తిరువొత్తియూరు : పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిపి ఉన్న బైక్‌ను చోరీ చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. చెంగల్పట్టు ఎన్‌జీవో నగర్‌కు చెందిన యువకుడు భరత్‌కుమార్ చెంగల్పట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరిని పరామర్శించేందుకు మోటర్ బైక్‌పై వచ్చాడు. బయటకు వచ్చి చూడగా ఆ మోటార్‌సైకిల్ కన్పించ లేదు.
టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా, వేగంగా వచ్చిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించాడు. విచారణలో పొంతనలేని సమాధానం చెప్పడంతో తమదైన శైలిలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
దీంతో ఆ మోటారు బైక్ తనది కాదని అంగీకరించారు. ఆ బైక్ భరత్ కుమార్‌దిగా గుర్తించారు. పెళ్లి ఖర్చుల కోసం తాను బైక్ దొంగలించినట్టు ఆ యువకుడు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది. సున్నాంబు పేటకు చెందిన తమిళ వేందన్‌గా ఆ యువకుడ్ని గుర్తించారు. మరో వారంలో అతడికి వివాహం జరగనున్న నేపథ్యంలో పెళ్లి ఖర్చు కోసం బైక్ చోరీ చేసి కటకటాల్లోకి వెళ్లాడు.