
సాక్షి, తూప్రాన్ : బైక్‌ను దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ సుభాశ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల26న పోతరాజ్‌పల్లి కమాన్ వద్ద కిష్టయ్య ఓటల్‌వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సోమవారం ఉదయం అల్లాపూర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకొని విచారించగా వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లభించలేదని అన్నారు. ఈ వాహనం గత మూడు రోజుల క్రితం చోరీకి గురైనట్లుగా గుర్తించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వర్గల్ మండల కేంద్రానికి చెందిన సుధాకర్‌గా గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment