hang himself
-
అయ్యో.. ఉరి తప్పింది కానీ చావు తప్పలేదు!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఓ యువకుడి పాలిట ఉరి తప్పిందనుకుంటే మృత్యువు మరో రూపంలో వచ్చింది. చెట్టుపై ఉరివేసుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడిని కిందికి దించుతుండగా జారి పడి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొత్తకొండ బీరయ్య(35) మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఉరివేసుకుని చచ్చిపోతానంటూ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఎక్కాడు. జనాలు గుమిగూడటంతో...ఎవరైనా చెట్టెక్కితే పైనుంచి దూకుతానంటూ బెదిరించాడు. భార్య, పిల్లలు, గ్రామ సర్పంచ్, బంధువులు అతడిని దిగమని అడిగినా పట్టించుకోలేదు. అంతలోనే చెట్టుకి ఉరి వేసుకున్నాడు. కొనప్రాణం ఉండటంతో గమనించిన గ్రామస్తులు చెట్టు ఎక్కి కిందికి దించుతుండగా జారి నేలపై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అయి మృతి చెందాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
తొమ్మిది పేజీల సూసైడ్ నోట్.. ఎనిమిది నెలలుగా లైంగిక సంబంధం..
సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): కంచిలి మండలం మకరాంపురం గ్రా మానికి చెందిన ఓ యువకుడు శనివారం రాత్రి తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అలాగే తోటి ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మొబైల్ ఫోన్లో వాట్సాప్ మెసేజీలు కూడా పంపించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ యువకుడితో పాటు మరో వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్నారు. ఎనిమిది నెలలుగా వీరి మధ్య లైంగిక సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఏమైందో గానీ ఉన్నట్టుండి ఇటీవల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ చర్యను తట్టుకోలేక యువకుడు శనివారం రాత్రి తన ఇంటి వరండాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం లేచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తర్వాత కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సోంపేట సీఐ ఆర్. రవిప్రసాద్‌లు గ్రామంలోనూ, అతడు పనిచేస్తున్న మద్యం దుకాణంలోనూ విచారణ చేశారు. చదవండి: గాయత్రి నువ్వు లేని జీవితం నాకు వద్దు.. -
మతిస్థిమితం లేక.. తాగిన మైకంలో ఉరి వేసుకుని..
నవాబుపేట: తాగిన మైకంలో ఉరివేసుకొని ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ముబారక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నారివెల్లికి చెందిన యాదిష్ వెంకటయ్య(40) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం భార్య యాదమ్మ, కూతుళ్లు సంతోష, సంధ్య, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి నవాబుపేట మండలం ముబారక్ పూర్ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు. గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు అతను కింద పడటంతో తలకు గాయమైంది. అప్పటి నుంచి వెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి బానిస అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశం తెలిపారు. -
ఉరికి వేలాడుతున్న మనిషి.. అంతా ప్రాణం పోయింది అనుకున్నారు, కానీ..
నొయిడా: కేవలం మూడు నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు పోలీసులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవ పడ్డాడు. వాగ్వాదం అనంతరం ఆ భార్య పొలానికి వెళ్లిపోయింది. భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన భర్త క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధతో మద్యంతాగి ఇంట్లోకి వెళ్లి కోపంతో తలుపువేసుకున్నాడు. ఇదంతా గమనించిన అతని కుమార్తె వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడు తన చెల్లికి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. సోదురుడు సూచించిన మేరకు ఆ బాలిక పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించడంతో పాటు స్థానిక ప్రజలు గుమికూడి అతను చనిపోయినట్లుగా భావిస్తుంటారు. అయితే అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉందని పోలీసుల్లో ఒకరు గమనించి వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతని ప్రాణాలను కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: ఇకపై కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిడండ్రులకు శిక్ష.. ఎక్కడంటే -
భార్యలు పుట్టింటికి వెళ్లారని ఇద్దరు ఆత్మహత్య
సాక్షి,బుక్కరాయసముద్రం: రెండు కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసలై భార్యలను కొట్టడంతో వారు పుట్టింటికి వెళ్లగా .. ఇద్దరు భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కాలనీకి చెందిన నాగయ్య (45) తన భార్య అశ్వర్థమ్మతో కలిసి కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు. అయితే నాగయ్య మద్యానికి బానిసై భార్యను రోజూ కొట్టేవాడు. దీంతో భార్య అశ్వర్థమ్మ ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన నాగయ్య శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పురుగు మందు తాగి... మండల పరిధిలోని కేకే అగ్రహారంలో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. కేకే అగ్రహారం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (26) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వరయ్య తాగుడుకు బానిసై భార్యను కొట్టేవాడు. దీంతో ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఈశ్వరయ్య పురుగుల మందు సేవించాడు. బంధువులు గమనించి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. బంధువులు గుట్టుచప్పడు కాకుండా మృత దేహాన్ని గ్రామంలో ఖననం చేస్తుండగా విషయం పోలీసులకు తెలియడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి..అంతలోనే!
సాక్షి, కురబలకోట :రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్ల్లడిల్లిపోయారు. అసలే నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. తన కొడు కు మాత్రం తమలా కష్టపడకూడదని, ఇంజినీరింగ్ చదివించారు. కోర్సు అయిపోయిందని, త్వరలోనే ఇంటికొస్తానని కొడుకు చెప్పడంతో ఆ పేద తండ్రికి కాస్త ఊరట కలిగింది. అంతలోనే కొడుకు చావు కబురు రావడంతో గుండెలుపగిలేలా రోదించారు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలం అంగళ్లులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన రామచంద్రుడు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజీవ (21), చిన్న కుమారుడు సతీష్(15). రామచంద్రుడు గౌడౌన్లో హమాలీగా పనిచేస్తున్నారు. సావిత్రి రోజు కూలీ. అయితే, మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటాలో బిటెక్ (మెకానికల్)లో సీటు సాధించిన సంజీవ ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు పూర్తయ్యాయి. మిత్రులందరూ ఇళ్లకు బయల్దేరుతున్నా, ఇతను మాత్రం ఒక రోజు హాస్టల్లోనే ఉండి ఇంటికెళతానని చెప్పి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హోస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తర లించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంజీవ మొబైల్‌ను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయేమో అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుని చేతులపై రక్తపు మరకలున్నాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ సుకుమార్ తెలిపారు. -
ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..
సాక్షి, హైదరాబాద్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్ టీఎన్ నగర్లో నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సింధే సుదీప్‌కుమార్ (18) ఉన్నారు. సుదీప్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఉండటంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ రోజూ అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఇదిలా ఉండగా, సుదీప్ బుధవారం రాత్రి హైటెక్ సిటీ హోటల్‌కు వెళ్దామని తన స్నేహితులను పట్టుపట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడపడ్డాడు. రాత్రి ఒంటి గంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు స్నేహితులతో ఫోన్లో చాట్ చేసిన సుదీప్ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. ) -
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య : ఐ మిస్ యూ అమ్మ..
-
ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా: నారాయణ విద్యార్థి
బి.కోడూరు: నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి(17) కడప నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల యాజమాన్యం చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనని, రెండు రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి’ అంటూ తల్లిదండ్రులనుద్దేశించి అందులో పేర్కొన్నాడు. ఐ మిస్ యూ అమ్మ.. మిస్ యూ నాన్న.. మిస్ యూ బ్రదర్స్.. అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. అంతేకాకుండా తన అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని రాసుకున్నాడంటూ తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులరెడ్డి వారికి మూడో సంతానం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. బి.కోడూరు ఎస్ఐ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు: మద్యం మత్తులో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మరెల్లి గ్రామానికి చెందిన అంజనేయులు(40) బతుకుదేరువు కోసం 20 సంవత్సరాల క్రితం వచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ గౌతంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న అంజనేయులు మద్యంతాగి ఇంటికి వచ్చి తన పెద్ద కూతురును ఇష్టం వచ్చిన్నట్లు తిట్టి, కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మరసటి రోజు భార్య లక్ష్మి, పిల్లలను తీసుకొని భర్త అంజనేయులు కోసం వెతుకుతూ మంగళవారం రాత్రి బంధువుల ఇంటి వద్ద ఉండి పోయింది. బుధవారం మద్యం సేవించి వచ్చిన అంజనేయులుకు ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురు ఆత్మహత్య
-
వివాహితతో ప్రేమ వ్యవహారం: ముగ్గురు బలి
సాక్షి, పశ్చిమ గోదావరి: జంగారెడ్డి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురి చావులకు కారణమైంది. పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా.. ఈ వ్యవహారానికి బాధ్యుడిగా భావిస్తున్న యువకుడు కూడా శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మరికొంత కాలానికి బిందు భర్త సాయికి ఫోన్ చేసిన మురళి.. బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని చెప్పాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మరణాలపై పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో మురళి శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మురళి తండ్రి కానిస్టేబుల్ కావడం గమనార్హం. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
ఆర్మూర్అర్బన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో పూసవర్ల ప్రసాద్(26) బుధవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాకుబ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్‌లో స్టౌవ్ రిపేరింగ్ చేసుకుని జీవించే ప్రసాద్ బుధవారం తన భార్యను అవసరాల కోసం రూ. వెయ్యి ఇవ్వమని అడిగాడు. భార్య ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాకూబ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.