చెన్నై నుంచి ప్రత్యేక ఇంటెలిజన్స్ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ బృందం మదురై సమీపంలోని మేలూరుకు చేరుకుంది. మేలూరులోని ముగమతియార్ పురానికి చెందిన మీరాన్ మైదీన్ కుమారుడు ముబారక్ (19), అబ్బాస్ (40)ను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ జరిపారు. మదురైలో పేలుడు పదార్థాలను దాచి వుంచిన కేసులో ఇటీవల అరెస్టయిన సమ్సుద్దీన్తో సంబంధాలు ఉన్నట్లు వారు అంగీకరించారు. వీరిద్దరినీ ప్రాన్మలైకు తీసుకెళ్లగా 1500 ఏళ్ల నాటి శివుని ఆలయం, సమీపంలోని దర్గాకు మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలు కనుగొన్నారు. పేలుడుకు ఉపయోగించే టైమర్, ముడి పదార్థాలు, స్పానర్, రంపం, ప్లాస్టిక్ కుళాయి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.