thiruvottiyur
-
మహిళపై యజమాని లైంగిక దాడి: ఆపై వీడియో తీసి నీచంగా..
సాక్షి, చెన్నై: మహిళపై అత్యాచారం చేసి చిత్ర హింసలకు గురిచేసిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళ(36) భర్త నుంచి విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి బుద్ధన్ సంతైలోని ఓ సంస్థలో పనిచేసేది. సంస్థ యజమాని జబర్షన్ మిన్సీలాల్ ఆమెను లైంగిక దాడి చేసి వీడియో తీశాడు. దానిని చూపెట్టి నీచంగా మాట్లాడుతూ.. తన బ్లాక్మెయిల్ చేశారని.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి తిరువొత్తియూరు: రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన మధురైలో చోటుచేసుకుంది. కె .పుదూరుకు చెందిన న్యాయవాది మహమ్మద్ రాజబుద్దీన్ (42), మారి (41), నాగూర్ మీరాన్ (46), రామనాథపురం జిల్లా దేవిపట్టణానికి చెందిన బాబు వాహెబ్ (47) పేరైయూర్‌లోని స్నేహితుడి ఇంట్లో జరిగే కార్యక్రమం కోసం ఆదివారం కారులో వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు మధురై నుంచి కాశీమణి (46), భార్య రామ ముక్కళంజియం (42), కుమారుడు రాహుల్ (19), అల్లుడు తలైమలై (26), బంధువు గౌతమ్ (28) సొంతూరైన రాజపాలయానికి కారులో వస్తున్నారు. కుండ్రత్తూర్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహ్మద్ రాజబుద్దీన్, నాగూర్ మీరాన్, బాబు వాహెబ్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: Tamilnadu: మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. మాజీ డీజీపీకి ఊరట -
ప్రాణం తీసిన అనుమానం.. పెళ్లైన ఏడు నెలలకే
తిరువొత్తియూరు/చెన్నై: అనుమానంతో వివాహమైన ఏడు నెలలకే భార్యను కడతేర్చి భర్త పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన చెన్నైలోని గిండిలో చోటుచేసుకుంది. చెన్నై గిండి లేబర్ కాలనీ లైన్స్ స్కూల్ రోడ్డుకు చెందిన నిత్యానందం (34) లగేజీ ఆటోడ్రైవర్. ఇతనికి ఏడు నెలల కిందట భువనేశ్వరి (23)తో వివాహమైంది. భువనేశ్వరి తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అనుమానించి సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఆమెతో గొడవపడ్డాడు. కానీ భువనేశ్వరి మాట్లాడడం మానలేదు. ఈ విషయమై సోమవారం రాత్రి తిరిగి దంపతుల మధ్య గొడవ ఏర్పడడంతో ఆగ్రహం చెందిన నిత్యానందం భార్యపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నిత్యానందం గిండి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టోడ్రైవర్ ఆత్మహత్య తిరువొత్తియూరు: కానిస్టేబుల్ విచారణకు రమ్మని సెల్‌ఫోన్‌ను లాక్కోవడంతో గాజుముక్కతో గొంతు కోసుకుని ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై తిరు ముల్లవాయిల్ సమీపం అయ్యపాక్కం అయ్యప్ప నగర్ ఓం శక్తి వీధికి చెందిన భాగ్యరాజు (34) ఆటోడ్రైవర్. ఇతని స్నేహితుడు ప్రదీప్ (30). సోమవారం వీరిద్దరు ఆ ప్రాతంలో వున్న చెరువు కట్టపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తిరుములైవాయల్ కానిస్టేబుల్ సంతోష్ ఇద్దరి సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుస్టేషన్‌కు రావాలని తెలిపాడు. కానిస్టేబుల్‌తో భాగ్యరాజ్ గొడవ పడ్డాడు. ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ భాగ్యరాజ్‌పై చేయిచేసుకున్నాడు. భాగ్యరాజు అక్కడ పడి వున్న బీర్‌బాటిల్ గాజు ముక్కతో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో భాగ్యరాజ్ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. తల్లీబిడ్డను ముక్కలుగా నరికి
తిరువొత్తియూరు/తమిళనాడు: వివాహేతర సంబంధం వ్యవహారంలో ప్రియురాలు, ఆమె బిడ్డను ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలోని క.పుదుపట్టికి చెందిన కరుప్పుస్వామి కుమార్తె కలైసెల్వి (22). ఈమెకు మదురై జిల్లా పేరావూరుకు చెందిన కాశి రాజన్‌తో వివాహమైంది. వీరికి ఒక మగబిడ్డ. 2020 సెప్టెంబర్‌లో బిడ్డతో బయటకు వెళ్లిన కలైసెల్వి అదృశ్యమైనట్లు యువతి తండ్రి కరుప్పుస్వామి ఉత్తమపాళయం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో 2021 మార్చి 26న చిన్నమనూరు అయ్యనార్ ఆలయ కోనేరులో మూడు గోనె సంచులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుస్తులు ఆధారంగా అవి కలైసెల్వి, ఆమె బిడ్డకు చెందినదిగా గుర్తించారు. విచారణలో వివాహానికి ముందే కలైసెల్వికి చిన్నమనూరుకు చెందిన వివాహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. వివాహం తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన ప్రియుడు ప్రియురాలితో పాటు బిడ్డను ముక్కలుగా నరికి గోనెసంచిలో మూటగట్టి కోనేరులో పడేసినట్లు తెలిసింది. ప్రియుడితో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
ఎస్ఐ భార్య కోసం పోలీసుల గాలింపు
తిరువొత్తియూరు: చీటీల కేసులో మోసానికి పాల్పడిన ఎస్ఐ భార్య కోసం పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు. కాంచిరంగలైకు చెందిన రాము తిరుకోస్టియూర్లో ప్రత్యేక ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇతని భార్య తమిళ్ సెల్వి. ఆమె చీటి వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో తమిళ సెల్వికి కూలి పనులు చేసుకుని సంపాదించుకనే సెంథామరై చీటి కట్టింది. ఆమె కాకుండా ఆ పరిసర ప్రాంతానికి చెందిన మహిళలంతా తమిళ సెల్వికి 2011 నుంచి చీటి డబ్బులు కట్టారు. చీటి వేసిన వారికి తమిళ్ సెల్వి తిరిగి డబ్బులు చెల్లించలేదు. దాంతో సెందామరై తనకు నగదు చెల్లించాలని కోరింది. దీంతో ఎస్ఐ రాము హత్యా చేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె జిల్లా క్రైం విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రూ.41 లక్షలు మోసం చేసిన తమిళ్ సెల్వి కోసం గాలిస్తున్నారు. -
పెళ్లి ఖర్చుల కోసం బైక్ చోరీ
తిరువొత్తియూరు : పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిపి ఉన్న బైక్‌ను చోరీ చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. చెంగల్పట్టు ఎన్జీవో నగర్‌కు చెందిన యువకుడు భరత్‌కుమార్ చెంగల్పట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరిని పరామర్శించేందుకు మోటర్ బైక్‌పై వచ్చాడు. బయటకు వచ్చి చూడగా ఆ మోటార్‌సైకిల్ కన్పించ లేదు. టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా, వేగంగా వచ్చిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించాడు. విచారణలో పొంతనలేని సమాధానం చెప్పడంతో తమదైన శైలిలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో ఆ మోటారు బైక్ తనది కాదని అంగీకరించారు. ఆ బైక్ భరత్ కుమార్‌దిగా గుర్తించారు. పెళ్లి ఖర్చుల కోసం తాను బైక్ దొంగలించినట్టు ఆ యువకుడు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది. సున్నాంబు పేటకు చెందిన తమిళ వేందన్గా ఆ యువకుడ్ని గుర్తించారు. మరో వారంలో అతడికి వివాహం జరగనున్న నేపథ్యంలో పెళ్లి ఖర్చు కోసం బైక్ చోరీ చేసి కటకటాల్లోకి వెళ్లాడు.