
సాక్షి, పశ్చిమ గోదావరి: జంగారెడ్డి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురి చావులకు కారణమైంది. పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా.. ఈ వ్యవహారానికి బాధ్యుడిగా భావిస్తున్న యువకుడు కూడా శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
మరికొంత కాలానికి బిందు భర్త సాయికి ఫోన్ చేసిన మురళి.. బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని చెప్పాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మరణాలపై పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో మురళి శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మురళి తండ్రి కానిస్టేబుల్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment