ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. | Molestation Attack On Six year old child | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..

Published Mon, Mar 2 2020 3:07 AM | Last Updated on Mon, Mar 2 2020 3:07 AM

Molestation Attack On Six year old child - Sakshi

రమేశ్‌

మొగుళ్లపల్లి: మద్యం మత్తులో ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పర్లపల్లికి చెందిన జోరుక రమేశ్‌ (38) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో ఇతడి భార్య ఎనిమిదేళ్ల క్రితమే వదిలి వెళ్లింది. ఆదివారం గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కిరాణం షాపు వద్ద ఆడుకుంటుండగా.. ఫోన్‌లో పాటలు వినిపిస్తానంటూ నమ్మించిన రమేశ్, పాపను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలిక కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న పాప చిన్న నానమ్మ, రమేశ్‌ ఇంటికి చేరుకునే సరికి బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ బయటకు వచ్చింది. విషయం గ్రహించిన చుట్టుపక్కల వారు రమేశ్‌ను నిలదీయడంతో తనకేం తెలియదంటూ బుకాయించి పారిపోయాడు. బాలిక నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేశిని విజయ్‌కుమార్‌ తెలిపారు.  కాగా రమేశ్‌ను కొందరు గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement