
స్వాతి మృతదేహం
పటాన్‌చెరు టౌన్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు పరిధిలోని బండ్లగూడకు చెందిన శివశంకర్, ఆమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌కు చెందిన స్వాతి (21)తో ఈ ఏడాది మార్చి 13న వివాహం జరిగింది. కాగా వివాహం జరిగినప్పటి నుంచి వరకట్నం కోసం వేధించే వారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
ఈ క్రమంలో గురువారం భర్త శివశంకర్ భార్య (మూడు నెలల గర్బిణి)కు అనారోగ్యంగా ఉందని స్వాతి తండ్రికి చెప్పడంతో వచ్చి ఐలాపూర్‌కు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వలేరని, మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శివశంకర్, అత్త భారతమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment