అత్తపై అఘాయిత్యం.. భార్యకు విడాకులు | Son in Law Molestation on Aunty in Hyderabad | Sakshi
Sakshi News home page

అత్తపై అఘాయిత్యం

Published Sat, Dec 14 2019 8:09 AM | Last Updated on Sat, Dec 14 2019 8:09 AM

Son in Law Molestation on Aunty in Hyderabad - Sakshi

నిందితుడు హార్థిక్‌

పంజగుట్ట: మద్యం మత్తులో ఓ అల్లుడు అత్తపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళ, పాలక్కాడ్‌కు చెందిన మహిళ నగరానికి వలస వచ్చి ఆసీఫ్‌నగర్, దత్తాత్రేయ కాలనీలోని స్టోన్‌ వ్యాలీలో ఉండేది. రెండేళ్లుగా ఆమె క్రితం శ్రీనగర్‌కాలనీలో ఉంటున్న కుమార్తె ప్రశాంతి, అల్లుడు హార్థిక్‌ గాంధీ ఇంట్లో ఉంటూ వారి కుమారుడిని చూసుకునేది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె గత నెల 13న మాత్రలు వేసుకుని నిద్రపోయింది. అదే రోజు అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హార్థిక్‌ ఆమె గదిలోకి వెళ్లి నోరుమూసి లైంగికదాడికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పింది. దీంతో ఆమె అప్పటికే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన హార్థిక్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచి నిలదీయగా, ‘తనను క్షమించాలని, క్షణికావేశంలో జరిగిందని చెప్పి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిపోయాడు. మళ్లీ అతడికి ఫోన్‌ చేయగా తాను ఇంటినుంచి వెళ్లిపోతున్నానని, నీకు విడాకులు ఇస్తాను. ప్రతి నెల భరణం ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు, ఆమె కుమార్తెతో కలిసి శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement