మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య | Drunken Man Hangs Himself To Death Near Patancheru | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

Published Thu, Jul 18 2019 1:55 PM | Last Updated on Thu, Jul 18 2019 1:55 PM

Drunken Man Hangs Himself To Death Near Patancheru - Sakshi

ఆంజనేయులు మృతదేహం

సాక్షి, పటాన్‌చెరు: మద్యం మత్తులో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి  ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మరెల్లి గ్రామానికి చెందిన అంజనేయులు(40) బతుకుదేరువు కోసం 20 సంవత్సరాల క్రితం వచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ గౌతంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న అంజనేయులు మద్యంతాగి  ఇంటికి వచ్చి తన పెద్ద కూతురును ఇష్టం వచ్చిన్నట్లు తిట్టి, కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో మరసటి రోజు భార్య లక్ష్మి, పిల్లలను తీసుకొని భర్త అంజనేయులు కోసం వెతుకుతూ మంగళవారం రాత్రి బంధువుల ఇంటి వద్ద ఉండి పోయింది. బుధవారం మద్యం సేవించి  వచ్చిన అంజనేయులుకు ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement