
ప్రతీకాత్మక చిత్రం
మెదక్ మున్సిపాలిటీ : అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. ఫతేనగర్ వీధికి చెందిన కళావతి(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. పదేళ్లక్రితం ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరోవైపు భర్తకూడా చనిపోయాడు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న కళావతి మంగళవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.