ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: మహిళపై అత్యాచారం చేసి చిత్ర హింసలకు గురిచేసిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళ(36) భర్త నుంచి విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి బుద్ధన్ సంతైలోని ఓ సంస్థలో పనిచేసేది. సంస్థ యజమాని జబర్షన్ మిన్సీలాల్ ఆమెను లైంగిక దాడి చేసి వీడియో తీశాడు. దానిని చూపెట్టి నీచంగా మాట్లాడుతూ.. తన బ్లాక్‌మెయిల్ చేశారని.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
తిరువొత్తియూరు: రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన మధురైలో చోటుచేసుకుంది. కె .పుదూరుకు చెందిన న్యాయవాది మహమ్మద్ రాజబుద్దీన్ (42), మారి (41), నాగూర్ మీరాన్ (46), రామనాథపురం జిల్లా దేవిపట్టణానికి చెందిన బాబు వాహెబ్ (47) పేరైయూర్‌లోని స్నేహితుడి ఇంట్లో జరిగే కార్యక్రమం కోసం ఆదివారం కారులో వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు మధురై నుంచి కాశీమణి (46), భార్య రామ ముక్కళంజియం (42), కుమారుడు రాహుల్ (19), అల్లుడు తలైమలై (26), బంధువు గౌతమ్ (28) సొంతూరైన రాజపాలయానికి కారులో వస్తున్నారు. కుండ్రత్తూర్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహ్మద్ రాజబుద్దీన్, నాగూర్ మీరాన్, బాబు వాహెబ్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: Tamilnadu: మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. మాజీ డీజీపీకి ఊరట
Comments
Please login to add a commentAdd a comment