దారుణం: తల్లి, భార్య కలసి గొంతు పిసికి చంపారు | Wife Assassinated Husband Over Liquor Addiction Medak | Sakshi
Sakshi News home page

దారుణం: తల్లి, భార్య కలసి గొంతు పిసికి చంపారు

Published Sun, Jun 12 2022 1:40 PM | Last Updated on Sun, Jun 12 2022 1:46 PM

Wife Assassinated Husband Over Liquor Addiction Medak - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,వర్గల్‌ (గజ్వేల్‌): తాగుడుకు బానిసై నిత్యం భార్య, తల్లిని హింసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం వర్గల్‌ మండలం మల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డిపల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (36)కి భార్య రజిత, తల్లి లక్ష్మి, పన్నెండేళ్లలోపు యుగంధర్‌రెడ్డి, గగన అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి తాగుడుకు బానిసైన రవీందర్‌రెడ్డి ప్రతిరోజు తాగి భార్యను, తల్లిని, పిల్లలను  తిడుతూ, కొడుతూ హింసించేవాడు. పలుమార్లు పంచాయతీ పెట్టి మందలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.

శనివారం ఉదయం కూడా తాగిన మైకంలో తన తల్లిని, భార్యను తిట్టి కొట్టి గొడవపడ్డాడు. దీంతో అతని హింసలు భరించలేక తల్లి లక్ష్మి, భార్య రజిత ఇంట్లోని ఓ గదిలో రవీందర్‌రెడ్డిని గొంతు పిసికి హతమార్చారని మృతుడి మేనమామ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని సీఐ కమాలాకర్, సంపత్‌కుమార్‌ పరిశీలించారు. మృతుని మెడపై, కాలు వద్ద గాయాలున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement