
అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని చితకబాదుతున్న మహిళలు
మెదక్ ,తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో వివాహితపై అర్ధరాత్రి అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని గోవర్ధన గిరి మదిర చిన్న ముత్యంపేట (పిట్టలవాడ)లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 56 వయస్సు ఉన్న వ్యక్తి అదే గ్రామానికి చెందిన 28 సంవత్సరాల వివాహిత నివసిస్తున్న గుడిసెలోకి గురువారం అర్ధరాత్రి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్రంగా ప్రతిగడిచింది. వెంటనే ఆమె ఆరవడంతో పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పరిస్థితినిని గ్రామ పెద్దలకు వివరించింది. వెంటనే పంచాయతీ నిర్వహించి అతన్ని పిలిపించి నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళలు ఆ వ్యక్తి పై కారంపొడి చల్లుతూ చితకబాదారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని మహిళలు గ్రామ పెద్దలను కోరారు. మరోసారి జరగకుండా చూస్తామని హామీనివ్వడంతో వారు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment