ధ్వంసమైన లారీ అద్దాలు
సిద్దిపేటటౌన్: దేశవ్యాప్తంగా లారీలు సమ్మెలో ఉంటే నువ్వు మాత్రం ఎందుకు నడుపుతున్నావని లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన దేశెట్టి యాదగిరి వృత్తి రీత్యా లారీ డ్రైవర్. ఎప్పటిలాగే శుక్రవారం రాజీవ్ రహదారిపై లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు.
అదే రహదారిపై సమ్మె చేస్తున్న ఆలిండియా లారీ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన లారీ డ్రైవర్లు జెట్టి కనకయ్య, సత్తయ్య, మధు, శంకర్, రాజు, మల్లేశంలు దేశెట్టి యాదగిరిపై కర్రలతో దాడి చేసి అతని లారీ అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా లారీ రిజిస్ట్రేషన్ పేపర్‌లు లాక్కున్నారు. ఈ మేరకు బాధితుడు సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment