ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాలు ప్రమాదానికి కొద్ది గంటల ముందు తీసుకున్న సెల్ఫీ
మనోహరాబాద్(తూప్రాన్): పండగవేల విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమారులు మృతి. దీంతో ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిన మనోహరాబాద్ స్టేషన్. పండగ వేళ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బోగిమంటలు సిద్ధం చేస్తున్న వేళ.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని సంతోషంగా సెకండ్ షో సినిమాకు వెళ్లి అర్థరాత్రి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో స్కూటీ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న కడీని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాత పడగా, ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ సంఘటన మనోహరాబాద్ మండల కేంద్రంలోని స్టేషన్ శివారులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. సోమవారం పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్ పరిధిలోని స్టేషన్‌కు చెందిన వరగంతం సదాలింగం ఒక్కగానొక్క కుమారుడు రంజిత్(24), సాయిబాబా ఒక్కగానోక్క కుమారుడు విష్ణు(20)లు తమ మిత్రుడు తూప్రాన్‌కు చెందిన పసుల సాయితో కలిసి తమ స్కూటీపై మనోహరాబాద్‌లో మిత్రుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అక్కడి నుంచి మేడ్చల్‌లో సెకండ్‌షో సినిమాకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో స్టేషన్ శివారులోకి రాగానే రోడ్డుపై ఉన్న మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కడీని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
కాగా స్టేషన్‌లో విషాధచాయలు అలుముకున్నాయి. ఇదీలా ఉండగా మృతుడు రంజిత తండ్రి కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయికి తీవ్రగాయాలు కావడంతో అతడిని తూప్రాన్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. కాగా స్టేషన్‌లో విషాధచాయలు అలుముకున్నాయి. ఇదీలా ఉండగా మృతుడు రంజిత తండ్రి కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇట్టి సంఘటనపై సాయిబాబా ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment