Youngman Hangs Himself Wrote Suicide Note Orissa - Sakshi
Sakshi News home page

తొమ్మిది పేజీల సూసైడ్‌ నోట్‌.. ఎనిమిది నెలలుగా లైంగిక సంబంధం..

Published Mon, Mar 28 2022 3:09 PM | Last Updated on Mon, Mar 28 2022 5:56 PM

Youth Hangs Himself Wrote Suicide Note Orissa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): కంచిలి మండలం మకరాంపురం గ్రా మానికి చెందిన ఓ యువకుడు శనివారం రాత్రి తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ తొమ్మిది పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు. అలాగే తోటి ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మొబైల్‌ ఫోన్‌లో వాట్సాప్‌ మెసేజీలు కూడా పంపించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ యువకుడితో పాటు మరో వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ వైన్‌ షాపుల్లో పనిచేస్తున్నారు.

ఎనిమిది నెలలుగా వీరి మధ్య లైంగిక సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఏమైందో గానీ ఉన్నట్టుండి ఇటీవల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ చర్యను తట్టుకోలేక యువకుడు శనివారం రాత్రి తన ఇంటి వరండాలో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం లేచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తర్వాత కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సోంపేట సీఐ ఆర్‌. రవిప్రసాద్‌లు గ్రామంలోనూ, అతడు పనిచేస్తున్న మద్యం దుకాణంలోనూ విచారణ చేశారు.

చదవండి: గాయత్రి నువ్వు లేని జీవితం నాకు వద్దు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement