ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..! | Man Commits Suicide After Facing Harassment By A Woman In Sangareddy District | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

Published Thu, Jul 25 2019 12:32 PM | Last Updated on Thu, Jul 25 2019 2:08 PM

Man Commits Suicide After Facing Harassment By A Woman In Sangareddy District - Sakshi

మృతిచెందిన లింగం

సాక్షి, పటాన్‌చెరు: భర్త చనిపోయిన మహిళ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన చిలకముక్కు కిషన్‌ బ్రతుకుదేరువు కోసం ఐదేళ్ల క్రితం పటాన్‌చెరుకు వచ్చారు.

పట్టణంలోని చైతన్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా వీరి పెద్ద కుమారుడు లింగంకు పటాన్‌చెరుకు చెందిన భర్త చనిపోయిన మహిళతో ప్రేమవ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న లింగం కుటుంబ సభ్యులు తమ కూమారుడు జోలికిరావద్దని మహిళను హెచ్చరించారు. అయితే తనను ప్రేమించాలని లేదా సహజీనం చేయాలని వేధించేదని మృతుడు కుటుంబసభ్యులకు తెలిపాడు.

బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో లింగం ఉరివేసుకున్నాడు. పక్కగదిలో ఉన్న రామకృష్ణ వెళ్లి చూడగా సీలింగ్‌ రాడ్డుకు వేలాడుతూ కనిపించాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలిపాడు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా మృతుడి జేబులో దొరికిన ఉత్తరం ప్రకారం సహజీవనం కోరిన మహిళ రూ.60 వేలు తీసుకురావాలని వేధించిందని పేర్కొన్నాడు. తమ కుమారుడి మృతికి కారణమైన మహిళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లింగం తండ్రి కిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement