Medak Crime News
-
ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్!
సాక్షి, మెదక్: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి కార్యకలాపాలు కొనసాగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా నేతలతో చికోటి ప్రవీణ్ కుమార్‌కు సత్సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఏడుపాయలలో చికోటి ప్రవీణ్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. హరిత హోటల్లో నిర్వహించిన వేడుకలకు సుమారు 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలిపింది. జన్మదిన వేడుకల కోసం హరిత హోటల్లో చక్రపాణి పేరుతో 6 గదులు, 2 హాల్స్ బుకింగ్ చేశారు. గోవా టూర్‌తో చీకోటి ప్రవీణ్ కుమార్‌కు మెదక్ జిల్లాలోని ప్రముఖ నేతలు, వ్యాపారులు పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. చీకోటితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. చికోటి లిస్ట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ సైతం ఉన్నట్లు సమాచారం. చీకోటి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ పేర్లు బయటకు వస్తుండటం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
దారుణం: తల్లి, భార్య కలసి గొంతు పిసికి చంపారు
సాక్షి,వర్గల్ (గజ్వేల్): తాగుడుకు బానిసై నిత్యం భార్య, తల్లిని హింసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డిపల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (36)కి భార్య రజిత, తల్లి లక్ష్మి, పన్నెండేళ్లలోపు యుగంధర్‌రెడ్డి, గగన అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి తాగుడుకు బానిసైన రవీందర్‌రెడ్డి ప్రతిరోజు తాగి భార్యను, తల్లిని, పిల్లలను తిడుతూ, కొడుతూ హింసించేవాడు. పలుమార్లు పంచాయతీ పెట్టి మందలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. శనివారం ఉదయం కూడా తాగిన మైకంలో తన తల్లిని, భార్యను తిట్టి కొట్టి గొడవపడ్డాడు. దీంతో అతని హింసలు భరించలేక తల్లి లక్ష్మి, భార్య రజిత ఇంట్లోని ఓ గదిలో రవీందర్‌రెడ్డిని గొంతు పిసికి హతమార్చారని మృతుడి మేనమామ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని సీఐ కమాలాకర్, సంపత్‌కుమార్ పరిశీలించారు. మృతుని మెడపై, కాలు వద్ద గాయాలున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
భార్య డబ్బులు ఇవ్వలేదని... కొడుకుని చితకబాధిన తండ్రి!!
తూప్రాన్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్‌లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్) -
భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా..
కోహీర్(జహీరాబాద్): పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాపుకాచి కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోహీర్ మండలం మద్రి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. మద్రి గ్రామానికి చెందిన ఎండీ జహీర్ (45) ఆదివారం మధ్యాహ్నం తన అన్న సలీంతో కలిసి ఫార్చునర్ వాహనంలో గ్రామ శివారులోని పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మధ్యలో ఆగి చెట్ల నీడలో సేదదీరుతున్నారు. ఇదే అదనుగా దుండగులు కత్తులతో దాడి చేసి తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన జహీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సలీం గాయాలతో తప్పించుకున్నాడు. వీరి మధ్య ఉన్న భూతగాదాలు, పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోతున్న వాహనం మద్రి–గురుజువాడ గ్రామాల మధ్య కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. వాహనంలో నుంచి ఎలాగోలా బయటపడిన దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, కోహీర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య కాపురానికి రావడం లేదని.. -
మార్చి లో పెళ్లి.. ఆగస్టులో ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు పరిధిలోని బండ్లగూడకు చెందిన శివశంకర్, ఆమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్‌కు చెందిన స్వాతి (21)తో ఈ ఏడాది మార్చి 13న వివాహం జరిగింది. కాగా వివాహం జరిగినప్పటి నుంచి వరకట్నం కోసం వేధించే వారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం భర్త శివశంకర్ భార్య (మూడు నెలల గర్బిణి)కు అనారోగ్యంగా ఉందని స్వాతి తండ్రికి చెప్పడంతో వచ్చి ఐలాపూర్‌కు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వలేరని, మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శివశంకర్, అత్త భారతమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
చిన్ని, నాన్న.. ఇక సెలవ్..
వర్గల్(గజ్వేల్): పచ్చని కాపురంపై విధి కన్నెర్ర చేసింది. విద్యుత్ షాక్ రూపంలో రైతు దంపతులను కాటేసింది. ఏడేళ్లలోపు అన్నా, చెల్లెల్లకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేసింది. వ్యవసాయ బావి వద్ద సంపుహౌజ్‌లో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వెళ్లిన దంపతులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వర్గల్ మండలం చౌదరిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు మానుక వెంకటేష్‌గౌడ్(30), రేణుక(26)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శరత్(7), తనూష(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం 7 గంటలకు స్వీట్‌కార్న్ కంకులు తెంపేందుకు వెళ్లిన దంపతులు పని ముగించుకొని కాళ్లూచేతులు కడుక్కునే సమయంలో సంపులో మోటారు నడుస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో నీళ్లకు షాక్ వస్తున్న విషయం తెలియని వారు కాలు కడుక్కుంటగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. రోదనలతో దద్దరిల్లిన వ్యవసాయ క్షేత్రం అందరితో కలివిడిగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా కాలం వెల్లదీస్తున్న రైతు దంపతులు కరెంట్‌షాక్‌తో దుర్మరణం పాలైన సమాచారం తెలిసి పెద్ద సంఖ్యలో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల మీద పడి కుటుంబీకులు బోరుమన్నారు. కంకులు తెంపి తొందరగా వస్తమని పసి పిల్లలను అప్పచెప్పి వెళ్లిన కొడుకు, కోడలు కానరాకుండా పోయారని మృతుడి తల్లి ఎల్లమ్మ బోరుమంటుంటే ఆపడం ఎవరితరం కాలేదు. చిన్ని, నాన్న.. ఇక సెలవ్.. చిన్ని, నాన్న.. ఇక సెలవ్ అంటూ పసి పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు నింగికేగారు. అమ్మా..రోజూ మాకు గోరుముద్దలు తినిపిస్తావు. బడికి తయారు చేస్తవు. ప్రేమను, ఆప్యాయతను పంచుతూ నాన్న బండి మీచిన్ని, నాన్న.. ఇక సెలవ్ద బడికి తీసుకెళ్తుంటే..టాటా చెబుతావ్..ఇంతలోనే ఏమైందమ్మా. ఇక మాకు మీరు కన్పించరా..అన్నట్లు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్నట్లు వెంకటేష్ దంపతుల కొడుకు, కూతురు బేల చూపులు..తల్లిదండ్రులు కానరాని తీరాలకు చేరిపోయారని తెలియని అమాయకత్వం ఆ చిన్నారుల కళ్లలో కన్పిస్తుంటే చూపరుల గుండెలు తరుక్కుపోయాయి. తలకొరివి పెట్టిన చిన్నారి చివరకు ఏడేళ్ల కొడుకు శరత్, తాత సత్తయ్యగౌడ్తో నడుస్తూ తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాడు. ఈ విషాదకర ఘటనతో చౌదరిపల్లి గ్రామం గొల్లుమన్నది. ఘటనపై గౌరారం ఎస్సై వీరన్న కేసు నమోదుచేసి పోస్టుమార్టం అనంతరం దంపతుల మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పరామర్శించిన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి దంపతులు మృతి చెందిన సమాచారం తెలిసి గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మృతుల కుటుంబీకులను ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతిచెందిన రైతు దంపతులకు టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రూ. 2 లక్షల చొప్పున పార్టీ నుంచి బీమా పరిహారం ఇప్పిస్తామన్నారు. అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
నాటు తుపాకీ కలకలం
వెల్దుర్తి(తూప్రాన్): నేరప్రవృత్తి కలిగిన ఓ యువకుడి వద్ద నాటు తుపాకీ వెలుగుచూడడం వెల్దుర్తి మండలంలో కలకలం సృష్టించింది. పాతకక్షలు దృష్టిలో పెట్టుకొని హతమారుస్తామంటూ సర్పంచ్‌పై తుపాకీతో పాటు కత్తులతో నలుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు బెదిరింపులకు పాల్పడిన వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మండలంలోని మంగళపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సర్పంచ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె రమేశ్ అనే యువకుడు అతని తండ్రి యాదయ్య, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 27న సాయంత్రం విజయబ్యాంకు వద్ద నిలబడి ఉన్న సర్పంచ్ రామకృష్ణారావుతో గొడవ పెట్టుకొని తుపాకి, కత్తులతో చంపుతానని బెదిరించారు. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గ్రామస్తుల రాకను చూసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ధి చేసి వారు ఉపయోగించిన తుపాకి, కత్తులను పోలీసులకు అప్పగించారు. అడవి జంతువుల వేట..! మన్నె రమేష్ గత నాలుగైదు నెలలుగా ఎస్బీఎంఎల్ కంట్రీ మేడ్ వెపన్తో స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై గ్రామస్తులు అతడిని చాలాసార్లు అడిగినా సమాధానం దాటవేశాడని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగరాజు పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
ప్రేమ విఫలమై న్యూస్ చానల్ ఉద్యోగిని ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: ప్రేమ విఫలమై మానసిక ఆందోళనకు గురైన ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ సమాచారం మేరకు... సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ చానల్లో పనిచేస్తున్నది. కళ్యాణి అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడిని ప్రేమించిందని పోలీసులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమ కొనసాగుతున్నది. అయితే ఇటీవల కళ్యాణి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని కోరింది. ఆ యుకువడు నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఉంటున్నారు. ఓ బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగుచూసింది. వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్ వివరించారు. -
ఇట్టే దొరికిపోతారు!
అల్లాదుర్గం(మెదక్): గతంలో నేరస్తుల వేలిముద్రలు తీసుకొనేవారు.. నేడు నేరస్తుల వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ (లైవ్) స్కానర్ సహాయంతో కంప్యూటర్లో భద్రపరుస్తున్నారు. హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానర్‌తో సేకరిస్తున్నారు. మళ్లీ ఇదే నేరస్తులు ఎక్కడైనా నేరాలు చేస్తే ఫింగర్ ప్రింట్ ఆధారంగా వారి బయోడేటా పూర్తిగా తెలుస్తుంది. అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. అల్లాదుర్గం సర్కిల్ పరిధిలో టేక్మాల్, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. సర్కిల్ పోలీస్‌స్టేషన్ కావడంతో అల్లాదుర్గంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు చేశారు. సర్కిల్ పరిధిలో ఎక్కడైనా నేరస్తులు పట్టుబడితే వేలిముద్రలను స్కాన్ చేసి కంప్యూటర్లో భద్రంగా ఉంచేలా ఏర్పాటు చేశారు. వేలిముద్రలు తీసుకున్న నేరస్తులు దేశంలో ఎక్కడా నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వారి పూర్తి వివరాలు తెలియడంతో సులువుగా నేరస్తులను పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో నమోదు.. ఎలాంటి నేరాలు చేసినా నేరస్తుల వేలిముద్రలే పట్టిస్తాయి. వారి వేలిముద్రలు భద్రపర్చేందుకు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేశాం. అత్యాచారం, హత్య, హత్యాయత్నం, దొంగతనాలు, దోపిడీలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానింగ్ చేసి ఆన్లైన్లో భద్ర పరుస్తున్నాం. అలాగే స్కాన్ చేసేటప్పుడు వారి ఆధార్‌కార్డు, నివాసం, జిల్లా, రాష్ట్రం పేర్లు నమోదు చేస్తున్నాం. నేరస్తులు ఏ రాష్ట్రంలో నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వెంటనే పట్టుకుంటాం. ఇటీవల గడిపెద్దాపూర్‌లో హత్యాయత్నం చేసిన బుడ్డాయిపల్లికి చెందిన నేరస్తుల వేలిముద్రలను స్కాన్ చేసి అన్లైన్లో నమోదు చేశాం. – మోహన్‌రెడ్డి, ఎస్ఐ -
చాటుగా పెళ్లి చేసుకుని మోసపోయా..
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో మోసపోయాను.. చాటుగా పెళ్లి చేసుకుని తీరా తనతో ఎలాంటి సంబంధం లేదంటున్న యువకుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించింది. చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన చింతాకుల ప్రవీణ స్వగ్రామానికి చెందిన యువకుడి చేతిలో మోసపోయానని పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్నామని, తనను హైదరాబాద్‌కు తీసుకెళ్లి కాపురం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. (‘చీకటి’ లోకంలో ప్రేమ కాంతులు) గర్బం దాల్చడంతో టాబ్లెట్లు ఇచ్చి గర్బం పోయోలా చేశాడని వివరించింది. చివరికి కట్న, కానుకలు తీసుకువస్తేనే తనతో కాపురం చేస్తానని వేదిస్తున్నాడని తెలిపింది. ఈ నెల 14న గ్రామస్తుల సమక్షంలో గుడి వద్ద పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు తర్వాత ముఖం చాటేశాడని వాపోయింది. తనకు న్యాయం చేసి యువకుడితో కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఈ విషయంపై ఎస్ఐ మాట్లాడుతూ.. విచారించి యువతికి న్యాయం చేస్తామని తెలిపారు. -
దొంగల హల్చల్
శివ్వంపేట(నర్సాపూర్): తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అందుకు అనుగునంగా చోరీకి పాల్పడిన సంఘటన మండల పరిధి పోతులబోగూడ గ్రామంలో శనివారం ఆర్థరాత్రి చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న 5 ఇళ్లతో పాటు రెండు కిరాణ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. చోరీలో లభ్యమైన నగదు, బంగారం వెంట తీసుకెళ్లిన దొంగలు పలు సామగ్రిని గ్రామ శివారులో పడేసి వెళ్లారు. తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.... చాపల భూదమ్మ బంధువులకు సంబంధించిన వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురికాగా పరామర్శించేందుకు వెళ్లారు. వీరి ఇంటి ప్రధాన ద్వారం గడపను తొలగించి ఇంట్లోని మూడు అల్మారాలను ధ్వసం చేసి అందులోని తులం బంగారం, 65 వేల నగదు, బట్టలు చోరీ చేశారు. పత్రాల ముత్యలుగౌడ్ ఇంట్లో 35 వేల నగదు పలు సామగ్రి చోరీ కాగా, బాలేష్‌గౌడ్ ఇంట్లో డబ్బులు, కుమ్మరి నర్సింలు ఇంట్లో బియ్యంతో పాటు ఇతర సామగ్రి, సీహెచ్ రాజుగౌడ్ ఇంట్లో చోరీ కాగా వారు అందుబాటులో లేకపోవడంతో చోరీ ఎంత జరిగిందో తెలియలేదు. భిక్షపతికి చెందిన ట్రాక్టర్ ఆరుబయట నిలిపి ఉంచగా బ్యాటరీ చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. పత్రాల ప్రశాంత్‌గౌడ్, సీహెచ్ శంకర్‌గౌడ్ లకు చెందిన కిరాణం డబ్బుల తాళాలు పగలగొట్టి అందులోని పలు సామగ్రి, నగదు ఎత్తుకెళ్లారు. కిరాణం డబ్బాలో ఉన్న మద్యం చోరీ చేసి పుల్లుగా తాగారు. అనంతరం చోరీకి పాల్పడిన పలు వస్తువులను గ్రామ శివారులో పడేసి నగదు, బంగారంతో బైక్‌పై ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోని చోరీకి సంబంధించి వివరాలు సేకరించారు. 10 గంటల ప్రాంతంలో గ్రామానికి పోలీసుల పెట్రోలింగ్ వాహనం వెళ్లడం జరిగిందని ఏఎస్ఐ నయూమ్ ఉధ్దీన్ అన్నారు. పోలీసులు అదుపులో దొంగలు చోరీకి పాల్పడిన దొంగలు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. పోతులబోగూడలో చోరీకి పాల్పడిన అనంతరం మద్యం సేవించి ముగ్గురు దొంగలు బైక్ పై పారిపోతున్న క్రమంలో వెల్దుర్తి గ్రామ శివారులో అదుపుతప్పి పడిపోయారు. ఇందులో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు గాకా గుర్తించిన పోలీసులు వారిని విచారించగా చోరీ విషయం చెప్పాడు. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన శేఖర్, కొల్చారం మండలం నాయిల్ జలాల్‌పూర్‌కు చెందిన కృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకోగా, వెల్దుర్తి మండలం అరెంగూడ గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఇన్చార్జి వెల్దుర్తి ఎస్ఐ గంగారాజు తెలిపారు. చోరీకి సంబంధించి పూర్తి స్ధాయి విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. చోరీకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
విషాదం: పెళ్లి వేడుకకు వచ్చి..
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): బావమరిది పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చి రొడ్డు ప్రమాదంతో తీవ్రగాయలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యవకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో విషాదం నింపింది. సోమవారం రాత్రి మండలంలోని సంగాయిపల్లి వద్ద మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన కానుగంటి నవీన్(29) ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొని తీవ్రగాయలకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మడూర్ నుంచి గవ్వలపల్లికి స్కూటీపై వస్తున్న నవీన్‌ను ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే కొంపల్లిలోని రష్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్లు పోలీస్‌లు తెలిపారు. మృతుడు నవీన్‌కు భార్య సంధ్య, 11 నెలల కుమారుడు, తల్లి ఉందని బంధువులు తెలిపారు. కేసునమోదు చేసుకుని గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు ఏఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. పెళ్లి వాయిదా... మడూర్ గ్రామానికి చెందిన మంగళి రామచంద్రం కుమారుడి వివాహం 26న ఉంది. నవీన్ రెండు రోజుల మందే భార్యపిల్లలతో మడూర్ చేరుకున్నాడు. సోమవారం రాత్రి గవ్వలపల్లిలో బంధువులు బస్ దిగడంతో తీసుకువచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. అల్లుడు చనిపోయిన విషాదంలో పెళ్లి జరపలేమని వాయిదా వేసి పందిరిని తొలగించారు. -
వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వారి ఇల్లు ధ్వంసం
మెదక్ రూరల్: కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం జానకంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మార్గం దుర్గయ్య – పోచమ్మలకు శ్రీశైలం, రాములు, శేఖర్ ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడైన శేఖర్‌కు అదే గ్రామానికి చెందిన నిర్మల(28)ను ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. శేఖర్, శ్రీశైలం ఇద్దరు ఒకే ఉంట్లో ఉంటుండగా, రాములు వేరేచోట నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకాలు, వేరు కాపురం వంటి చిన్నపాటి గొడవలు శేఖర్, శ్రీశైలం కుటుంబాల మధ్య జరిగినట్లు తెలిపారు. కొత్త ఇంటిని నిర్మించే విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో కొంతకాలం సాఫీగా సాగిన శేఖర్–నిర్మల వివాహ బంధంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్నిటికీ నిర్మల కారణమని ఆమెను తరచూ సూటీపోటి మాటలతో ఇబ్బందిపెట్టే వారని తెలిపారు. నిర్మలను ఉద్దేశించి అందరూ చస్తే.. చావు ఇంటి నిర్మాణం గురించి మాట్లాడకు అంటూ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిర్మల గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తుండగా దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన అదే గ్రామంలో ఉంటున్న నిర్మల అన్న బిక్షపతి, సమీప బంధువులు మార్గం వెంకటేష్, మార్గం శ్రీనివాస్, మార్గం లింగం, మార్గం శంకర్‌లతో పాటు మరికొంత మంది ఆగ్రహంతో మృతురాలి భర్త ఇంటితో పాటు అతడి అన్నలు శ్రీశైలం, రాములు ఇళ్లను ద్వంసం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పికెట్ నిర్వహించిన పోలీసులు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ అంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఇరు వర్గాల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నిర్మలకు ఉన్న ఇద్దరు అక్కలు భూలక్ష్మి, యశోదలు కూడా వేర్వేరు సందరా>్భల్లో గతంలో చనిపోవడం పట్ల వారి అన్న భిక్షపతి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తల్లి ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు.. కుటుంబ కలహాలతో నిర్మల మృతి చెందడంతో సాత్విక్, మనిదీప్ అనే ఆరేళ్లలోపు ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతి చెందగా, ఇళ్లను బంధువులు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఏమి తెలియని పరిస్థితిలో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోదించడం అక్కడివారిని కంటతడిపెట్టించింది. -
నాడు అన్న.. నేడు తమ్ముడు
సాక్షి, రామాయంపేట(మెదక్) : అప్పులు తీర్చడానికి సౌదీ వెళ్లిన ఓ యువకుడు నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం బతుకు దెరువు కోసం వెళ్లిన అన్న సైతం యాదృచ్చికంగా నిద్రలోనే కన్నుమూశాడు. అన్న మృతదేహం ఇంకా స్వదేశానికి రాకపోగా.. ఇప్పుడు తమ్ముడి మృతితో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జానిమియాకు భార్య రఫియాతో పాటు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు. అతడికి 16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం సహకరించక కొన్నాళ్లు కూలీ పనులు చేసిన జానిమియా అప్పులపాలై వాటిని తీర్చే మార్గంలేక గత్యంతరం లేక రేండేళ్ల క్రితం మరిన్ని అప్పులు తీర్చడానికి అప్పులుచేసి సౌదీ వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న తరుణంలో రాత్రి నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం జానిమియా సోదరుడు అబ్ధుల్లా సైతం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి నిద్రలోనే మృతి చెందాడు. కాగా అతడి మృతదేహం ఇప్పటికీ స్వగ్రామానికి రాలేదు. అబ్దుల్లా మృతి మరువకముందే అతడి సోదరుడు జానిమియా సైతం సౌదీలో నిద్రలోనే మృతిచెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలిచివేసింది. తమకు దిక్కెవరని మృతుడి కుటుంబ సభ్యులు విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరేతున్నారు. -
నాన్నా.. సూసైడ్ చేసుకుంటున్నా..
వెల్దుర్తి(తూప్రాన్): మంచిగా చదువుకొమ్మని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఫోన్లో తండ్రికి తెలుపగా తండ్రి సమాచారం మేరకు సకాలంలో స్పందించిన పోలీసులు విద్యార్థి ఆచూకీ కనుగొనడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన ఎరుకల నాగరాజు (17)ను మంచిగా చదువుకోవాలని అతని తండ్రి మందలించాడు. దీంతో నాగరాజు కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి విషం సేవించాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. తండ్రి పోలీసులకు సమాచారమివ్వగా అప్రమత్తమైన పోలీసులు ఐటీ విభాగం సహాయంతో విద్యార్థి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు వెల్దుర్తి గ్రామ శివారులోని హల్దీవాగు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పడి ఉన్న నాగరాజును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లాడి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కల్హేర్(నారాయణఖేడ్): మెడలో ఉరితాడుతో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని ఎవరైన హత్య చేశారా? ఆత్మహత్య చేసకున్నాడా అనే విషయం ప్రశ్నర్థకంగా మారింది. మంగళవారం సిర్గాపూర్ మండలం కడ్పల్ శివారులో ఈ సంఘటన జరిగింది. కడ్పల్ గ్రామనికి చెందిన జువ్వి అంబయ్య(40) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శవమై కనిపించాడు. అంబయ్య మృతి పట్ల కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అంబయ్య మృతి పట్ల భార్య జువ్వి భవానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు, సిర్గాపూర్ ఎస్ఐ మొగులయ్య, ఎఎస్ఐ నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అంబయ్య మృతి పట్ల విచారణ జరిపారు. మిస్టరీ ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి కొద్ది దూరంలో రోడ్డు వరకు వెళ్లి ఆగింది. దీంతో క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్ఐ మొగులయ్య తెలిపారు. మృతదేహన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. భార్య మందలించిందనిమరో అనుమానం.. మృతుడు జువ్వి అంయ్యకు గతంలో పెద్దపేగుకు సంబందించి శాస్త్ర చికిత్స జరిగింది. అనారోగ్యంతో బాధపడుతు మందులు వాడుతున్నాడు. మద్యం సేవించడంతో భార్య భవానీ మందలించడంతో మనస్థాపం చెందిన అంబయ్య ఇంటి నుంచి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడని గ్రామంలో వదంతులకు దారితీసింది. మెడలో ఉరితాడుతో కింద కూర్చుని ఆత్మహత్య చేసుకోవడం జరుగాదని, ఎవరైన హత్య చేశారా? అనే అనుమాననికి బలం చేకురుస్తుంది. పోలీసుల దర్యాప్తుతో మిస్టారీ వీడే అవకాశం ఉంది. -
సూసైడ్ నోట్ రాసి.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: భార్య తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ బంధువులు, కుటుంబీకులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాగుడుకు బానిసై.. జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో చాకలి నిరంజన్ (26) నివాసం ఉంటున్నాడు. ఇతను ఆరేళ్ల క్రితం అనురాధ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయి ఆమెకు ఇద్దరు పిల్లలు గౌరీ, హనీలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల భర్తను వదిలేయడంతో ఆమెకు పరిచయం ఏర్పడిన నిరంజన్తోనే సహజీవనం చేస్తున్నది. వీరికి అమరేశ్వర్ మరో సంతానం ఉంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆగ్రహించడంతో ఇతను సంగారెడ్డిలోనే వేరు కాపురం పెట్టి అనురాధతోనే ఆరేళ్లుగా కాపురం చేస్తున్నాడు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడంతో వచ్చిన డబ్బులు చాలకపోవడం, సంసారంలో ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. పోలీసుల కౌన్సెలింగ్.. ఇతనిపై గతంలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భార్య అనురాధను వేధిస్తుండడంతో విసిగి చెందిన ఆమె డయల్ యువర్ 100కు ఈనెల 18న ఫోన్‌చేసింది. పోలీసులు నిరంజన్ను, అనురాధను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనురాధ తల్లి పుణ్యవతి, బావమరిది చందులు తరచూ ఇబ్బందులకు గురిచేస్తుండడం కూడా నిరంజన్ను బాధించాయి. దీంతో పాటుగా పోలీస్‌స్టేషన్‌లో నిరంజన్‌కు ఏఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వడం మనస్థాపానికి గురిచేసింది. ఇది అవమానంగా భావించిన నిరంజన్ గురువారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్ బిగించే ఉక్కుకు (రాడ్‌కు) చున్నీతో ఉరివేసుకున్నాడు. అప్పటికే అనురాధ పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలోనే ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. ఉదయం లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉండడం గమనించారు. నిరంజన్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టు నిర్వహించారు. బంధువుల ఆందోళన.. నిరంజన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ వారు స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. మృతుడు నిరంజన్ సోదరి సోని, తల్లి స్వరూప, బావ శేఖర్, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ..నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే.. ఈనెల 18న నిరంజన్ భార్య అనురాధ డయల్ 100కు కాల్ చేయడంతో అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆటో నడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. గతంలో ఇతనిపై దొంగతనం కేసులు ఉన్నాయి. భార్యను వేధించడంతో ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిరంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. – వెంకటేశ్, టౌన్ సీఐ -
బాలిక ఉసురుతీసిన వాటర్ హీటర్
సాక్షి, వర్గల్(గజ్వేల్): పాఠశాలకు వెళ్లాలనే ఆతృత.. చలివేళ వేడి నీళ్ల తాపత్రయం.. అదే బాలిక పాలిట శాపంగా మారింది. స్నానానికి బాత్రూమ్లోకి వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక అనూష కరెంట్ హీటర్‌తో కూడిన నీటిని తాకింది. విద్యుత్ షాక్‌తో అసువులు బాసింది. కన్నవారికి కడుపుకోత మిగిలి్చన ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో జరిగింది. విద్యార్ధిని మృతి సమాచారంతో సంతాప సూచకంగా వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండా పాఠశాలలు మూసివేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వివరాలివి... సీతారాంపల్లి గ్రామానికి చెందిన చిల్ల రవీందర్–జ్యోతి దంపతులకు అనూష(13), జశ్వంత్ ఇద్దరు పిల్లలు. గ్రామ సమీపంలోని వేలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అనూష ఎనిమిదో తరగతి, జశ్వంత్ ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు సకాలంలో చేరే ఆలోచనతో కాలకృత్యాలకు సిద్ధమైంది. స్నానం కోసం బాత్రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ ఉన్న నీళ్లను తాకి విద్యుత్ షాక్‌కు గురైంది. స్నానానికి వెళ్లిన అనూష 15 నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తీసి చూడగా అప్పటికే కరెంట్‌షాక్‌తో బాలిక అపస్మారక స్థితిలో గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పటికి బాలిక మృతి చెందినట్లు తెలిసి బోరుమన్నారు. అలుముకున్న విషాదం పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక అనూహ్యంగా మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు పెనువిషాదంలో కూరుకుపోయారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సహవిద్యారి్థని అనూష మృతి చెందిన సమాచారం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాయి. హెచ్ఎమ్ కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వద్ద సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల మూసేసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలిక సొంత గ్రామమైన సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలను, అదే పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లి తండా పాఠశాలలను సంతాప సూచకంగా మూసేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ఈ విషాద ఘటన పట్ల ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండాలలో విషాదం అలుముకున్నది. చదవండి : చదవాలని మందలిస్తే..యాసిడ్ తాగి ఆత్మహత్య -
నిద్ర మత్తులో.. మృత్యు ఒడికి..
సాక్షి, పాపన్నపేట(మెదక్): స్నేహితుడికోసం తోడుగా వెళ్లిన ఓ యువకుడు.. బతుకుదెరువుకోసం బెడ్ షీట్లు అమ్ముకునేందుకు బయలు దేరిన మరో యువకుడి బతుకులు నిద్ర మత్తులో చిత్తయ్యాయి. రైస్‌మిల్ ఎదుట రోడ్డు పక్కనే ఆపిన ధాన్యం లారీలు.. యువకుల పాలిట శాపంగా మారాయి. వార్తా పత్రికలు తెచ్చేందుకు పట్నం వెళ్లిన యువకులు మరో అరగంటలో గమ్యం చేరుతారనగా.. కడతేరి పోయారు. నిల్చున్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా.. మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంకో వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామశివారులోని సత్యసాయి రైస్‌మిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు, బాధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ భూపాల్(21) పదో తరగతి వరకు చదివి, ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాపన్నపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి దినపత్రికలు తేవడానికి తన ఆటోను నడుపుతున్నాడు. ఇందుకోసం పాపన్నపేటకు చెందిన తాటిగారి వంశీగౌడ్ను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు వంశీ తన మిత్రుడైన కుర్మ భూపాల్‌ను వెంట తీసుకెళ్లాడు. వీరిద్దరూ పేపర్లు తీసుకొని తిరిగి వస్తుండగా మెదక్‌లో గుల్బర్(22), అతిక్ రహమాన్ అనే బెడ్‌షీట్ వ్యాపారులు ఆటో ఎక్కారు. వీరు నలుగురు కలసి పాపన్నపేటకు వస్తుండగా, ఎల్లాపూర్ శివారులోని శ్రీ సత్యసాయి రైస్ మిల్ వద్ద ఎలాంటి హెచ్చరికలు.. ముందు జాగ్రత చర్యలు లేకుండా రోడ్డును ఆనుకొని ఆపి ఉంచిన లారీ(నెం.టీఎస్12యుపి 6593)నీ ఆటో ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ఢీకొట్టింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కొంతమంది అక్కడికి పరుగెత్తుకొచ్చి ఆటోలో ఉన్న యువకులను బయటకు తీశారు. ఈ సంఘటనలో ఆటో నడుపుతున్న కుర్మ భూపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు బెడ్ïÙట్లు అమ్మకునేందుకు వస్తున్న గుల్బర్ను 108లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. తాటిగారి వంశీగౌడ్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో ప్రయాణికుడు అతిక్ రహమాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశామన్నారు. బతుకు పోరులో సమిధగా మారిన భూపాల్.. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ దుర్గమ్మ, బేతయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు శంకర్ బతుకు దెరువుకోసం పట్నం వెళ్లగా తల్లి దుర్గమ్మ సైతం అక్కడే ఉంటుంది. వృద్ధుడైన బేతయ్యకు సపర్యలు చేస్తూ భూపాల్, చిన్న కొడుకు ప్రవీణ్‌లు రామతీర్థంలోఉంటున్నారు. ఆటో నడుపుతూ భూపాల్ బతుకు బండి లాగుతున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరు, మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు చేరుకొని పెద్దపెట్టున విలపించారు. బతుకుదెరువుకోసం వచ్చి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నవర్డా గ్రామానికి చెందిన గుల్బర్(22)కుటుంబ సభ్యులతో కలసి పదేళ్ల క్రితం మెదక్‌కు వచ్చి, బెడ్షీట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాపన్నపేటో బెడ్ షీట్లు అమ్ముకునేందుకు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తన మిత్రుడు అతిక్ రహమాన్‌తో కలసి పాపన్నపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కి, ఎల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. వ్యాపారం కోసం బయటకు వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు లబోదిబోమన్నారు. -
పెళ్లి వ్యాను బోల్తా
సాక్షి, గజ్వేల్: టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ
సాక్షి, గజ్వేల్: ఒంటరిగా వెళ్తున్న మహిళను సైకిల్‌పై వెంబడించి, కిందపడేసి, చంపుతానని బెదిరించి గుర్తు తెలియని దొంగ నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయిన ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం గౌరారం శివారులో జరిగింది. ఈ ఘటనలో మహిళ మెడపై గాయాలయ్యాయి. స్థానికంగా చికిత్స జరిపించుకున్నది. ఘటన స్థలాన్ని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంబడించి.. భయపెట్టి గౌరారం గ్రామానికి చెందిన నగరం శశిరేఖ (58) గురువారం ఉదయం తమ పొలం దగ్గరకు వెళ్లే మార్గంలో పంటి నొప్పి నివారణ చెట్టు ఆకు కోసం బయల్దేరింది. తుమ్మ చెట్లు, పొదలతో కూడిన ఆ బాటలో వెళ్తున్న ఆమెను అదే మార్గంలో సైకిల్‌పై వస్తున్న గుర్తు తెలియని ఆగంతకుడు వెంబడించాడు. ఆమె ఆకుల కోసం చెట్టు వద్దకు చేరుకోగానే చెప్పులు లేకుండా వెళ్తున్నావేంటని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆమె తేరుకునేలోగానే కిందపడేసి కొట్టి, ఎక్సా బ్లేడ్ (పైపులు కోసే చిన్న రంపం)తో చంపుతానని బెదిరించాడు. మెడపై గాట్లు పెట్టాడు. భయంతో ఆమె చంపొద్దని వేడుకోగా మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించుకుని ఆగంతకుడు సైకిల్ మీద అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న వారు ఆగంతకుని కోసం వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాబరీ కేసు నమోదు చేశామని ఎస్సై వీరన్న తెలిపారు. చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు రూరల్ సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని వివరించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
పాశవికంగా హతమారుస్తున్న కసాయిలు
పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన మెతుకుసీమలో కర్కశత్వం రాజ్యమేలుతోంది. మానవ సంబంధాలు పూర్తిగా మంటగలుస్తున్నాయి. ఎంతో మేధాస్సు కలిగిన మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కులాంతర వివాహాలు, భార్యాభర్తల మధ్య అనుమానం, భూ వివాదాలు, ఆస్తి, వ్యాపార, నగదు లావాదేవీలతో ఏర్పడిన కక్షలు, తగాదాలే హత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మానవత్వపు విలువలు మరిచిన కసాయిలు రాక్షసులుగా మారి కనికరం లేకుండా సాటి మనుషులను అత్యంత కిరాతకంగా, పాశవికంగా హతమారుస్తున్నారు. జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనపై ప్రత్యేక కథనం.. సాక్షి, మెదక్: చిన్నపాటి గొడవలకే కక్ష పూరిత నిర్ణయాలతో ఓ పథకం ప్రకారం హత్యలకు పాల్పడుతున్నారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు నేరస్తులు చేసే ఒక్కో ప్రయత్నాలు సినీ ఫక్కీని తలపిస్తున్నాయి. ఒక చోట చంపి మరొక చోట శవాన్ని పడేయటం. ముఖాన్ని గుర్తు పట్టలేనంతగా ఛిద్రం చేయడం వంటివి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపే క్షేత్రస్థాయి విచారణలో నేరస్తులు పట్టుపడుతున్నప్పటికీ, మరికొన్ని కేసులు పురోగతి లేకుండానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని ఘటనల్లో హత్యకు గురైన వ్యక్తుల వివరాలు తెలియక పోలీస్స్టేషన్లలో కాగితాలకే పరిమితమయ్యాయి. కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే.. కుటుంబ పరువు ప్రతిష్ఠతల పరిరక్షణ కోసం ఎక్కువగా హత్యలకు పాల్పడుతూ మానవమృగాలుగా మారుతున్నారు. ప్రేమ, కులాంతర వివాహాలు, వివాహేతర సంబంధాలు, భార్యభర్తల మధ్య అనుమానాలు వంటి ప్రతిష్ఠకు భంగం కలిగించే పలు కారణాలతో అత్యంత కిరాతకంగా మారుతున్నారు. జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు ఇవి మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తనను ప్రియుడితో కలిసి ఎక్కడ హతమారుస్తుందోననే భయంతో ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన దేవ్లా అతడి భార్య విజయ(26)ను మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం హత్యచేశారు. దీంతో వారి ముగ్గురు పిల్లల పరిస్థితి అంధకారమైంది. ఈ ఏడాది అక్టోబర్ 26న ఓ గుర్తు తెలియని మహిళను వేరేచోట హత్యచేసి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో పడేశారు. పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో ఈ నెల 19వ తేదీన 45 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తిని కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి, బండరాయితో తల పై బాది కుటుంబీకులే అత్యంత దారుణంగా హత్య చేశారు. కక్ష పూరితంగానే హత్యలు.. ప్రతీ హత్య వెనుక కక్ష పూరిత నిర్ణయాలు ఉంటున్నాయి. పథకం ప్రకారమే హత్యలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతీ కేసులో హత్యకు గల కారణాలను తెలుసుకుంటూ నిందితులను గుర్తించి పురోగతి సాధిస్తున్నాము. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలే ఘటనలకు కారణమవుతున్నాయి. నేరస్తుల పై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. – కృష్ణమూర్తి, డీఎస్పీ, మెదక్ గుర్తు తెలియని మృతదేహాలు 2017 2018 2019 పురుషులు 19 13 18 స్త్రీలు 02 07 06 మొత్తం 21 20 24 -
మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు
సాక్షి, రామాయంపేట(మెదక్): పంటచేను చుట్టూ పెట్టిన కరెంటువైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, ఈసంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నంచేసిన కొందరు మృతదేహాన్ని ఒక రోజు దాచిఉంచిన తరువాత పధకం ప్రకారం చెరువులో పడవేశారు. సరిగా ఈ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత అసలు విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెరువులో మృతదేహం లభ్యం.. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిషన్ తండా పంచాయతీ పరిధిలోని లాక్యతండాకు చెందిన చౌహాప్ బుచ్యానాయక్ (55) ఈనెల ఒకటిన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 3వ తేదీన అతని మృతదేహాం ఘన్పూర్ మండలంలోని బ్యాతోల్ తిమ్మాయపల్లి శివారులో ఉన్న చెరువులో లభ్యమైంది. మృతుని రెండుకాళ్లకు కరెంటుషాకుతో గాయాలుకాగా, ఈవిషయమై తండాగిరిజనులు అనమానం వ్యక్తంచేశారు. కీలకమైన సీసీ ఫుటేజ్ ఆధారం.. కరెంటుషాకుతో మృతిచెందిన బుచ్యానాయక్ మృతదేహాన్ని చెరువులో వేశారని ఆరోజే మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఒకటిన రాత్రి బుచ్యానాయక్ కాట్రియాల గ్రామంలో ఆటోదిగి తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లినట్లు గ్రామంలోని సీసీ పుటేజీతో నిక్షిప్తమైంది. దీనిని పరిశీలించిన మృతుని కుటుంబసభ్యులు ఈవిషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. కాట్రియాల నుంచి మృతుడు నివాసం ఉంటున్న లాక్యతండాకు మధ్య దారిలో పరిశీలిస్తూ వెళ్లిన తండావాసులకు ఒకచోట అనుమానాస్పదంగా అగుపించింది. పంటచేను చుట్టూ కరెంటు కనెక్షన్ ఉండటంతోపాటు నేలపై పచ్చిగడ్డి చిందరవందరగా మారడంతో వారు అనుమానంతో ఆపంటచేనును ఖాస్తు చేస్తున్న వారిని ప్రశ్నించగా, వారు తప్పును అంగీకరించారు. ఒకటిన రాత్రి ఇదే స్థలంలో బుచ్యానాయక్ కరెంటుషాకుతో మృతిచెందగా, ఒకరోజు మృతదేహాన్ని ఇక్కడే దాచి ఉంచిన అనంతరం కారులో తీసుకెళ్లి బ్యాతోల్ తిమ్మాయపల్లి చెరువులో పడవేసినట్లు వారు అంగీకరంచారు. ఈ మేరకు వారిని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై తండాలో సంచలనంగా మారింది. మృతునికి ఇద్దరు బార్యలతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్‌లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
అడవి దొంగలు
అడవులతోనే మానవ మనుగడ. అలాంటి అడవి అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలవుతోంది. ఇష్టారీతిన చెట్లను నరికివేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో చెట్లు లేక అడవి వెలవెలబోతోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అటవీ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అటవీ శాఖలో విధులు నిర్వహించే ఇంటి దొంగలు ఎక్కువవుతుండటంతో చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. సామాజిక అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుండగా మరో పక్క యథేచ్ఛగా కలప తరలిపోతోంది. అధికారులు, సిబ్బంది కలప స్మగ్లర్లతో లాలూచి పడి అందిన కాడికి అడవులను అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దొరికితేనే వేటు అన్నచందంగా మారింది. గత రెండు మాసాల క్రితం ఫరీద్పూర్ అటవీ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కలపనునరికి ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గుబట్టిలను పెట్టారు. దీని వెనుకాల ఓ క్షేత్రస్థాయి అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. నర్దన అడవి నుంచి కలప రవాణ సర్దన నుంచి బోదన్కు వెళ్లే దారి పొడవునా అడవి ఉంది. ఈ అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. చెట్లను నరికేసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయంటే మారుమూల పల్లెల్లోని అడవుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాతూర్ అడవిలో.. మెదక్ – రామాయంపేట ప్రధాన రహదారైన పాతూర్ అడవిలో చెట్లను విచ్చలవిడిగా నరికివేశారు. అడవి లోపలికి కొద్దిదూరం వెళ్తే అన్ని నరికేసిన చెట్ల మొదళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, అటవీ అధికారులకు ఎంతో కొంత ఇస్తే ఏ చెట్టునైనా నరుక్కుపొమ్మంటారని కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా అడవి లోపలికి వెళ్లి చెట్లను నరకటం ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి. అడవిలో పడేసిన మొక్కలు హరితహారం పథకంలో భాగంగా ఇటీవల అటవీ శాఖ అధికారులు అడవుల్లో గ్యాబ్ ప్లాంటేషన్ విరివిగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని అడవుల్లో మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే పాతూర్ అడవిలో అధికారులు కొంతమేర గ్యాబ్ ప్లాంటేషన్ చేసినప్పటికీ నాటిన మొక్కల కన్నా రెట్టింపు మొక్కలు అడవిలో ఎక్కడ పడితే అక్కడే పడేశారు. దీంతో అవి ఎండిపోయాయి. వీటిని చూస్తుంటే మన అటవీ శాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాహనాలు ఇచ్చినా ఫలితం శూన్యం అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో బీట్ ఆఫీసర్ల నుంచి మొదలుకొని సెక్షన్, రేంజ్ అధికారులకు ప్రభుత్వం వాహనాలను సమకూర్చింది. నిత్యం అడవుల్లో పర్యటిస్తూ అడవిని రక్షిస్తారని ఇచ్చిన వాహనాలను వారి సొంతానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశించినా.. ఇటీవల కలెక్టర్ ధర్మారెడ్డి అడవుల్లోకి ఎవరైనా గొడ్డలి పట్టుకొని లోపలికి పోయినా కేసులు నమోదు చేయాలని స్పష్టంగా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారిచేశారు. కానీ మన అధికారులు ఎవరిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే మన అధికారులే అక్రమార్కులకు కొండంతా అండగా ఉంటున్నారు కాబట్టి. ఇక కలెక్టర్ చెప్పిన మాటలకు తలాడించి బయటకు రాగానే వారిపని వారు యథావిధిగా చేసుకుంటున్నారు. అడవుల జోలికొస్తే చర్యలు తప్పవు అడవులను ఎవరు నరికినా చట్టరీత్య చర్యలు తప్పవు. సొంత పొలం గెట్ల నుంచి అక్రమంగా కలపను నరికినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయి అధికారులు స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు అడవుల రక్షణకు పాటు పడల్సిందే.. లేదంటే చర్యలు తప్పవు. గతంలో అడవులను నరికిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం. గడిచిన రెండేళ్లలో అడవిలో జిల్లా వ్యాప్తంగా 222 కేసులు నమోదు చేశాం. రూ.31.45 లక్షల జరిమానా విధించాం. 2018లో 169 కేసులు నమోదు చేసి అక్రమార్కుల నుంచి రూ.22.84 లక్షల జరిమానాలు విధించాం. 2019లో సెప్టెంబర్ వరకు అక్రమార్కులపై 53 కేసులు నమోదు చేసి రూ.8.61 లక్షలు జరిమానాలు విధించాం. – పద్మజారాణి, డీఎఫ్‌వో -
మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం
సాక్షి, తూప్రాన్: కన్నకొడుకును హత్యచేసి పూడ్చిపెట్టిన కుమారుడి మృతదేహాన్ని వెలికితీసి ఇబ్రహీంపూర్ గ్రామంలోనే తహసీల్దార్ గోవర్ధన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన పీఎసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి తన కొడుకును ఈనెల 7వ తేదీ సోమవారం రాత్రి చంపేసి పౌల్ట్రీఫాం సమీపంలో పూడ్చివేసి గురువారం పోలీసులకు లొంగిపోయాడు. శుక్రవారం తహసీల్దార్ గోవర్ధన్ తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం ముఖం భాగం కుళ్లిపోయి ఉండగా సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేశాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం అక్కడే శవాన్ని పాతిపెట్టారు. మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం నిర్వహించే సిబ్బంది రాకపోవడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పౌల్ట్రీఫాం ఆవరణలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డికి సంబంధించిన బంధువులతో మాట్లాడి తండ్రీకొడుకులకు మధ్య గొడవలకు గల కారణాలపై ఆరా తీశారు. నారాయణరెడ్డి అంటే భయంగా ఉందని, ఆయనను గ్రామంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు డీఎప్పీని కోరారు. ఇబ్రహింపూర్ గ్రామాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావ్ సందర్శించి చట్టప్రకారం నిందితులకి శిక్షపడేలా పోలీసులు చూడాలని కోరారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మృతితో బంధువులు ఇబ్రహీంపూర్‌లోని పౌల్ట్రీఫాంకు చేరుకున్నారు. నిందితులందరినీ అరెస్టు చేస్తాం: డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్య విషయంలో నారాయణరెడ్డితో పాటు అతని సోదరుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలోనే పోస్టుమార్టం పూర్తి చేయించామని పోస్టుమార్టం నివేదిక రాగానే అన్ని కోణాల్లో కేసును విచారించి శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్యలో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా మూడు రోజల వరకు గ్రామంలో పోలీస్‌ల పర్యవేక్షణ ఉంటుందని డీఎస్పీ తెలిపారు. చేగుంట ఎస్ఐ సత్యనారాయణ, చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్‌తో పాటు ఆయా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి -
మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు
‘‘సిద్దిపేట పట్టణంలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న యువకుడు పొన్నాల గ్రామంలోని ఓ కుటుంబంతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ యువకుడు తరుచూ ఆ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉన్న అమాయకురాలైన బాలికపై కన్ను పడింది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు.. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో సిద్దిపేట్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు’’. సాక్షి, సిద్దిపేట: ఇలా జిల్లాలో రోజూ ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేసి నేరస్తులపై కేసులు నమోదు చేసేలా చేస్తున్నారు. మరికొందరు పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని గుట్టచప్పుడు కాకుండా ఉంటున్నారు. మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోజు రోజుకు పెరిగి పోతున్న కామాందుల అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందుగా విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలి. ఆత్మరక్షణకోసం అనుసరించాల్సిన ప్యూహాలపై ప్రత్యేక శిక్షణ అవసరం. జనవరి నుంచి జిల్లాలో నమోదైన కేసుల వివరాలతో ప్రత్యేక కథనం. 42 మంది అరెస్ట్.. మైనర్ బాలికలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, ఈవ్‌టీజింగ్ వంటి సంఘటనలపై ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 51కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. తాగిన మైకంలో మానసిక వికలాంగులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు కొందరుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయి మనుమరాలు వయస్సున్న వారిపై అత్యాచారాలకు ఒడిగట్టిన ప్రబుద్దులు కూడా ఉండటం శోచనీయం. ఇలా ఈ ఏడాది జనవరిలో 07, ఫిబ్రవరి 06, మార్చి 08, ఏప్రిల్ 07, మే 06, జూన్ 05, జులై 07, ఆగస్టు 03, సెప్టెంబర్ 03 కేసులు నమోదు చేశారు. ఇందులో 42 కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరో 10 కేసులు ఇంకా విచారణ దశలో ఉండటం గమనార్హం. అవగాహనే కీలకం మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం అవసరమని మహిళా సంఘాల నాయకులు చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వం జిల్లా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు పద్ధతుల ద్వారా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన కార్యక్రమాల్లో ఓ మహిళ వేధింపులకు గురవుతున్న విషయం చెప్పడం గమనార్హం. అదేవిధంగా ప్రతీ మంగళవారం పాఠశాలలు, కళాశాలల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని మహిళలు కోరుతున్నారు. ఆకతాయి ఆటకట్టు సిద్దిపేట పట్టణానికి చెందిన విద్యార్థిని స్థానిక ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. సిద్దిపేట పట్టణానికి చెందిన అకతాయి యువకుడు తరుచూ.. విద్యార్థిని వెంబడించడం, సూటిపోటీ మాటలతో ఇబ్బందులకు గురిచేసేవాడు.. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మఫ్టీలోని పోలీసులు అకతాయిని పట్టుకొని దేహశుద్ధి చేయడమే కాకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించి యువకుడిని పంపించారు. కఠినంగా శిక్షించాలి మైనర్ బాలికలనే కాదు.. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలను కూడా చిధిమేస్తున్న దుర్మార్గులు సమాజంలో ఉండటం సిగ్గుచేటు. వారికి తల్లి, అక్క, చెల్లి ఉంటారు కదా.. కామంతో కళ్లు మూసుకపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించించాలి. ప్రభుత్వం ఇప్పటికే మహిళల రక్షణకు అనేక చట్టాలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు. –బూర విజయ, మహిళ శిశుసంక్షేమ శాఖ కో–ఆర్డీనేటర్ ఫోక్సో చట్టం అమలు చేస్తున్నాం మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపై పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. వీరికోసం ప్రత్యేకంగా ఫోక్సో చట్టం అమలు చేస్తున్నాం. ఫిర్యాదులు రాగానే విచారణ చేసి కేసు నమోదు, అరెస్టులు చేస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల్లో ప్రతీ మంగళవారంమ రక్షణ చట్టాలపై అవగాహన కల్సిస్తున్నాం.. నిర్భయంగా 100కు డయల్ చేసి ఫిర్యాదు చేస్తే చాలు.. –జోయల్ డేవీస్, జిల్లా పోలీస్ కమిషనర్ -
హత్యచేసి బావిలో పడేశారు
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): అనుమానస్పద మృతిగా బావించిన మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లిలో మృతురాలి శవం లభించిన బావి వద్ద ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలత బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. శ్రీలత కనిపించకుండాపోయి బావిలో శవమై తేలడంతో ఆగ్రహించిన శ్రీలత బంధువులు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ముందు నుంచి శ్రీలతను హత్యచేసి బావిలో పడేశారని పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. మల్లుపల్లిలో విచారణ చేపడుతున్న డీఎస్పీ కిరణ్‌కుమార్ ఈ విషయంపై గ్రామంలో విచారణ జరిపిన డీఎస్పీ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల నమోదు కోసం వ్యవసాయ బావి వద్ద పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీలత అనుమానస్పద మృతిపై విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎవరనేది తమ విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. శ్రీలత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ ఉన్నారు. -
గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, దుబ్బాక: సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కరుణాకర్ (14) అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత సరిగా రాక చెరువులో ప్రమాదకరంగా ఉన్న జేసీబీ గుంతలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం పాఠశాలలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం ఎలుగోయ గ్రామానికి చెందిన అలిగె వసంత, అశోక్ దంపతుల ఏకైక కుమారుడు కరుణాకర్ (14) మండల పరిధిలోని చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి ‘బి’ సెక్షన్ చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. కరుణాకర్ చిన్న తనంలోనే తల్లి అనారోగ్యంతో చనిపోగా, తండ్రి ఇంటి నుంచి ఎటో వెళ్లి పోయాడు. దీంతో కరుణాకర్ యోగ క్షేమాలను తన బాబాయ్ ప్రేమ్ కుమార్ అన్నీ తానై చెప్యాలలోని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నాడు. గోడదూకి ఈతకు వెళ్లి.. మంగళవారం రోజున కరుణాకర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కలిసి రహస్యంగా ఎవ్వరికి చెప్పకుండా పాఠశాల ప్రహరీ గోడ దూకి అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిననట్లు సమాచారం. అందులో ఇద్దరు విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లగా, కరుణాకర్ సాయంత్రమైనా పాఠశాలకు వెళ్లలేదని తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి పాఠశాలలో కరుణాకర్ కనిపించడం లేదని గ్రహించిన ఉపాధ్యాయులు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్లతో గాలింపు.. సాయంత్రం అల్వాల శివారులోని జింకని చెరువులో కరుణాకర్‌కు చెందిన బట్టలు, చెప్పులు లభ్యమయ్యాయి. అనుమానంతో రాత్రి వరకు జేసీబీ గుంతలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. తిరిగి బుధవారం తెల్లవారు జామున దుబ్బాక సీఐ హరికృష్ణ, మిరుదొడ్డి ఎస్ఐ ఎండీ. జమాల్, భూంపల్లి ఎస్ఐ రాజేష్‌ల నేతృత్వంలో తాళ్ళు, వలలు వినియోగించి గజ ఈతగాళ్ళతో చెరువులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తరువాత కరుణాకర్ మృత దేహాన్ని వెళికి తీశారు. అదృశ్యమయ్యాడనుకున్న విద్యార్థి చెరువులో శవమై తేలడంతో గురుకుల పాఠశాలలో విషాదం అలుముకుంది. విద్యార్థి కరుణాకర్ మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చెరువులో పడి మృతి చెందిన కరుణాకర్ మృతదేహాన్ని తమకు చూపించకుండా, ఎలాంటి సమాచారం అందించకుండా పోస్టు మార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని మృతుడు విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుకుల పాఠశాల ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ బృందం సభ్యులు మద్ధతు తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చనిపోయిన విద్యార్థిని పాఠశాల వద్దకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయాన్ని అడిగి తెలుసుకుందామని వచ్చిన ఆర్సీఓ నిర్మల కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆర్సీఓతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లేకనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరవింద్, భిక్షపతి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జోగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ఘ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులతో వాగ్వివాదాలు జోరందుకోవడంతో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగేలా చర్యలు గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కేసుకు సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే తమకు పిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని దుబ్బాక సీఐ హరికృష్ణ విద్యార్థి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమనిగింది. కాగా గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై ఎంపీపీ గజ్జెల సాయిలుతో పాటు, తహసీల్దార్ పద్మారావు, ఎంఈఓ జోగు ప్రభుదాసు, ఎంపీడీఓ సుధాకర్ రావు, ఆర్ఐ శ్రీనివాస్, అల్వాల, చెప్యాల సర్పంచులు ఎనగంటి కిషయ్య, మాసపురం లక్ష్మిలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన
సాక్షి, హుస్నాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అనంతరం కట్నం తీసుకురావాలని భర్త ఇంటి వారు వేధించడం మొదలు పెట్టారు. కట్నం తెస్తేనే కాపురానికి రావాలని ఇంటికి పంపించారు. దీంతో దిక్కుతోచని ఆ అభాగ్యురాలు కాపురానికి తీసుకెళ్లాలని అత్తగారి ఇంటి ఎదుట బైఠాయించింది. అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని అత్తగారి ఇంటి ఎందుట భార్య తన ఇద్దరు ఆడ పిల్లలతో బైఠాయించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇంటి బయట ఇద్దరు పిల్లలతో భారతి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇవి.. మంచిర్యాల జిల్లా, కౌటపల్లి మండలం, రోయ్యలపల్లి గ్రామానికి చెందిన భారతి అనే యువతికి మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన మజ్జిగ రంజిత్‌తో 2015లో జనగామ జిల్లా హనుమాన్ గుడిలో పెళ్లి జరిగింది. నాలుగేళ్ల క్రితం ఫేక్‌బుక్, వాట్సాప్‌లో పరిచయం ఏర్పండి అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తరువాత రూ.20లక్షలు కట్నం తీసుకొనిరావాలని ఇబ్బందులకు గురి చేస్తూ హింసింస్తున్నారని భారతి వాపోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని తన భర్త ఇంటి మందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న అత్తామామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది భారతి. గ్రామంలోని మహిళలు కూడా భారతికి మద్దతుగా నిలిచారు. -
చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..
చిన్నశంకరంపేట(మెదక్): వివాహిత మహిళలను వేదింపులకు గురిచేసి చంపి బావిలో పడేశారని ఆరోపిస్తు చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కూల శ్రీలత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కుల లింగం భార్య శ్రీలత(24) సోమవారం బావిలో శవమైతేలింది. ఇంట్లో గొడవపడి ఆదివారం ఇంటి నుంచి వెల్లిన శ్రీలత బావిలో పడి శవమై తేలడంతో, శ్రీలత తల్లి గ్రామమైన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం భాగీర్థపల్లి గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా మంగళవారం మధ్యాహ్నహం మల్లుపల్లి గ్రామస్తులు, భాగిర్థిపల్లి గ్రామస్తులు పెద్దల సమక్షంలో విషయంపై పంచాయితీలో మాట్లాడుతుండగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా గుంపుగా మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మి భర్త శంకరయ్యపై దాడికి దిగారు. విషయం గ్రహించిన పోలీస్‌లు వెళ్లి శంకర్యను వారి భారి నుంచి కాపాడి పోలీస్‌స్టేషన్ కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ ఎదుట చేరి శ్రీలతను హత్య చేసీ బావిలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్యతో పాటు శ్రీలత అత్త, భర్తలను తమకు అప్పగించాలని పోలీస్‌లతో వాగ్వావాదానికి దిగారు. దీంతో తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ భాగిర్థపల్లి గ్రామస్తులను సముదాయించారు. భాగిర్థపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్‌లతో మాట్లాడి గ్రామస్తులను పోలీస్‌స్టేషన్ బయటకు తీసుకువెళ్లాలని లేదా లాఠీ చార్జి చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో వారు గ్రామస్తులను సముదాయించి బయటకు తీసుకువెళ్లారు. భర్త, అత్తపై కేసు నమోదు... శ్రీలత మృతికి కారణమైన భర్త లింగం, అత్త కళవ్వలపై కేసు నమోదు చేసినట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు. శ్రీలతను అత్తింటివారే వరకట్నం వేదింపులకు పాల్పడి హత్యచేశారని తల్లి బాలవ్వ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా అనంతరం పోస్ట్‌మార్టం కోసం మెదక్ అస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తూప్రాన్ సీఐ స్వామిగౌడ్, డీఎస్పీ కిరణ్‌కుమార్ సంఘటనా స్థలం పరిశీలించారు. -
మద్యం మత్తులో వివాహితపై..
మెదక్ ,తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో వివాహితపై అర్ధరాత్రి అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని గోవర్ధన గిరి మదిర చిన్న ముత్యంపేట (పిట్టలవాడ)లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 56 వయస్సు ఉన్న వ్యక్తి అదే గ్రామానికి చెందిన 28 సంవత్సరాల వివాహిత నివసిస్తున్న గుడిసెలోకి గురువారం అర్ధరాత్రి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్రంగా ప్రతిగడిచింది. వెంటనే ఆమె ఆరవడంతో పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పరిస్థితినిని గ్రామ పెద్దలకు వివరించింది. వెంటనే పంచాయతీ నిర్వహించి అతన్ని పిలిపించి నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళలు ఆ వ్యక్తి పై కారంపొడి చల్లుతూ చితకబాదారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని మహిళలు గ్రామ పెద్దలను కోరారు. మరోసారి జరగకుండా చూస్తామని హామీనివ్వడంతో వారు శాంతించారు. -
పథకం ప్రకారమే హత్య
సాక్షి, మెదక్ : అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందని డీఎస్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి శివారులో హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన విజయ(26) అనే మహిళను ఈ నెల 18న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటన పై చేపట్టిన విచారణలో కేసును ఛేదిం చిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో మృతిరాలి భర్తే ప్రధాన సూత్రధారి అని తేలినట్లు వివరించారు. భర్తను, పిల్లలను పట్టించుకోలేదు.. మృతురాలు విజయకు కెతావత్ దేవులతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా దేవుల బతుకుదెరువు కోసం గత ఏడాది మలేషియాకు వెళ్లి ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకుంటున్న భార్య విజయ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త దేవులను, ఇద్దరు పిల్లలను పట్టించుకోలేదన్నారు. అలాగే తన ప్రాణానికి హాని ఉందనే ఉద్దేశ్యంతో చెడు తిరుగుళ్లు తిరుగుతున్న భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసినట్లు తెలిపారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న రూప్‌సింగ్‌తో పాటు మదన్ అనే ఇద్దరు తండా వాసుల సహకారం తీసుకున్నారు. అత్యచారం.. హత్య ఈ నెల 17న రూప్సింగ్ విజయను తీసుకొని సినిమాక్స్‌లో నడుస్తున్న రణరంగం సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మెదక్ పట్టణంలోని వైన్స్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసి అవుసులపల్లి శివారులోని నిర్మానుష్యమైన ప్రదేశానికి రాత్రి 8:30 గంటలకు తీసుకెళ్లారు. అక్కడ రూప్సింగ్, మధన్‌లు విజయకు ఎక్కువగా మద్యం తాగించి అత్యాచారం చేసి, ఆపై చీరతోనే ఆమె గొంతు నులిమి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం అంతటిని ఎప్పటికప్పుడు మృతురాలి భర్త ఫోన్‌ద్వారా తెలుసుకుంటున్నారని తెలిపారు. రూ.10వేలకు ఒప్పందం.. హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేకుండా మృతురాలి భర్త దేవుల బందువులకు ఫోన్ చేసి భార్య కనపడటం లేదని నటించినట్లు తెలిపారు. తన భార్యను హతమారిస్తే రూ. 10వేలు ఇస్తానని దేవుల చెప్పినట్లు నిందితులు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాగా సినీఫక్కీలా చేసిన హత్య ఉదంతాన్ని అత్యంత చాకచక్యంగా చేధించిన పోలీసులను అభినందించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి హత్య కేసులో నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లింబాద్రి, శ్రీకాంత్, కృష్ణ, బాషిత్అలీ, రాములు, విజయ్, యాదగిరి, వెంకట్‌లను ప్రశంసించారు. ఈ విషయంలో అధికారులకు రివార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. -
నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి
సాక్షి, సిద్దిపేట: క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసే డాటాలో తప్పులుండొద్దని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు సీసీటీఎన్ఎస్, కోర్టు మానిటర్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా.. ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, అందు కోసం కన్వెక్షన్(నిందుతులకు శిక్ష పడే రేటు) పెంచాలన్నారు. దీని ద్వారా ప్రజల్లో డిపార్ట్‌మెంట్‌పై మంచి అభిప్రాయం కలుగుతుందని, అలాగే క్రైమ్ రేటు తగ్గుతుందని సూచించారు. ట్రయల్ నడిచే కేసుల్లో సాక్ష్యం ఎలా చెప్పాలో ముందే ప్రిపేర్ చేయాలని, కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు కొన్ని ముఖ్యమైన కేసులు అడాప్ట్ చేసుకోవడం జరిగిందని, ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. సుప్రీం కోర్టు పోక్సో కేసులపై ఒక కమిటీ మానిటర్ చేస్తుందని, రాష్ట్రంలో ఉమెన్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులు సీసీటీఎన్ఎస్ మానిటర్ చేస్తున్నారన్నారు. అందువల్ల డాటా ఎంట్రీ చేసేపుడు ఏలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. పోలీస స్టేషన్ల వారీగా యాక్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో త్వరలో లిస్ట్ అవుట్ చేసి పంపాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు అవసరమైన పత్రాలు, సాక్షుల వాంగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో బాధ్యతగా ఉండాలన్నారు. కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో ప్రతిభ కనబర్చి నిందితులకు శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామన్నారు. సీసీటీఎన్ఎస్ కోర్టు మానిటర్ సిస్టంలో డాటా ఏ విధంగా ఏంట్రీ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్స్ సిబ్బంది శ్రీధర్, స్వామిలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీటీఎస్ఎన్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ హబీబ్‌ఖాన్, టాస్క్‌ఫోర్స్ సీఐ లక్ష్మణ్, కోర్టు లైజనింగ్ హెడ్‌కానిస్టేబుల్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!
సాక్షి, సిద్దిపేట: ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఏదో ఒక చోట చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావివరుసలు వయసు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చట్టం కళ్లు కప్పి తప్పించుకునే వారు కొందరైతే.. చేసిన పాపానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించి జీవితాంతం చిత్రహింసలను చవిచూసేవారు మరికొందరు.. ఇటువంటి మానవ మృగాలకు ఏ శిక్ష వేసినా తక్కువే అంటున్నారు జిల్లా ప్రజలు. ఇటీవల వరంగల్‌లో పసికందుపై అత్యాచారం.. ఆపై హత్య సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. ఆ ఆఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమైంది. నాలుగేళ్లలో జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. దీంతో వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది. అనేది చర్చించుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఎవరి ఉపేక్షిం చేది లేదంటున్నారు. ఇటీవల వరంగల్‌లో తొమ్మిది నెలల పసికందుపై ఆత్యాచారం ఆపై హత్య సంఘటన ప్రతీ ఒక్కరికి కన్నీరు తెప్పించింది. అయితే ఆ ఆఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటువంటి కేసులు జిల్లాలో కూడా చోటు చేసుకోవడంతో వారికి శిక్ష ఎప్పుడు పడుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో నమోదైన ‘పోక్స్’ కేసులపై విచారణ జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదంటున్నారు జిల్లా పోలీస్ అధికారులు. గతేడాది మేలో సిద్దిపేటకు చెందిన బాలికపై అదే కాలనీలో ఉంటున్న పశువుల కాపరి కన్నెసి దారుణానికి ఒడిగట్టాడు. బాలక వయసుకు ఆ ప్రబుద్దుడి వయసుకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అతడికి తాత వయసు ఉంటుంది. బాలిక బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రిమాండ్‌కు పంపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది మేలో జగదేవ్‌ఫూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలకకు ఆటోడ్రైవర్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వశపర్చుకున్నాడు. నమ్మిన బాలిక ఆ యువకుడితో కలిసి నిర్మాణుష్య ప్రదేశానికి వచ్చింది. అప్పటికే ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం స్నేహితులు సిద్ధంగా ఉండటంతో ఐదుగురు యువకులు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని రోడ్డుమీదనే వదిలేసి వెళ్లారు. అటుగా వచ్చిన వారు బాలికను చూసి ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు కాగా ఇంకా కేసు విచారణలోనే ఉంది. ఇలా జిల్లాలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా గడిచిన నాలుగు సంవత్సరాల్లో పోలీసు లెక్కల ప్రకారం 201 పోక్స్ కేసులు నమోదు కావడం విచారకరం. అయితే ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా విచారణ పూర్తి కాలేదు. అన్ని కేసులు విచారణలో ఉన్నాయి. అయితే ఇందులో 30 కేసులు మాత్రం డీఎన్ఏ, ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు నిర్వహించగా. వాటికి సంబంధించిన విచారణకు ఈ నివేదికలే కీలకంగా మారాయి. నమ్మిన వారే మోసగాళ్లు.. జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా నమోదైన బాలికల లైంగిక వేధింపుల కేసుల్లో అత్యధికంగా తెలిసిన వారి ద్వారనే జరగడం గమనార్హం. కుటంబ సభ్యులు వరుస వాయిలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా ఒకే పాఠశాల, కళాశాలో చదివిన వారు, ఒకే కాలనీకి చెందిన వారు కూడా ఉన్నారు. అదే విధంగా తెలిసీ తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణకు లోనై ప్రియుడు చెప్పే మాయ మాటలకు నమ్మి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా పోక్స్ కేసుల్లో అత్యధిక శాతం నమ్మినవారు, తెలిసిన వారు ఉండటం శోచనీయం. అదే విధంగా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం, బాలికల వివాహాలకు ఇబ్బంది అవుతుందని పలు సంఘటనలు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు సరైనదే.. అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తీర్పు ఉక్కుపాదంలా పనిచేస్తుంది. సంఘటనపై త్వరగా స్పందించిన కోర్టు తీర్పునివ్వడం హర్షనీయం. ఈ తీర్పు నిందితుల్లో భయం కలిగించింది. పోలీసులు సంఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. మరోసారి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రజల్లో చైతన్యం రావాలి. –చందనాదీప్తి, ఎస్పీ, మెదక్ జిల్లా తప్పుచేసిన వారిని వదిలి పెట్టం.. తప్పుచేసిన వారిని శిక్షించేందుకే పోలీస్ వ్యవస్థ ఉంది. బాలికలపై అత్యాచారాలు వంటి విషయంలో మరీ కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకోసమే ఇటువంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి కేషీట్ వేస్తున్నాం. వీలైనంత త్వర గా కేసును చేధిస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల కు నమ్మకం కలుగుతుంది. ఆదిశలోనే జిల్లాలోని కేసుల విచారణ వేగవంతం చేశాం. – జోయల్ డేవీస్, సీపీ సిద్దిపేట -
చైన్స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు
సాక్షి, జోగిపేట(మెదక్) : ఇంటి మెట్లపై కూర్చున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు తెంపుకెళ్లడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని దొంగలపై మహిళలు మూకమ్మడిగా తిరగబడిన సంఘటన బుధవారం జోగిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఆర్యసమాజ్ కాలనీలో నివాసం ఉంటున్న భారతమ్మ తమ ఇంటి మెట్లపై కూర్చొని ఉంది. అటువైపుగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇళ్ల సమాచారం అడిగారు. మహిళ వంగి చూపిస్తుండగా మెడలోని పుస్తెలతాడు తెంపుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న మహిళ పుస్తెలతాడు పట్టుకున్న దొంగను గట్టిగాపట్టుకుంది. సంఘటన చూసిన ఇతర మహిళలు వారిపై తిరగబడ్డారు. మహిళల ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకొన్న దొంగలు వట్పల్లివైపు పారిపోయారు. బైకు నడుపుతున్న వ్యక్తి నల్లరంగు షర్టు ధరించి హెల్మెట్ «పెట్టుకోగా, వెనుక కూర్చున్న వ్యక్తి గులాబి రంగు షర్టు ధరించి ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్ఐలు తిరుపతిరాజు, వెంకటరాజాగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బైకుపై వచ్చిన యువకుల ఆనవాలు చెప్పడంతో ఎస్ఐ బైకుపై జేఎన్టీయూ వైపు వెళ్లి అనుమానితులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన పోలికలు లేకపోవడంతో వారిని వదిలిపెట్టారు. వెంటనే వట్పల్లి, అల్లాదుర్గం, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను ఎస్ఐ వెంకటరాజాగౌడ్ పరిశీలించగా. అయితే దొంగలు డాకూరు రోడ్డు మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. దొంగలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల వాసవీనగర్‌లో జరిగిన సంఘటనతోనూ వీరికి సంబంధం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..
సాక్షి, తూప్రాన్ : బైక్‌ను దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ సుభాశ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల26న పోతరాజ్‌పల్లి కమాన్ వద్ద కిష్టయ్య ఓటల్‌వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సోమవారం ఉదయం అల్లాపూర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకొని విచారించగా వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లభించలేదని అన్నారు. ఈ వాహనం గత మూడు రోజుల క్రితం చోరీకి గురైనట్లుగా గుర్తించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వర్గల్ మండల కేంద్రానికి చెందిన సుధాకర్‌గా గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!
సాక్షి, పటాన్చెరు: భర్త చనిపోయిన మహిళ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన చిలకముక్కు కిషన్ బ్రతుకుదేరువు కోసం ఐదేళ్ల క్రితం పటాన్‌చెరుకు వచ్చారు. పట్టణంలోని చైతన్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా వీరి పెద్ద కుమారుడు లింగంకు పటాన్‌చెరుకు చెందిన భర్త చనిపోయిన మహిళతో ప్రేమవ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న లింగం కుటుంబ సభ్యులు తమ కూమారుడు జోలికిరావద్దని మహిళను హెచ్చరించారు. అయితే తనను ప్రేమించాలని లేదా సహజీనం చేయాలని వేధించేదని మృతుడు కుటుంబసభ్యులకు తెలిపాడు. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో లింగం ఉరివేసుకున్నాడు. పక్కగదిలో ఉన్న రామకృష్ణ వెళ్లి చూడగా సీలింగ్ రాడ్డుకు వేలాడుతూ కనిపించాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా మృతుడి జేబులో దొరికిన ఉత్తరం ప్రకారం సహజీవనం కోరిన మహిళ రూ.60 వేలు తీసుకురావాలని వేధించిందని పేర్కొన్నాడు. తమ కుమారుడి మృతికి కారణమైన మహిళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లింగం తండ్రి కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఆస్పత్రిలో పరిచయం: ఆపై తరచూ ఫోన్లో..
సాక్షి, పటాన్చెరు: లక్డారం శివారులో గుర్తు తెలియని మహిళ ఈ నెల 13న హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన అంజిలమ్మపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అంజిలమ్మ కూతురు మమత ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ నరేష్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు బతుకుదెరువు కోసం హైదరాబాద్ గచ్చిబౌలి లో భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గతంలో రాములు భార్య రాములుతో గొడవపడి యాసిడ్ తాగింది. దీంతో ఆమెను చికిత్స కోసం రాములు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా నంచర్ల గ్రామానికి చెందిన అంజిలమ్మ అదే సమయంలో తన తల్లిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆ సమయంలో రాములు, అంజిలమ్మకు పరిచయం ఏర్పడింది. తర్వాత అంజిలమ్మ, రాములు తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఈ నెల 12న రాములు అంజిలమ్మను చేవెళ్లలో కలసి మండల పరిధిలోని లక్డారం గ్రామానికి బైక్‌పై తీసుకువచ్చాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి లక్డారం గ్రామ శివారులోని నింగసానికుంట వద్ద ఉన్న నిర్మానుష ప్రదేశంలో మద్యం సేవించారు. అనంతరం శారీరకంగా కలిసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రాములు తన హెల్మెట్‌తో కొట్టి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడుతో అంజిలమ్మ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం అంజిలమ్మ పుస్తెలు తాడు, ఫోన్ తీసుకొని రాములు వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా రాములును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తానే అంజిలమ్మను చంపిన్నట్లు ఒప్పుకున్నాడు. కాగా రాములుపై హైదరాబాద్, సైబరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 హత్య కేసులు, 4 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు మాయని రాములును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..
సాక్షి, సంగారెడ్డి: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం పట్టణ సీఐ డి.వెంకటేష్ తెలిపారు. అప్పుగా ఇచ్చిన రూ.95 వేలను తిరిగి ఇమ్మన్నందుకే భూమమ్మ అనే మహిళను భార్యభర్తలైన మన్నె వీరేశం, రేణుకలు హత్య చేశారని తెలిపారు. రాజంపేట కాలనీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న యెర్ర భూమమ్మ (41) భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు భూమమ్మ హత్యపై అన్ని కోణాల్లో కేసును పరిశోధించామన్నారు. భూమమ్మది టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామం అని తెలిపారు. రాజంపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు పని చేస్తున్న నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి కాలనీకి చెందిన మన్నె వీరేశం, అతని భార్య రేణుకలను ఈ కేసు విషయమై విచారించామన్నారు. వీరేశం భూమమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను డబ్బులు అడిగాడు. దీంతో ఆమె తన భర్తకు తెలియకుండా రూ. 95 వేలు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగివ్వమని అడగడంతో 7 నెలల క్రితం కిరాయి గది ఖాళీ చేసి నర్సాపూర్‌కు వెళ్లారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తుండడంతో వీరేశం అతడి భార్య రేణుకలు ఇద్దరు కలిసి భూమమ్మను చంపాలని పథకం వేశారన్నారు. ఈ క్రమంలో మే 11న దౌల్తాబాద్‌కు రమ్మని చెప్పి ఓ చెరువు వద్ద ఫుల్లుగా మద్యం తాగించడంతో భూమమ్మ స్పృహ కోల్పోయింది. ఈ సమయంలో వీరేశం, రేణుకలు ఇద్దరూ కలిసి బండరాయితో భూమమ్మను కొట్టి చంపి వేశారు. అనంతరం సెల్‌ఫోన్, వెండి కాళ్ల కడియాలు, పుస్తె, గుండ్లు ఎత్తుకెళ్లి సాక్ష్యం లభించకుండా చేశారని చెప్పారు. ఒంటిపై బట్టలు తొలగించి సంగారెడ్డి గాలి పోచమ్మ గుడి దగ్గర చెరువులో శవాన్ని వేశారని వివరించారు. నిందితులను అరెస్టు చేసి ఈ నెల 16న జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు: మద్యం మత్తులో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మరెల్లి గ్రామానికి చెందిన అంజనేయులు(40) బతుకుదేరువు కోసం 20 సంవత్సరాల క్రితం వచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ గౌతంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న అంజనేయులు మద్యంతాగి ఇంటికి వచ్చి తన పెద్ద కూతురును ఇష్టం వచ్చిన్నట్లు తిట్టి, కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మరసటి రోజు భార్య లక్ష్మి, పిల్లలను తీసుకొని భర్త అంజనేయులు కోసం వెతుకుతూ మంగళవారం రాత్రి బంధువుల ఇంటి వద్ద ఉండి పోయింది. బుధవారం మద్యం సేవించి వచ్చిన అంజనేయులుకు ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్టూడెంట్ పోలీస్తో దురాచారాలకు చెక్!
సాక్షి, మెదక్: మున్సిపాలిటీ: సమాజంలో దురాచారాలను పారదోలేందుకే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర గార్డెన్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవడం పోలీస్ శాఖ మొదటి కర్తవ్యమన్నారు. పోలీస్ శాఖకు కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద లింగ బేధం తేడా ఉండవని, అందరికి సమన్యాయం చేస్తూ పని చేసేదే వ్యవస్థ అని వివరించారు. ఈ వ్యవస్థలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను భాగస్వాములను చేస్తూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను పారద్రోలే విధంగా వీరిని తయారు చేస్తామన్నారు. అలాగే పోలీస్ శాఖలో ఒక వినూత్న ప్రయోగానికి మెదక్ జిల్లా వేదికయ్యిందన్నారు. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ ఇలా వివిధ రకాల పోలీసులను చూశామని, ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పోలీస్‌ను మెదక్ జిల్లాలో చూడబోతున్నారని తెలిపారు. అతడే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృక్పథంలో మార్పు తెచ్చేందుకు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను రూపుదిద్దుతున్నామని చెప్పారు. ఇది పోలీస్, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన 440 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ సిబ్బందితో ప్రతి శుక్ర, శనివారాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, విద్యాశాఖ నోడల్ అధికారి మధుమోహన్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్బీఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
హత్యా..? ఆత్మహత్యా?
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): అనుమానస్పద స్థితిలో తల్లి కొడుకు మృతిచెందిన సంఘటన నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. కరస్‌గుత్తి గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి భార్య కవిత(28), నాలుగేళ్ల కుమారుడు అయిన దినేష్‌రెడ్డితో కలిసి బుధవారం మధ్యాహ్నం సమయంలో కిరోసితో నిప్పు అంటించుకొని చనిపోయింది. భార్యను కుమారుడిని భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్లు హైదరాబాద్‌లో నివాసం.. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఔరాద్ తాలుక పరిధిలోని బిజల్‌వాడి గ్రామానికి చెందిన తిప్పారెడ్డి, ఉక్కమ్మ దంపతుల కుమార్తె కవిత. ఈమెకు 2009లో నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహం జరిగింది. వివాహం అనంతరం బతుకుదెరువు కోసం తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉన్నారు. ఏడాది క్రితం స్వగ్రామం కరస్గుత్తికి వచ్చారు. ఆస్తి భార్యపేరు మీదకి రావడంతో గొడవలు.. గ్రామంలో వెంకట్‌రెడ్డికి ఉన్న ఎనిమిది ఎకరాల భూమిలో కొంత భాగం అమ్మాడు. వచ్చిన డబ్బులతో ‘తుఫాన్’ వాహనం కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి, తానే స్వయంగా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరికొంత భూమిని సైతం అమ్మడానికి ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు నాలుగు ఎకరాల మేర భూమిని వెంకట్‌రెడ్డి భార్య కవిత పేరుమీదకు మార్చారు. దీంతో అప్పటి నుంచి పలుమార్లు గొడవలు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు అనుమానాస్పద మృతి సంఘటనపై గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతిరాలితోపాటు నాలుగేళ్ల బాలుడు సైతం మృత్యువాత పడటాని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మూడో సారి కావడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. భర్తను అదుపులోకి తీసుకున్నాం: సీఐ హత్యకు సంబంధించి తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతురాలి భర్త చింతాకి వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ఎస్ఐ శేఖర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మృతిపై పలు అనుమానాలు మృతి సంఘటనపై స్థానికులతోపాటు మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. మృతి చెందిన సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి దగ్ధం చేశారని అభిప్రాయపడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే ఇళ్లంతా పలు ఆనవాళ్లు కనిపించేవని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. పక్కనే ఉన్న బట్టలు సైతం కాలిపోకుండా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. కిరోసిన్ కాకుండా పెట్రోల్ వాడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో విచారణ సంఘటనపై పలు అనుమానాలు బలపడటంతో నారాయణఖేడ్ సీఐ వెంకటేశ్వర్రావు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి విచారణ చేయించారు. ఇందుకు సంబంధించిన పలు వస్తువులను సైతం సేకరించారు. కాగా తనిఖీకి వచ్చి డాగ్ ఇంట్లో తిరుగుతూ ఎదురుగా ఉన్న ఓ ఇంటివద్ద నుంచి నేరుగా కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డుకు వెళ్లి కూర్చుంది. -
రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత!
సాక్షి, సిద్దిపేట: గుట్టుగా రవాణా చేస్తున్న రూ. కోటి విలువ చేసే గంజాయిని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ సమీపంలో కేంద్ర ఇంటలీజెన్సి అధికారులు పట్టుకున్నట్లు జిల్లాలో గురువారం ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి సుమారు 962 కేజీల గంజాయిని ఖమ్మం, సూర్యాపేట, జనగామ నుండి సిద్దిపేట సమీపంలోని దుద్దెడ మీదుగా జహీరాబాద్ అక్కడి నుంచి హారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డీఆర్ఐ(డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలెజెన్సీ) అధికాలు దు ద్దెడ టోల్గేట్ సమీపంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అందులో రూ. కోటికి పైగా విలువచేసే గంజాయి ఉండటంతో రవాణా చేస్తున్న వారిని, వాహనాన్ని నేరుగా హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి మహారాష్ట్రకు తరచుగా రవాణా అవుతుందని, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జి ల్లాల మీదుగా జహీరాబాద్ అక్కడి నుంచి మహారాష్ట్రకు సులభంగా తరలించే అవకాశం ఉన్నందున ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ దందా జరుగుతుందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఏకంగా రూ. కోటి విలువచేసే గంజాయి రవాణా అవుతూ పట్టుబడిన విషయం జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులకు కూడా తెలియకపోవడంపై జిల్లాలో చర్చ సాగుతోంది. -
భార్య ప్రియుడితో పరార్.. వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘనట మండల పరిధిలోని రావురూకుల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన చెత్రి బాలకిషన్‌కు పెద్దమల్లారెడ్డిపేటకు చెందిన లావణ్యతో నాలుగు నెలల కిత్రం వివాహం అయింది. వారం రోజుల క్రితం లావణ్యను తల్లితండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో లావణ్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై లావణ్య తల్లిదండ్రులు బాలకిషన్ ఇంటికి ఫోన్ చేసి లావణ్య ఇంటికి వచ్చిందా అడగగా రాలేదని చెప్పారు. దీంతో గ్రామంలో విచారణ చేయగా లావణ్య ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలకిషన్ 9వ తేదీన తన పెద్దనాన్న కుమారుడికి ఫోన్ చేసి బావివద్ద పురుగుల మందు తాగుతున్నట్లు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకునే సరికి బాలకిషన్‌ను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రాథమికి చికిత్స అందించిన అనంతరం వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వారు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, బాలకిషన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడిపై కేసు
కొండపాక(గజ్వేల్): ఓ ప్రైవేటు స్కూల్లో తోటి ఉపాధ్యాయురాలిని వేధించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైన సంఘటన దుద్దెడలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ అంశంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధి.లోని దుద్డెడలో గల ఓ ప్రైవేటు పాఠశాలల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన పడిగే గణేష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిని కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తుండటంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా గణేష్‌లో మార్పు రావడం లేదని తెలిపారు. దీంతో మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై పరమేశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడని ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
జీతం రాక.. కుటుంబం గడవక
తూప్రాన్/రాయపోలు(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ–2 ఎల్లగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్న సీహెచ్ మల్లయ్య(38) అనే కానిస్టేబుల్ సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో బాధపడుతున్నాడు. ఇద్దరు కుమారుల చదువులు, ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో తీసుకున్న రుణానికి వాయిదాలు, తదితర కారణాలతో నిత్యం బాధ పడుతుండేవాడన్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో 15 రోజుల పాటు డ్యూటీకి వెళ్లలేదు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు గత నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వడంలేదు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఏదురయ్యాయి. మానసికంగా కుంగిపోయాడు. ఈ నెల 16న డ్యూటీ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడన్నారు. అప్పటి నుంచి తనలో తానే బాధపడుతూ మాససికంగా మదనపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించిన మల్లయ్య తెల్లవారేసరిగా బెడ్రూంలోని కిటికీ ఊచలకు తన లుంగీతో ఊరివేసుకుని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య అనూష, ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్‌లు ఉన్నారు. కాగ ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక సీఐ లింగేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరమార్శించి ఓదార్చారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్డం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ముఖం చెక్కేసి.. కనుగుడ్లు పెరికి..
వర్గల్(గజ్వేల్): ఎక్కడో హతమార్చారు..గుర్తుపట్టరాకుండా ముఖం చెక్కేశారు.. కనుగుడ్లు పీకేశారు.. ఈ దారుణానికి ఒడిగట్టిన గుర్తుతెలియని ఆగంతకులు వ్యక్తి మృతదేహాన్ని వర్గల్ మండలం మీనాజీపేట రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోని కాలువలో పడేసి వెళ్లి పోయారు. కలకలం రేపిన ఈ సంఘటన వర్గల్ మండలం మీనాజీపేట అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం సందర్శించారు. డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ శివలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 30–35 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తిని ఎక్కడో హతమార్చారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ముఖాన్ని చెక్కేశారు. కనుగుడ్లను పీకేశారు. మీనాజీపేట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన బంధం చెడావు అటవీ ప్రాంతం వద్ద కాలువలో మృతదేహాన్ని పడేసిపోయారు. గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి గౌరారం పోలీసులకు సమాచారం చేరవేశారు. రంగంలోకి డాగ్ స్క్వాడ్ మీనాజీపేట అడవిలో బోర్లాపడి ఉన్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టరాకుండా ముఖం చెక్కేసి ఉండడంతో క్లూస్ టీమ్‌ను, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. వారు అక్కడ పలు ఆధారాలు సేకరించారు. అనంతరం గ్రామ వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు మీనాజీపేట అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించి హతుడెవరు, హంతకులెవరో తేల్చేందుకు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం తెలిపారు. మృతుడు 30–35 సంవత్సరాల మధ్య వయస్కుడని, బూడిద రంగు ప్యాంటు, అదే రంగు టీషర్టు ధరించి ఉన్నాడని వివరించారు. చేతికి ఇత్తడి కడియం, మెడలో రోల్డ్‌గోల్డ్ గొలుసు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో బుధవారం వరకు భద్రపరుస్తామని, ఆనవాళ్లు తెలిసిన వారు గజ్వేల్ రూరల్ సీఐ సెల్ నంబర్ 94906 17022 లేదా గౌరారం ఎస్సై సెల్ నంబర్ 94409 01839కు సమాచారమివ్వాలని సూచించారు. -
అమ్మా, నాన్నా నన్ను క్షమించండి
కంగ్టి(నారాయణఖేడ్): దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నందున జీవితంపై విరక్తి కలిగింది. అందుకే... అమ్మా, నాన్నా మీ రుణం తీర్చుకోలేక పోతున్నాను. క్షమించండి.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకుడు మైలారం విఠల్(23). స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ గ్రామానికి చెందిన మైలారం హన్మంతు భార్య రాజవ్వతో కలిసి గత వారంలో మెదక్ పట్టణానికి వలస కూలీ పనుల కోసం వెళ్లాడు. కాగా బుధవారం వారి కొడుకు విఠల్ మెదక్ చేరుకొన్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు రాత్రి 9 గంటలకు చర్చి కాంపోండ్‌లో విగతజీవుడై కన్పించారు. డిగ్రీ చదువు పూర్తి చేసి గత రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో కంపెనీల్లో పని చేసేవాడు. ఆకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోధనకు అంతులేదు. మృతుడి తండ్రి హన్మంతు మెదక్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
యువతి దారుణ హత్య
వర్గల్(గజ్వేల్): గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఎక్కడో హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కల్వర్టు కింద పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ అమానవీయ ఘటన సోమవారం వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ క్షేత్రం పక్కనే రాజీవ్ రహదారి కల్వర్టు కింద వెలుగుచూసింది. ఘటన స్థలాన్ని గజ్వేల్ ఏసీపీ నారాయణ, రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై వీరన్నలు పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి గజ్వేల్ ఏసీపీ నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 22–25 సంవత్సరాల మధ్య వయసున్న గుర్తు తెలియని యువతిని పథకం ప్రకారం గుర్తు తెలియని అగంతకులు ఎక్కడో చంపేశారు. సింగాయపల్లి అడవి పక్కనే రాజీవ్ రహదారి కల్వర్టు కింద పడేశారు. ముఖం మీద, శరీరంపై పెట్రోల్ చల్లి తగులబెట్టారు. మృతదేహం గుర్తుపట్టరానంతగా కాలిపోయింది. కల్వర్టు గోడలో మృతదేహం ఉండడం వల్ల ఎవరూ గుర్తించలేదు. సోమవారం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించిన అనంతరం అక్కడే పోస్టుమార్టం జరిపి ఖననం చేశారు. నాలుగు రోజుల క్రితం హత్య జరిగినట్లు భావిస్తున్నామని ఏసీపీ నారాయణ తెలిపారు. మహిళ హత్య ఘటనపై కేసు నమోదు చేసి ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతురాలి శరీరంపై నలుపు రంగు పంజాబీ డ్రెస్ ఉంది. కాగా డ్రెస్‌పై ఎరుపు రంగు పూలు ఉన్నాయి. ఎడమ చేతికి రోల్డ్ గోల్డ్ ఉంగరం, ఎడక కాలికి నలుపు రంగు దారం ఉంది. కాలును గమనిస్తే వికలాంగురాలు అనిపిస్తున్నది. మహిళ వివరాలు తెలిసిన వారు గజ్వేల్ ఏసీపీ– 83339 98684, గజ్వేల్ రూరల్ సీఐ– 94906 17022, గౌరారం ఎస్సై– 94409 01839కు సమాచారం అందించాలని ఏసీపీ నారాయణ సూచించారు. -
గుట్టల్లో యువతి శవం లభ్యం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గుబ్బడి గ్రామపంచాయితీ పరిధిలోని కవాడి గుట్టల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని చౌడుతండాకు చెందిన లావుడ్య కల్పన(21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లావుడ్య ముత్యాలు–గంగు దంపతుల పెద్ద అమ్మాయి కల్పన. వారికి నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు వివాహం చేశాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం చేసుకుంటా అని కల్పన జీఎన్ఎం చేసుకుంటూ వరంగల్ అర్బన్ జిల్లాలోనే హన్మకొండలో నర్సుగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత నెల 30న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంనేందుకు స్వగామానికి వచ్చిందని మరుసటి రోజున తిరిగి హన్మకొండకు వెళ్తున్న చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కల్పన అనుమానాస్పందగా మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం హాస్టల్ నుంచి కల్పన రాలేదని సమాచారం రావడంతో తల్లిదండ్రులు కల్పన ఆచూకి కోసం గాలిపు చర్యలు మొదలు పెట్టిన్నట్లు గిరిజనులు చెబుతున్నారు. కాగా కవాడి గుట్టల్లో గొర్రెల కాపరి యువతి శవాన్ని గుర్తించినట్లు తెలపడంతో తండావాసులు అక్కడి చేరుకొని మృతదేహం కల్పనగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సందేపోగుల మహేందర్, సీఐ శ్రీనివాస్‌లు పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసినట్లు ఎస్సై పాపయ్యనాయక్ తెలిపారు. -
ప్రియుడితో కలసి మామను...
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ కోడలు తన ప్రియుడిని ఉసిగొల్పి తన మామను హత్య చేయించింది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 30న సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు(60)తన ఇంటికి ప్లాస్టింగ్ చేయించడానికి మేస్త్రీ కొరకు వెళ్లి మూడు రోజుల తర్వాత సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ శివారులో శవమై కనిపించాడు. దీంతో ఈనెల 1న అతడి భార్య దేవమ్మ తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయీ. మృతుడి పెద్దకొడుకు భాగయ్య సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి బొబ్బిలిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండడంతో అప్పుడప్పుడూ పెద్దగొల్ల మల్లేశం మల్లారెడ్డిపేట్ గ్రామానికి వస్తూ వెళ్తుండేవాడు ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మృతుడు రాములు, అతని భార్య దేవమ్మ పెద్దగొల్ల మల్లేశంను, కోడలు నవీనను పలుమార్లు వారించారు. దీంతో నవీన తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను చంపాలి, లేదంటే నేనే నీ పేరుమీద చనిపోతా అని మల్లేశంను ఫోనులో బెదిరించగా.. మల్లేశం నవీన మామ రాములును ఎలాగైనా చంపాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్ 30న తన మామ మేస్త్రీ కొరకు మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు చెప్పగా.. మేస్త్రీ గురించి తమ గ్రామానికి పోదామని తన మోటార్ సైకిల్‌పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం మేస్త్రీ లేకపోవడంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి కల్లు తాగారు. రాములు మత్తులోకి వెళ్లగా తనకు సాయం చేయాలని మొగులయ్య, చాంద్‌పాషా, దశరథ్‌గౌడ్, అంజయ్యలను కోరగా వారు నిరాకరించారు. దీంతో అదేరోజు రాత్రి ఇంటికి వెళ్దామని చెప్పి మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి బొబ్బిలిగామ నుంచి మల్లారెడ్డిపేట్ వెళ్లే రోడ్డుకు ఎడమ వైపు తీసుకెళ్లి ఇనుప కర్రతో రాములు తలపై, ఇతర శరీర భాగాలపై కోట్టి రుమాల్తో గొంతుకు బిగించి చంపివేసినట్లు నిందితుడు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. చాంద్ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు. సిబ్బందికి అభినందనలు.. ఈ కేసులో మొదటినుంచి కష్టపడి కేసు చేధించడానికి పూర్తిగా సహకరించిన సిబ్బంది ఏఎస్ఐ కిష్టయ్య, సిబ్బంది జగన్, వెంకటేశం, శ్రీనివాస్, రమేష్, వీరేశంలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
పండగపూట విషాదం
మనోహరాబాద్(తూప్రాన్): పండగవేల విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమారులు మృతి. దీంతో ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిన మనోహరాబాద్ స్టేషన్. పండగ వేళ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బోగిమంటలు సిద్ధం చేస్తున్న వేళ.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని సంతోషంగా సెకండ్ షో సినిమాకు వెళ్లి అర్థరాత్రి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో స్కూటీ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న కడీని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాత పడగా, ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన మనోహరాబాద్ మండల కేంద్రంలోని స్టేషన్ శివారులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. సోమవారం పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్ పరిధిలోని స్టేషన్‌కు చెందిన వరగంతం సదాలింగం ఒక్కగానొక్క కుమారుడు రంజిత్(24), సాయిబాబా ఒక్కగానోక్క కుమారుడు విష్ణు(20)లు తమ మిత్రుడు తూప్రాన్‌కు చెందిన పసుల సాయితో కలిసి తమ స్కూటీపై మనోహరాబాద్‌లో మిత్రుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అక్కడి నుంచి మేడ్చల్‌లో సెకండ్‌షో సినిమాకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో స్టేషన్ శివారులోకి రాగానే రోడ్డుపై ఉన్న మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కడీని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా స్టేషన్లో విషాధచాయలు అలుముకున్నాయి. ఇదీలా ఉండగా మృతుడు రంజిత తండ్రి కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయికి తీవ్రగాయాలు కావడంతో అతడిని తూప్రాన్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. కాగా స్టేషన్లో విషాధచాయలు అలుముకున్నాయి. ఇదీలా ఉండగా మృతుడు రంజిత తండ్రి కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇట్టి సంఘటనపై సాయిబాబా ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. -
గ‘మ్మత్తు’గా గంజాయి దందా
తూప్రాన్: తూప్రాన్ పట్టణానికి బతుకుదెరువు కోసం ఓ కుటుంబం పది సంవత్సరాల క్రితం వచ్చింది. వీరికి ఏకైక కుమారుడు. మంచి ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. అయితే కుమారుడు స్థానికంగా ఉన్న తన స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో చేడు వ్యసనాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తూప్రాన్‌లో యువకుల అడ్డాలు... పట్టణంలోని గోల్డెన్పార్కు, నర్సాపూర్ చౌరస్తాలోని హోటల్, పట్టణ సమీపంలోని పెద్ద చెరువుకట్ట, పట్టణ సమీపంలో నూతనంగా వెలసిన వెం చర్లు, బ్యాచ్లర్స్ నివాసం ఉంటున్న అద్దెగదుల ను వాడుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయి ని సిగరేట్లలో కలిపి తాగుతున్నారు. బాంకు, ఓసీ బీ అనే పేపరులో గంజాయిని నింపి సిగరేటుగా తయారు చేసుకొని తాగుతున్నట్లు సమాచారం. పల్లెలపై దృష్టి సారించిన అక్రమార్కులు.. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా పెరిగిపోవడంతో గంజాయీ మాఫియా పల్లే ప్రాంతాల్లోని యువతపై దృష్టి సారించినట్లు తెలస్తుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరు యువకులతో పరిచయం పెంచుకుని అమ్మకాలు చేయిస్తోంది. వీరిలో ఎక్కువగా మధ్యతరగతి వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. ప్రకటనలకే పరిమితమైన అవగాహన.. మత్తు పదర్థాల వాడకంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అటువైపుగా ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడం, కళాశాలల్లో పెడదోవ పడుతున్న వారిపై దృష్టి సారించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసం ఎంతైన ఉంది. మత్తుబారిన పడిన వారిలో లక్షణాలు... మత్తుకు అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, శరీరంలోని ఇత ర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం తర్వాత కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. మొదట నాడీవ్యవస్థ, మెదడు, కండరాలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. తర్వాత తమ ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేరు. అధిక శబ్ధాలను వినలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎవరితో సరిగా మాట్లాడరు. డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో అల్సర్ బారినపడతారు. నాసికరంధ్రాలు వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి. సిగరేట్ల రూపంలో పీల్చేవారికి నాలుక రుచిని కోల్పోతుంది. ఊపిరితిత్తుల వ్యవస్థ గోడలు నాశనమై చివరకు మరణానికి దారితీస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. తమ చుట్టూ ఎం జరుగుతుందో కూడా గమనించరు. ఆ సమయంలో వారు ఏం చేస్తారో కూడా వారికి అర్థంకాదు. ఇంట్లోవారు గానీ.. మిత్రులుగానీ గమనిస్తే వీరిలో చాలా తేడాలు కనిపిస్తాయి. వీరికి వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి. గంజాయి మత్తులో.. స్నేహితులతోనో.. సరదాగానో వీటివైపు ఆకర్షితులైన యువకులు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలనుంచి పట్టణానికి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కేంద్రంలో పలువురు యువకులు జల్సాలు, షికార్లు, చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నారు. తెలిసీతెలియని వయసులో నేరాలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో చిక్కుకొని జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పట్టుబడిన పలు దొంగతనాల కేసుల్లో యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆయా కేసుల్లో యువకులను పోలీసులు విచారించే సమయంలో సరదాకోసం, తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడం, ప్రియురాలికి కానుకలు ఇవ్వడంకోసం అంటూ వెల్లడించడం పోలీసులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తూప్రాన్ పట్టణానికి మేడ్చెల్, కొంపల్లి, హైదరాబాద్, చేగుంట, కామారెడ్డి నుంచి కొందరు వ్యక్తులు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్లతో అమ్ముతున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకేట్‌ను రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. చర్యలు తీసుకుంటాం.. తూప్రాన్‌లో గంజాయి వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. యువత పట్ల ఎప్పటికప్పుడూ సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెంచాం. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా వారిపై పర్యవేక్షణ ఉండాలి. మంచి స్నేహితులు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గంజాయి విక్రయించడం చట్టరీత్య నేరం. గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – లింగేశ్వర్‌రావు, సీఐ, తూప్రాన్ దశాదిశాలేని చదువే కారణం... యవత విలువైన దుస్తులు, షూస్ ధరించాలని, ఖరీదైన కార్లలో, బైక్‌లపై తిరగాలని, విలాసవంతమైన జీవితం గడపాల ని కలలు కంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడడం కంటే... దొడ్డిదారిన వారికి కావాల్సిన వాటి కో సం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో విద్యార్థి ప్రతిభకు మార్కులే కొలమానంగా మారాయి. జ్ఞానం నేర్పుతున్నారనేగానీ నైతిక విలువలు, నీతి, నిజాయితీ, మంచి –చెడు, పెద్దలంటే గౌరవం నేర్పించడంలేదు. – మోత్కు రాంచంద్రం, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు -
బాలుడి కిడ్నాప్.. కలకలం
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ పట్టణం యూకో బ్యాంక్ వెనుక వీధిలో రెండేళ్ల బాలుడు అపహరణకు పట్టణంలో కలకలం సృష్టించింది. పున్న శ్రీమతి, రాజయ్య కూతురు స్రవంతిని నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఇంటి ముందు ఆడుకునే బాలుడు చిట్టాపురం పరమేశ్ (లక్కీ) కనిపించకుండా పోయేసరికి తల్లి ఆందోళన చెంది అమ్మనాన్నలకు చెప్పింది. తల్లి స్రవంతి, అమ్మనాన్నలు వీధి వీధి గాలించిన బాలుడు ఆచూకి దొరకపోవడంతో తల్లి స్రవంతి అమ్మ నాన్నల సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి కిడ్నాప్‌ను చేధించేందుకు పోలీసులు రంగంలోకి బృందాలు ఏర్పడి తీవ్రంగా శ్రమించి ఐదు గంటల్లో కేసు చేధించి బాలుడికి ఎలాంటి గాయాలు లేకుండా తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. కొత్త సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా బాలుడు కిడ్నాప్ కావడం పోలీసుల కేసు చేధనను సవాల్‌గా తీసుకోని విచారణ చేపట్టారు. బాలుడు కిడ్నాప్ అయిన వీధిలో గణేష్ భవన్ వెనుక సీసీ కెమెరా ఉండటం అందులో కిడ్నాప్ చేసిన వ్యక్తి గుర్తించేందుకు సహాయ పడింది. మడద గ్రామ పరిధిలోని బంటుపల్లికి చెందిన పోలోజు నాగరాజు మద్యం సేవించి బాలుడికి అరటిపళ్లు ఇస్తానని తీసుకెళ్లి అపహరించినట్లు గుర్తించి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసు చేధించేందుకు గాలింపు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్ బృందం అక్కడకు వెళ్లి నాగరాజు, బాలుడుని అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు బాలుడిని ఏసీపీ మహేందర్ తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల సహాయంతో.. హుస్నాబాద్ పట్టణంలోని వ్యాపారులు ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే కిడ్నాప్ కేసును ఐదు గంటల్లో చేధించడం జరిగిందని ఏసీపీ సందేపోగు మహేందర్ అన్నారు. పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలకు 15 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అక్కన్నపేట మండలంలో 32 గ్రామాలకు 12 గ్రామాల్లో సీసీ కెమెరాలు బగించామని, కోహెడ మండలంలో 27 గ్రామాలకు 10 గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడటంతో గ్రామాలకు వచ్చే దొంగలను, అపరిచిత వ్యక్తుల చిత్రాలను బంధించి కేసుల చేధనకు సహకారం అందిస్తున్నాయన్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కిడ్నాప్ అయిన బాలుడికి ఎలాంటి హాని కలుగకుండా సురక్షితంగా పట్టుకోగలిగామంటే సీసీ కెమెరాల ఫుటేజీలు ప్రధాన భూమిక పోషించాయన్నారు. బాలుడి కిడ్నాప్‌ను చేధించిన ఎస్సై సుధాకర్, ఏఎస్సై మోతిరాం, కానిస్టేబుల్స్ త్యాగరాజు, రవి, హెడ్‌కానిస్టేబుల్ సంపత్‌లను ఏసీపీ అభినందించారు. నిందుతుడిని విచారణ అనంతరం శనివారం కోర్టులో హాజరుపర్చుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట, హుస్నాబాద్ ఎస్సైలు సుధాకర్, పాపయ్యనాయక్లు ఉన్నారు. -
చాముండేశ్వరీ ఆలయంలో చోరీ
చిలప్‌చెడ్(నర్సాపూర్): చాముండేశ్వరీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతానానికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆలయ తలుపులు తెరిచేందుకు మోతీలాల్ శర్మ వెళ్లగా గేట్ తాళం పగులగొట్టి ఉందని, ఈ విషయం ఆలయ నిర్వహకుడు శోభన్‌కు తెలియజేయగా, అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఆలయ మెయిన్ గేటు తాళం పగులగొట్టి, ప్రసాదం కౌంటర్ గ్రిల్స్ తొలగించి కౌంటర్లోని సుమారు రూ.6వేలు దొంగలించి, బీరువాలోని రికార్డులు చిందరవందర చేసినట్టు గ్రహించారు. అక్కడే ఉన్న కంప్యూటర్ మానిటర్, ఎంప్లిఫైర్ తో పాటు హోమగుండం వద్ద ఉన్న చిన్న హుండీ దొంగలించారని వారు గుర్తించారు. ఆ హుండీని ఆలయం వెనుకల పడేశారని వెల్లడించారు. అనంతరం గుడిలోని సీసీ పుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి హుండీని ఎత్తుకెళ్లినట్లు రికార్డు అయినప్పటికీ ఫుటేజ్ క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యమే కారణమా..? ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే దొంగతనం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో నిద్రించాల్సిన సిబ్బంది, వాచ్మెన్లే ఆలయంలో లేరని, మొత్తం 8 సీసీ కెమెరాలు ఉన్న ఆలయంలో కేవలం ఐదు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే పనిచేస్తున్న వాటినలో రెండు మాత్రమే క్లారిటీ ఉన్నాయని. ఆలయ నిర్వహకులు సీసీ కెమెరాల నిర్వహణ కూడ సక్రమంగా నిర్వహించకపోవడం గమనార్హం. కాగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
ఉసురుతీసిన అప్పులు
అక్కన్నపేట(హుస్నాబాద్): జీవనోపాధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన సంఘటన ధర్మారంలో విషాదాన్ని నింపింది. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన నాంపెల్లి ఆంజనేయులు(25) అనే యువకుడు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తనకున్న ఎకరంన్నర వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. రూ.3 లక్షలు అప్పులు చేసి బోరు వేయించాడు. అవి ఫెయిల్ కావడంతో మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వర్షాలు సకాలంలో పడక పెట్టిన పెట్టుబడులు రాని దయనీయ పరిస్థితులతో కుంగిపోయాడు. జీవనం సాగించేందుకు మరో రూ.2లక్షలు అప్పులు చేసి రెండు ఆటోలను కొన్నాడు. సుమారుగా రూ.5లక్షల వరకు అప్పులయ్యాయి. ఆటోలకు గిరాకీ లేక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం మనస్థాపంతో ఉండేవాడు. ఈ క్రమంలో చివరికి సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి తనవు చాలించాడని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు బోరుమంటున్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మణెమ్మ చెప్పారు. మృతిడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు. -
ధాన్యం కుప్ప.. మృత్యువు ముప్పు
రాయపోలు(దుబ్బాక): రహదారులపై రైతులు ఇష్టారీతిగా చేపడుతున్న పంట నూర్పిడి ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. ధాన్యం రోడ్డుపై ఆరబెట్టి.. ఆపై కుప్పలుగా చేర్చి నల్లని టార్పాలిన్లు కప్పుతుండడం.. వాటిని గుర్తించని వాహనదారులు ప్రమాదాలబారిన పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. రైతుల తీరుమారకపోవడంతో అమాయకుల ప్రాణాలమీదకు వస్తుంది. దౌల్తాబాద్, రాయపోలు మండలంలో ఇటీవల పలు ప్రమాదాలు చేటుచేసుకుని ప్రాణాపాయంలో పలువురు కొట్టుమిట్టాడుతున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గుండెకాయ భిక్షపతి వారం రోజుల క్రితం తన భార్య భాగ్య ఇద్దరు పిల్లలతో కలసి రాయపోలు మండలం అనాజీపూర్‌కు ఓ విందుకు హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. కాగా అహ్మద్‌నగర్ వద్ద రోడ్డుపై వరి ధాన్యం కుప్పను గమనించకుండా వాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. భాగ్య అపస్మారక స్థితిలో వారం రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. బుధవారం రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన తప్పెట ప్రభాకర్ తన ద్విచక్రవాహనంపై గజ్వేల్ బయలుదేరాడు. కాగా రాంసాగర్ శివారులో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను గుర్తించకుండా ఢీకొట్టాడు. అతని తల పగిలింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఇవి మచ్చుకు ఒకట్రెండు సంఘటనలు మాత్రమే. ఈ ఖరీఫ్ సీజన్లో ఏదో ఓ గ్రామంలో నిత్యం ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఉమ్మడి దౌల్తాబాద్ మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. రోడ్డు ప్రమాదం అంటే వాహనం దానంతట అదే అదుపుతప్పి పడిపోవడమో.. లేక ఎదురుగా వస్తున్న మరోవాహనాన్ని ఢీకొనడమో కాదు. రైతులు ఆరబెట్టిన ధాన్యం కుప్పలను ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని అంతర్గత రహదారులపై కాకుండా ప్రధాన రెండు వరుసల రహదారులైన రామాయంపేట–గజ్వేల్, చేగుంట–గజ్వేల్, దౌల్తాబాద్–దొమ్మాట రోడ్డపై కూడా సగం వరకు రైతులు పంటనూర్పిడికి వినియోగిస్తున్నారు. ప్రతి యేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ఇదే తరహాలో నూర్పిడి చేస్తూ.. ధాన్యం కుప్పలను వారాల తరబడి రోడ్డుపై ఉంచి నల్లటి కవర్లను కప్పి ఉంచడం ప్రమాదాలకు తావిస్తోంది. యేడాది క్రితం సూరంపల్లి వద్ద మంతూరుకు చెందిన స్వామి వరి కుప్పకు ఢీకొని మృతిచెందాడు. అలాగే ప్రతియేటా పలు ప్రమాదాలు జరుగుతున్నా రైతుల తీరులో మార్పు రావడం లేదు. రోడ్లమీద ధాన్యం ఆరబెట్టిన రైతులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. అవగాహన కల్పిస్తాం.. రోడ్లపై ధాన్యం ఆరబెట్టే సంస్కృతి మంచిది కాదు. గత వారం అహ్మద్‌నగర్ వద్ద ప్రమాదం జరిగింది. బాధ్యులపై కేసునమోదు చేశారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకట్రెండు రోజులుగా రాత్రివేళలో పెట్రోలింగ్ చేసే సమయంలో ధాన్యం కుప్పలపై ఉంచిన కవర్లను తొలగిస్తూ వస్తున్నాం. రైతులకు నోటీసులిస్తున్నాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా రైతులకు అవగాహన కల్పిస్తాం. – చంద్రశేఖర్, ఎస్సై, దౌల్తాబాద్ కేసులు నమోదు చేస్తాం.. రహదారులపై ధాన్యం ఆరబెడితే రైతులపై కేసులు నమోదు చేస్తాం. రాంసాగర్ శివారులోనూ ధాన్యం పోసిన రైతుపై కేసునమోదు చేశాం. గతంలోనూ ఆరబెట్టిన రైతులకు నోటీసులిచ్చాం. రైతులకు స్వతహాగా అవగాహన వస్తేనే బాగుంటుంది. వారి కుటుంబసభ్యులు కూడా ప్రమాదాలకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో అవగాహన పెంచుకోవాలి. ఇష్టారీతిగా ధాన్యం కుప్పలు రోడ్లపై ఉంచితే జప్తు చేసి రెవెన్యూ శాఖకు అప్పగిస్తాం.– నర్సింలు, ఎస్సై, రాయపోలు -
తెల్లారితే పెళ్లి నిశ్చయం అంతలోనే విషాదం
వర్గల్(గజ్వేల్): మృత్యువు దారికాచింది. బైక్ మీద వెళుతున్న యువకుడిపై పంజా విసిరింది. తెల్లారితే పెళ్లి నిశ్చయం వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఇంట విషాదం నింపింది. వర్గల్ మండలం నాచారం సమీపంలో బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనతో గజ్వేల్ మండలం మక్త మాసాన్‌పల్లిలో పెనువిషాదం అలుముకుంది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మక్త మాసాన్‌పల్లికి చెందిన ఈసకంటి ఎల్లం (22) తాపీ మేస్త్రీ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో తనతోపాటు తమ్ముడు సురేష్ కూడా అన్న రామస్వామి సంరక్షణలోనే ఉంటున్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ గెలుపు సంబరాల్లో తోటి మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. ఆ తరువాత సాయంత్రం తన బైక్ మీద నాచారం వెళ్లాడు. మార్గమధ్యంలో నాచారం సిరి సీడ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్‌తో సహా ఎల్లం రోడ్డు కిందకు పడిపోయాడు. దీంతో అతడిని ఎవరూ గమనించలేదు. ఉదయం ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు గమనించారు. అతని వద్ద లభించిన ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం చేరవేశారు. మృతుని సోదరుడు రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. నిశ్చితార్థం రోజునే.. అందరితో కలుపుగోలుగా ఉండే ఎల్లం(22)కు బుధవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మాట ముచ్చటకు వధువు సంబంధీకులు మక్తమాసాన్‌పల్లికి రావాల్సి ఉంది. ఇంతలోనే బైక్ అదుపుతప్పి యువకుడు ఎల్లం దుర్మరణం చెందడంతో ఆ ఇంట చావుబాజా మోగింది. కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్లం మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
అయ్యో పాపం.. జ్ఞానేశ్వరి
కొల్చారం(నర్సాపూర్): పుట్టుకతోనే మాటలురాని ఆరేళ్ల చిన్నారి ఐదురోజుల క్రితం తప్పిపోయి శవమై కనిపించింది. అసలేం జరిగిందో తెలియదు కాని ఆ తల్లిదండ్రులకు తీరనిశోకమే మిగిలింది. కొల్చారం మండలం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలాల్లో ఆరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి శవం మంగళవారం లభ్యమైంది. మృతిచెందిన చిన్నారి మండలంలోని ఎనగండ్ల గ్రామానికి చెందిన ఏష బోయిన శ్రీశైలం కూతురు జ్ఞానేశ్వరి(6)గా గుర్తించారు. కొల్చారం ఎస్సై పెంటయ్య, చిన్నారి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొల్చారం మండలం సదాశివనగరానికి చెందిన కంచర్ల కిష్టయ్య పెద్దకూతురు మొగులమ్మ. మొదటి భర్త మరణించడంతో కూతురు మొగులమ్మను, మనవరాలు జ్ఞానేశ్వరిని పుట్టింటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత కూతురుకు ఎనగండ్ల గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం రెండో వివాహం చేశాడు. వారు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గత శుక్రవారం కూతురు జ్ఞానేశ్వరిని భర్త వద్ద వదిలి మొగులమ్మ కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మొగులమ్మ కూతురు ఏదంటూ భర్తను అడగడంతో ఇప్పుడే అన్నం తిని బయటకు వెళ్లినట్లు తెలిపాడన్నారు. రాత్రి 8 దాటినా కూతురు రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని అడిగినా సమాచారం లభించకపోవడంతో రంగంపేటలోని బంధువులకు విషయం తెలిపారు. ఐదు రోజులుగా జ్ఞానేశ్వరికోసం గాలించిన బంధువులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలంలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు రంగంపేట గ్రామసేవకుల ద్వారా సమాచారం రావడంతో జ్ఞానేశ్వరి బంధువులు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే శవం కుళ్లిపోగా శరీరంపై ఉన్న దుస్తులను చూసి జ్ఞానేశ్వరిగా గుర్తించారు. ఘటన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జ్ఞానేశ్వరి కాళ్లు, చేతులకు అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన చేపల వల చుట్టుకోవడం, నిర్మానుష్య ప్రదేశం కావడం, అరిచేందుకు మాటలు రాకపోవడం చిన్నారి మృతిచెందడానికి కారణమై ఉండవచ్చు అన్న అనుమానాలను ఎస్సై పెంటయ్య వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్లను రప్పించి పరిసరాలను క్షున్నంగా పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై పెంటయ్య కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇద్దరి ప్రాణం తీసిన ‘ప్రేమ’
జహీరాబాద్: ఓ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమికుల ప్రేమను ఇరుకుటుంబాలు ఆంగీకరించక పొవడంతో గొడవలు నెలకున్నాయి. తమ పరువు పొయిందని అవమానంగా భావించిన ప్రియుడి తండ్రి ప్రియురాలి అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పపడ్డారు. ఝరాసంగం ఎస్ఐ. ఏడుకొండలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మేదపల్లికి చెందిన నాగమణి, మహేశ్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. నాగమణికి గత రెండు నెలల క్రితం మొగుడంపల్లి మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న నాగమణి ప్రియుడు సదరు యువకుడికి తన ప్రేమ వ్యవహారాన్ని తెలిపాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయమై ఇరుకుటుంబాలు శుక్రవారం రాత్రి వివాదానికి దిగాయి. తమ పరువు పొయిందని భావించిన మహేశ్ తండ్రి అంజన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న నాగమణి అన్న జగదీశ్వర్ సైతం పురుగుల మందు తాగాడు. అనంతరం ఆమె సైతం పురుగుల మందు తాగాడు. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమికుడి తండ్రి అంజన్న, ప్రేమికురాలి అన్న జగదీశ్వర్(25) మృతి చెందారు. నాగమణి చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకుంది. ఈ మేరకు ఎస్ఐ. ఏడుకొండలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురును హత్య చేసిన తండ్రి
సాక్షి, తూప్రాన్: భార్య కాపురానికి రాలేదని కన్న కూతురుని కడతేర్చాడు ఓ తండ్రి. ఈ కేసును పోలీసులు మంగళవారం చేధించారు. కేసుకు సంబందించిన వివరాలను సీఐ లింగేశ్వర్‌రావు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన తూప్రాన్ మండలం కరీంగూడ సమీపంలో ఓ గుర్తుతెలియని యువతిని బండరాయితో తలపై మోది హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు యువతిని హత్యచేసింది కన్న తండ్రే అని నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. చిత్తూరు జిల్లా మల్కలచెరువు మండలం బోరెడ్డిపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతూ మనోవేదన చెందుతున్నాడు. తన భార్య కాపురానికి రాలేదని కూతురుపై కక్ష్యను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కూతురు లక్ష్మీప్రసన్న(15)ను తనవెంట తీసుకొని తూప్రాన్‌కు ఈనెల 5న చేరుకున్నాడు. అతడు గతంలో బోర్వెల్ బండి పనిచేయడంతో ఈ ప్రాంతంలో అయితే కూతురును హత్యచేస్తే ఎవరు గుర్తించరని నిర్ధారించుకుని తూప్రాన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 5న రాత్రి కరీంగూడ చౌరస్తా వద్ద బస్సు దిగిన అనంతరం తన కూతురును రోడ్డు పక్కన బండరాళ్ల మధ్యకు తీసుకెళ్ళాడు. ఇంత రాత్రి ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్తున్నావని కూతురు కేకలు వేయడంతో ఆమె తలను రాయికి బలంగా గుద్దాడు. అనంతరం బండరాయితో తలపై మోది చనిపోయిందని నిర్ధారించుకొని ఆ ప్రాంతం నుంచి పారిపోయినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలోని తన కుటుంబ సభ్యులు లక్ష్మీప్రసన్న కనిపించని విషయాన్ని అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్న తండ్రి శ్రీకాంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతన్ని గృహ నిర్బంధం చేసి పోలీసులకు అప్పగించారన్నారు. అక్కడి పోలీసుల సమాచారంతో హత్యకు గురైన యువతి ఆచూకీ లభించినట్లు సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తూప్రాన్ నుంచి చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సై సుభాష్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూతుళ్ల పెళ్లిళ్లు చేసే స్తోమత లేక..
జోగిపేట(అందోల్): నీరు లేక పంట ఎండిపోయింది.. చేతికొచ్చిన కూతుళ్లకు వివాహం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, మరో వైపు రోజు రోజుకు పెరుగుతున్న అప్పులు.. ఈ పరిస్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆబేద్‌పాష (41) క్రిమి సంహరక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషదకరఘటన అందోలు మండలం మాసానిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆబేద్‌మియాకు గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సారి దాంట్లో వరి సాగు చేశాడు. నీరు అందక పంట ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మరో వైపు ప్రైవేట్‌గా రూ.2 లక్షలు, బ్యాంకులో రూ.లక్ష అప్పు ఉండడం, వివాహానికి సిద్ధంగా ఇద్దరు కూతుళ్లు ఉండడంతో ఆబేద్‌పాష తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 11న చేను వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. చేను పక్క వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆబేద్‌పాష మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి నలుగురు కూతుళ్లు రిజ్వానా బేగం, అస్మాబేగం, హీనాబేగం, సమీనా బేగం ఉన్నారు. హీనాబేగం, సమీనాబేగంకు వివాహం కావాల్సి ఉంది. భార్య బేగంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. గ్రామంలో విషాదం.. కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అబేద్ పాష ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు కూతుళ్లలో ఇద్దరిని కష్టపడి డిగ్రీ, పీజీ చదివించాడని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆబేద్‌మియా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఆబేద్‌పాష మృతదేహం -
తూప్రాన్‌లో యువతి దారుణ హత్య
తూప్రాన్ (మెదక్): గుర్తుతెలియని యువతిని దుండగులు అతి కిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేసేందుకు యత్నించిన సంఘటన తూప్రాన్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై కరీంగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. దీనికి సంబంధించి సీఐ లింగేశ్వర్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన కరీంగూడకు సమీపంలో గుర్తుతెలియని సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న యువతి గాయాలతో తీవ్ర రక్తస్రావమై పడి ఉండగా గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అనుమానాస్పద స్థితిలో యువతి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె తలపై బండరాయితో మోదినట్లు ఉండడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. యువతి ఎవరనే విషయం తేలాల్సి ఉందన్నారు. యువతి తలపై గుర్తుతెలియని దుండగులు దారుణంగా బండరాయితో మోదినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. యువతిని ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ హత్యా యత్నానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళ యువతిని తీసుకువచ్చిన దుండగులు అత్యాచారానికి యత్నించగా ఆమె నిరాకరించడంతోనే బండరాయితో మోది ఉంటారని పలువురు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పేర్కొంటున్నారు. మొత్తానికి యువతిని హత్య చేసేందుకు ఎవరు పాల్పడి ఉంటారనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన యువతి సాయంత్రం కన్ను మూసిందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9490617048 నంబర్‌కు ఫోన్ చేసి తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
వివాహేతర సంబంధం..యువకుడి దారుణ హత్య
జోగిపేట(అందోల్): వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన జోగిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య(23)ను హత్య చేసి జోగిపేటలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుక భాగంలోని ముళ్లపొదల్లో పాతిపెట్టిన విషయం శనివారం సంగారెడ్డి, జోగిపేట పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హతుడు ఎల్లయ్య సంగారెడ్డిలోని టెంట్ హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జోగిపేటకు చెందిన పాపయ్య కూడా సంగారెడ్డిలో తన భార్య, పిల్లలతో కలిసి కూలీ పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఎల్లయ్య, పాపయ్యలకు కొంత కాలంగా స్నేహం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో పాపయ్య భార్యతో ఎల్లయ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 12వ తేదిన పాపయ్య భార్య స్వగ్రామమైన జోగిపేటకు వచ్చింది. అదే రోజు రాత్రి పాపయ్య తన, భార్య పిల్లల వద్దకు జోగిపేటకు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎల్లయ్య, పాపయ్య భార్యలు తలుపులు పెట్టుకొని ఉన్నారు. భార్య తలుపులు తెరవగానే ఎల్లయ్య కనిపించడంతో ఆగ్రహించిన పాపయ్య గడ్డపారతో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఎల్లయ్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుకభాగంలోని ముళ్లపొదల్లోకి తీసుకువెళ్లి గుంత తవ్వి పాతిపెట్టారు. తన మరిది కనిపించడం లేదని మృతుడి అన్న భార్య సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేసింది. దీంతో సంగారెడ్డి స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయంలో పోలీసులు విచారణను చేపట్టారు. పాపయ్యతో స్నేహం విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని విచారించారు. తానే చంపి జోగిపేటలో పాతిపెట్టినట్లు పాపయ్య సంగారెడ్డి పోలీసులకు తెలియజేశాడు. సంగారెడ్డి సీఐ వెంకటేష్ శనివారం జోగిపేటకు నిందితుడు పాపయ్యను తీసుకురాగా పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. స్థానిక సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ వెంకటేష్‌లు మృతదేహాన్ని బయటకు తీయించారు. తహసీల్దారు ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహించారు. తవ్విన చోటనే వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పాపయ్యను సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లి (మెదక్): గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐలు సత్తయ్యగౌడ్, రామకృష్ణ, ఎస్ఐ మహ్మద్ నదీం హుస్సేన్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన మహ్మద్ అమ్జద్ (50) తలుపుల వ్యాపారి. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి షాపులో కూర్చున్న అమ్జద్‌ను సుత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. హత్య చేసిన వెంటనే వచ్చిన ఆటోలో తిరిగి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న అమ్జద్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడు అమ్జద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ప్రథమ పుత్రుడు మోసిన్, చిన్న కుమారుడు ఆసిన్‌లు నిత్యం ఇతరులతో గొడవలు పడుతుంటారు. ఈ తగాదాల కారణంగానే తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఏసీపీ అశోక్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ద్వారా త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రక్తమోడిన రహదారులు
రహదారులు రక్తమోడాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఏడుగురిని బలితీసుకున్నాయి. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో సంగారెడ్డి– నాందేడ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మోటార్ సైకిల్‌పై కబుర్లు చెప్పుకుంటూ ఓ జంట, వారి కుమారుడు బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరుకుంటామనగా వారి పాలిట ఆర్టీసీ బస్సు మృత్యుశకటమైంది. ముగ్గురినీ పొట్టనబెట్టుకుంది. సదాశివపేట మండల పరిధిలోని సూరారం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అత్త, అల్లుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మనవరాలికి గాయాలయ్యాయి. చేగుంట మండలం వడియారం బైపాస్ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు ఛత్తీస్గడ్ వాసులు ప్రాణాలు వదిలారు. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చినవారు చివరికి విగతజీవులుగా మారారు. ఆయా ప్రమాదాలతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మరోపక్క రిమ్మనగూడ వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో గాయపడి.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటికి పది మంది డిశ్చార్జి కాగా మరో పది మందికి ఇంకా చికిత్సలు కొనసాగుతున్నాయి. కల్హేర్(నారాయణఖేడ్, మెదక్): ఆర్టీసీ అద్దె బస్సు, బైక్ ఢీ కొని ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన మాసాన్‌పల్లి–బాచేపల్లి మార్గంలో సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై ఖానాపూర్(బి) రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మాసాన్‌పల్లి బుగ్గ్యనాయక్ తండాకు చెందిన కెతవత్ సంగ్యనాయక్(50), అతని భార్య సంతెలిబాయి(45), కుమారుడు అనిల్(15) బాచేపల్లి నుంచి మోటర్ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపూర్(బీ) రోడ్డు వద్ద మూలమలుపులో హైదరాబాద్2 డిపోకు చెందిన ఆర్టీసి ప్రైవేట్ బస్సు వీరి మోటర్ సైకిల్‌ను ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న సంగ్యనాయక్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయల పాలై కోన ఊపిరితో ఉన్నసంతెలిబాయిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలన్ని కంగ్టి సీఐ తిరుపతి యాదవ్, కల్హేర్ ఎస్ఐ సాయిరాం, ఏఎస్ఐ లక్ష్మణ్ పరిశీలించి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంగ్యనాయక్, అనిల్ మృతదేహలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరమర్శ.. మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి మృతుల కుటుంబీకులను పరమర్శించి అంత్యక్రియల కోసం రూ. 5వేలు సహాయం అందించారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్‌షెట్కార్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుండు మోహన్, రవీందర్‌నాయక్, వెంకటేశంసేట్ మృతుల కుటుంబీకులను పరామర్శించారు. అత్తా, అల్లుడు దుర్మరణం.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఓ లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన మండల పరిధిలోని జాతీయ రహదారి 65 సూరారం రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లికి చెందిన అవిటి విఠల్(27), తన కూతురు మహాలక్ష్మి(5)తో పాటుగా అత్త నాయికిని జయమ్మ(40)తో కలిసి ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి తన అత్తగారి ఊరైన కర్ణాటక రాష్టం గుల్బర్గా జిల్లాలోని చేట్ల వెంకటాపూర్ గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని జాతీయ రహదారి 65 సూరారం రోడ్డు సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో అవిటి విఠల్(27), నాయికిని జయమ్మ(40) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి.. ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన మహాలక్ష్మిని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. మరో ప్రమాదంలో యువకుడు సదాశివపేట(సంగారెడ్డి): పట్టణ పరిధిలోని ఎన్కెపల్లి బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు సదాశివపేట మండలం ఎన్కెపల్లికి చెందిన రాజ్‌కుమార్ సదాశివపేట పట్టణం నుంచి స్వగ్రామమైన ఎక్కెపల్లిగా బైక్‌పై వెళ్తున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఇతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బతుకులు బోల్తా.. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వలస కూలీల మృతి చేగుంట(తూప్రాన్): ట్రాక్టర్ బోల్తాపడి ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన సంఘటన మండలంలోని వడియారం శివారులో 44వ నంబర్ జాతీయరహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌కు చెందిన సాగర్నాగ్(25), గంగారాంనాగ్(20), ఆచారంనాగ్ తూప్రాన్ మండలం ఘనపురంలో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. రామాయంపేటలో పనులు ఉండటంతో ట్రాక్టర్‌పై తూప్రాన్ నుండి రామాయంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వడియారం బైపాస్ శివారులోకి రాగానే వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ట్రాక్టర్ నడుపుతున్న సాగర్నాగ్(25), గంగారాంనాగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఆచారంనాగ్కు తీవ్ర గాయాలైనాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి ఉసురు తీసిన ‘కేసు’
సిద్దిపేటటౌన్ : తోటి స్నేహితులతో జరిగిన చిన్నపాటి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసు కావడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకులకు చెందిన మడప రోహిత్‌రెడ్డి అలియాస్ బబ్లూ (18) సిద్దిపేట పట్టణంలోని మాస్టర్స్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం పాత బస్టాండ్ పక్కన ఉన్న గల్లీలో అతడికి, కొందరు స్నేహితులకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పెద్దల సమక్షంలో ఇరు పక్షాల వారిని మందలించి ఉదయం మళ్లీ స్టేషన్‌కు రావాలని పంపించారు. మంగళవారం రాత్రి రోహిత్ ఇంటికి వెళ్లకుండా గ్రామ శివారులోని వారి సంబందీకులకు చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గ్రామంలో వెతికినా ఆచూకీ దొరకలేదు. రోహిత్ తండ్రి యాదిరెడ్డి ఉదయం బావి వద్దకు వెళ్తున్న క్రమంలో దొంగల చంద్రయ్య బావి వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న కానుగు చెట్టుకు ఉరివేసుకుని రోహిత్ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విషయం సిద్దిపేట రూరల్ పోలీసులకు తెలియడంతో పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. దోషుల పేర్లు చెప్పాలని బాధితుల డిమాండ్.. తమ కుమారుడి మృతికి మంగళవారం జరిగిన గొడవే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసినా పోలీసులు గొడవకు పాల్పడిన అతని స్నేహితుల పేర్లు చెప్పకపోవడంతో శవంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే బైటాయించి ఆందోళనకు దిగారు. రోహిత్‌రెడ్డి మృతికి కారణమైన వారి పేర్లు చెప్పి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీపీ జోయల్ డేవిస్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్నే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడంతో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శవాన్ని పోలీసుల వాహనంలో తిరిగి పోస్టు మార్టం రూంకు తీసుకువచ్చారు. కాసేపటికి అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరడంతో గొడవ సద్దుమనిగింది. గొడవకు కారణమైన వారిపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలి... మా కొడుకు మీద ఫిర్యాదు వచ్చింది పోలీస్ స్టేషన్‌కు రావాలని మంగళవారం సాయంత్రం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. స్టేషన్‌కు వస్తే బుధవారం ఉదయం రావాలని చెప్పి పోలీసులు పంపించారు. వెళ్లే సమయంలో కేసు అయింది స్టేషన్‌కు రావాలి, జైలుకు పంపిస్తాం అని చెప్పారు. కేసు నమోదు కావడంతోనే మనస్థాపం చెంది నా కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు పెట్టిన వారు ఎవరో మాకు చెప్పకుండా పోలీసులు దాస్తున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మాకు అన్యాయం చేస్తున్నారు. గొడవ ఎందుకు అయ్యిందో చెప్పడం లేదు. మా అబ్బాయి మీద కేసు పెట్టిన వారి వివరాలు చెప్పాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – యాదిరెడ్డి, మృతుని తండ్రి చట్ట ప్రకారం చర్యలు.. రోహిత్‌రెడ్డి తన స్నేహితునితో కలిసి పాత బస్టాండ్ వద్ద వారు చదువుకునే కాలేజీ స్నేహితులతో గొడవ పెట్టుకుని వారిని కొట్టాడు. వారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి కోర్టుకు పిలిచినపుడు రావాలని చెప్పి పంపించాం. అమ్మాయి విషయంలో స్నేహితుల మద్య గొడవ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. పంపించిన తర్వాత రోహిత్ ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయంలో అతనిపై కేసు నమోదు అవడం వల్లనే మనస్థాపం చెంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రామేశ్వర్, సిద్దిపేట ఏసీపీ -
అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య
మెదక్ మున్సిపాలిటీ : అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. ఫతేనగర్ వీధికి చెందిన కళావతి(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. పదేళ్లక్రితం ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరోవైపు భర్తకూడా చనిపోయాడు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న కళావతి మంగళవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. -
ప్రాణం తీసిన భోజనం గొడవ
ములుగు(గజ్వేల్) : మద్యం మత్తు ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చురేపింది. ఆపై విచక్షణ కోల్పోయిన మిత్రుడు గొడ్డలితో దాడి చేసి స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం భవానందపూర్ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రాత్రి 12 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాలు.. భవానందపూర్ సమీపంలో పక్కపక్కనే ఉన్న రెండు వ్యవసాయ క్షేత్రాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్(27), కర్నూలు జిల్లాకు చెందిన ప్రభాకర్‌రెడ్డి పని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి పార్టీ చేసుకుందామని నిర్ణయించుకొని.. మద్యం, చికెన్ తెచ్చుకున్నారు. శ్రీనివాస్ గదిలో వంట చేసుకుని.. భవానందపూర్‌కు చెందిన చంద్రమౌళి, గుంటూరుకు చెందిన మేస్త్రీ సురేశ్‌ని పార్టీకి ఆహ్వానించారు. నలుగురు కలసి తాగిన తర్వాత భోజనం విషయంలో శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఘర్షణ పడటంతో చంద్రమౌళి, సురేష్, అప్పుడే అక్కడికి వచ్చే మరో వ్యక్తి స్వామి వారిని సముదాయించారు. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన ప్రభాకర్‌రెడ్డి తాను పనిచేసి వ్యవసాయక్షేత్రం నుంచి గొడ్డలి తీసుకొచ్చి శ్రీనివాసుపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయం కావడంతో శ్రీనివాస్ కూర్చున్న చోటేకూలబడిపోయాడు. ఇదిలా ఉండగా, అక్కడున్న మిగతావారు నిందుతుడిని పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. -
బర్త్‌డే పార్టీకంటూ వెళ్లి..
కొల్చారం(నర్సాపూర్) మెదక్ : స్నేహితుడి బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి రాత్రి ఇంటి నుండి బైక్‌పై వెళ్లిన యువకుడు తెల్లవారు జామున గ్రామ శివారులో రోడ్డు పక్కన బురద గుంతలో శవమై కనిపిం చాడు. ఈ విషాదకర ఘటన చిన్నఘణాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. మృతుని తండ్రి వడ్ల లక్ష్మీనారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వడ్ల శ్రీనివాస్(24)తల్లి ఎనిమిదేళ్ల క్రితం మరణించింది. అతని సోదరి వివాహం సైతం కావడంతో తండ్రితో పాటు గ్రామంలో ఉంటూ మెదక్ పట్టణంలోని వరుణ్ మోటర్స్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మెదక్ వెళ్లి వచ్చిన శ్రీనివాస్ రాత్రి 8 గంటల సమయంలో ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని తండ్రికి చెప్పి బైక్‌పై వెళ్లాడు. పొలం వద్ద సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయిన అతని తండ్రి లక్ష్మీనారాయణ కొడుకు కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాడు. మధ్యలో మెలకువ రావడంతో ఫోన్ చేయగా వస్తున్నానని శ్రీనివాస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున గ్రామ శివారులోని గొల్లగుట్ట సమీపంలోని మెదక్–జోగిపేట ప్రధాన రహదారి పక్కన బురదగుంటలో శ్రీనివాస్ మృతదేహం పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. గమనించిన గ్రామస్తులు తండ్రి లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. బైక్ అదుపుతప్పి పడటంతో తీవ్రంగా గాయపడి శ్రీనివాస్ మృతి చెంది ఉంటాడని ఘటన స్థలాన్ని సందర్శించిన కొల్చారం ఎస్ఐ పెంటయ్య తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సర్వస్వం అనుకున్న కొడుకు శవమై కనిపించడంతో లక్ష్మీనారాయణ రోదిస్తున్న తీరు గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. గుంతలో పడి ఉన్న శ్రీనివాస్ మృతదేహం, ఇన్సెట్లో శ్రీనివాస్ ఫైల్ ఫొటో -
అడ్డొస్తున్నాడని మట్టుబెట్టారు
జిన్నారం(పటాన్చెరు) : అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను ఓ భార్య హత్య చేయించింది. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిన్నారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రాపుం డీఎస్పీ సీతారాం వెల్లడించారు. గాజులరామారం గ్రామానికి చెందిన పరిమాళ్ల వెంకటేశ్(34)కు గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మల్లెపల్లి మహిమలతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మొదట్లో భార్యభర్తలు గాజులరామారంలో నివాసం ఉండేవారు. ఇదిలా ఉండగా, వెంకటేశ్ తరచూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండటంతో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న మహిమల ప్రోద్భలంతో దోమడుగు గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉంటున్న మద్ది మల్లారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో వీరు అద్దెకు దిగారు. మల్లారెడ్డి ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా.. వెంకటేశ్ కూడా అదే పరిశ్రమలో పనిలో చేరాడు. ఈక్రమంలో కొంతకాలంగా వెంకటేశ్‌తో స్నేహం పెంచుకున్న మల్లారెడ్డి తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అక్రమంలో మహిమలతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. మల్లారెడ్డి తరచూ ఇంటికి రావడాన్ని తెలుసుకున్న వెంకటేశ్ తన భార్యను కట్టడి చేశాడు. ఈక్రమంలో మల్లారెడ్డికి చెప్పి భర్తను అంతమొందించాలని సూచించింది. దీంతో జనవరి 18న మల్లారెడ్డి తన స్నేహితుడైన మహేశ్‌తో కలిసి వెంకటేశ్‌కు మద్యం తాగించారు. కారులో వెంకటేశ్‌ను తీసుకెళ్లి నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట ఫారెస్ట్ ప్రాంతంలో వెంకటేశ్‌ను గుంతునులిమి..ఆపై ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అద్దె ఇంట్లో నివాసం వెంకటేశ్‌ను హత్య చేసిన అనంతరం మల్లారెడ్డి, మహిమల నర్సాపూర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇలా ఐదు నెలలు ఉన్నారు. ఇదిలా ఉండగా, నెల రోజులుగా మల్లారెడ్డి నర్సాపూర్ వెళ్లడం మానేశాడు. మహిమల ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. దీంతో వెంకటేశ్ కనిపించడం లేదని అతని బాబాయ్‌కు మహిమల నెల రోజుల క్రితం ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో మృతుడి బాబాయ్ ఈనెల 3న గుమ్మడిదల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్సై ప్రశాంత్‌కు మహిమల తీరుపై అనుమానం వచ్చింది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టడగా.. జనవరి 19న నారాయణఖేడ్ పీఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తి హత్యపై కేసు నమోదై ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై మహిమలను విచారించగా తన భర్తను హత్య చేయించనట్టు ఒప్పుకుంది. దీంతో మహిమల, మల్లారెడ్డి, మహేశ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో కేసును ఛేదించిన గుమ్మడిదల ఎస్సై ప్రశాంత్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్యామల వెంకటేశ్, ఎస్సైలు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
రూ. 22 లక్షల దొంగ దొరికాడు..?
వర్గల్(గజ్వేల్) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.22 లక్షల నగదును లాక్కొని బైక్ మీద ఉడాయించిన ఘటన వర్గల్ మండలంలో కలకలం రేపింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ఇప్పటికే నగదుతో సహా నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గౌరారం ఎస్ఐ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. వర్గల్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టే పనిని రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కంపెనీకి సంబంధించి గజ్వేల్‌లో పనిచేస్తున్న ఏటీఎం ఆపరేటర్లు ప్రవీణ్, హరి శనివారం సాయంత్రం వర్గల్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు రూ. 22 లక్షల నగదుతో బైక్‌మీద గజ్వేల్ నుంచి వర్గల్‌కు వెళ్తున్నారు. జెర్కిన్, హెల్మెట్, చేతికి గ్లవుజ్ ధరించిన ఓ ఆగంతకుడు నల్ల రంగు పల్సర్ బైక్‌పై వీరిని వెంబడించాడు. వర్గల్ మండలం మక్త సమీపంలో వీరి చేతిలో నుంచి నగదుతో ఉన్న బ్యాగును లాక్కొని చౌదరిపల్లి చౌరస్తా మీదుగా సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వైపు ఉడాయించాడు. వీరు తేరుకుని బైక్‌ను వెంబడించే ప్రయత్నంలో చౌదరిపలి చౌరస్తా వద్ద పడిపోయి గాయాలపాలయ్యారు. సంబంధిత కంపెనీ ఆపరేషన్ మేనేజర్ కె.జనార్దన్‌కు నగదు చోరీ విషయం తెలిసి గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బైక్ దొంగకు సంబంధించిన ఫుటేజీ చిత్రాలు రాజీవ్ రహదారి సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద, ముట్రాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. దీంతో దొంగ గజ్వేల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులో పురోగతి సాధించినట్లు.. నగదుతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించ లేదు. -
సమ్మెను లెక్క చేయకుండా లారీ నడిపాడని..
సిద్దిపేటటౌన్: దేశవ్యాప్తంగా లారీలు సమ్మెలో ఉంటే నువ్వు మాత్రం ఎందుకు నడుపుతున్నావని లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన దేశెట్టి యాదగిరి వృత్తి రీత్యా లారీ డ్రైవర్. ఎప్పటిలాగే శుక్రవారం రాజీవ్ రహదారిపై లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. అదే రహదారిపై సమ్మె చేస్తున్న ఆలిండియా లారీ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన లారీ డ్రైవర్లు జెట్టి కనకయ్య, సత్తయ్య, మధు, శంకర్, రాజు, మల్లేశంలు దేశెట్టి యాదగిరిపై కర్రలతో దాడి చేసి అతని లారీ అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా లారీ రిజిస్ట్రేషన్ పేపర్లు లాక్కున్నారు. ఈ మేరకు బాధితుడు సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భూమి మీద నా ఆయుష్షు అయిపోయింది..
వెల్దుర్తి(తూప్రాన్): ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా భర్త చాలా మంచోడు.. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది’ అంటూ సూసైడ్ నోట్ రాసి నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మండల పరిధి ఉప్పులింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర బాబుకు ఏ ఈడాది మే నెల 11న మెదక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన కళమ్మ, రాములు దంపతుల కూతురు నాగరాణి(21)తో వివాహం జరిగింది. బాబు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడు కృష్ణ నగరంలో పని చేసుకుంటున్నాడు. రోజు మాదిరిగా బాబు ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. అనుమానంతో ఎంత పిలిచినా లోపలి నుండి ఎలాంటి శబ్ధం వినిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై గంగరాజు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక గడియ లోపలి తాళాలు పగులకొట్టారు. లోపలికి వెళ్లి చూడగా నాగరాణి శవమై కనిపించింది. శవం పక్కనే మంచంపై ఉన్న సూసైడ్ నోట్‌ను వారి కుటుంబీకులు గమనించి పోలీసులకు అప్పగించారు. అందులో ‘‘నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది.. 2,3 రోజుల నుండి చనిపోవాలన్న ప్రేరణ కలుగుతోంది. నేను ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. అందుకోసం నా తనువు చాలిస్తున్నానంటూ’ రాసి ఉంది. ‘‘దయచేసి ఎవరూ బాధపడొద్దు, నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా చనిపోతున్నా. వీలైతే మాల్తుమ్మెద గ్రామానికి చెందిన చిన్నమ్మ కూతురును బాబుకు ఇచ్చి పెండ్లి చేయండి. అతను చాలా మంచోడు’’ అని రాసింది. నా వస్తువులన్నీ చెల్లెలుకే ఇవ్వండి. దయచేసి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ భూమి మీద నా ఆయుష్షు అయిపోయినట్లుంది అందుకే వెళ్లిపోతున్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు నేనే’’ అని రాసింది. ఇది చదివిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పెళ్లయిన మూడు నెలలకే నూరేండ్లు నిండాయా బిడ్డా అంటూ విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టంకోసం మెదక్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.