
జియాగూడ: ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ మహిళపై లైంగిక దాడిచేసి అనంతరం హత్యచేశాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు..కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిదిలోని జియాగూడ కేశవస్వామినగర్ ప్రాంతంలో ఉంటున్న అండాలు(47)జియాగూడ మేకల మండిలో మేకలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. అండాలుకు భర్త రాములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల జియాగూడ కేశవస్వామినగర్‌లో రెండంతస్తుల భవనం నిర్మించారు. భవన నిర్మాణం పూర్తికావడంతో మేస్త్రీ కూలీలకు తండిగా దావత్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇది కొనసాగింది. (బొమ్మల షాపులో మహిళపై దారుణం)
మేస్త్రీల వెంబడి వారి స్నేహితుడు రవి కూడా దావత్‌కు హాజరై వీరితో ఉన్నాడు. చివరగా మిగిలిన కుటుంబ సభ్యులు అండాలు, రాములు, కుమారుడు మల్లేష్, బావతో రవికూడా ఉన్నాడు. ఇంటి మొదటి అంతస్తుపైకి పడుకోవడానికి అండాలు వెళ్లింది. గమనించిన రవి అనే వ్యక్తి డాబాపై సిగరెట్ తాగివస్తానని చెప్పి పైకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో భర్త, కుమారుడు వెళ్లి చూడగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు గమనించారు. రవిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. అప్పటికే ఆండాలు మృతిచెందింది. భర్త రాములు కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment