old lady suicide
-
అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య
మెదక్ మున్సిపాలిటీ : అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. ఫతేనగర్ వీధికి చెందిన కళావతి(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. పదేళ్లక్రితం ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరోవైపు భర్తకూడా చనిపోయాడు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న కళావతి మంగళవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. -
భర్త చనిపోయాడనే మనస్తాపంతో..
లంగర్‌హౌస్ : తన కంటే ముందే భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80) భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్పాలడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లులు దంపతులు. వారి కుమారుడు సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్ బాపునగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారో గ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదలు చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనస్తాపానికి గురై తాను ఇక బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది.. పొలం పనులు చూసుకోడానికి కుమారుడు రాంచందర్ పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగం దేవాలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండ తస్తుల భవనంపైకెక్కి అక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
మదనపల్లె క్రైం: జీవితంపై విరక్తితో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. బసినికొండకు చెందిన ఆవుల నరసింహులు భార్య మల్లమ్మ(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం ఊరికి సమీపంలో ఉన్న రెడ్లచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్ర శవం నీటిలో తేలాడుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రైనీ ఎస్పీ సతీష్‌కుమార్, ఎస్ఐ సునీల్ కుమార్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. విచారణలో ఆమె బసినికొండకు చెందిన నరసింహులు భార్యగా తేలింది. కేసు దర్యాప్తులో ఉంది. -
గుండె జబ్బు భరించలేక..
తిరుమలాపూర్ చెరువులో ఘటన అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన మహిళగా గుర్తింపు పెద్దశంకరంపేట: స్థానిక తిరుమలాపూర్ చెరువులో శనివారం అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన తెనుగు రుక్కమ్మ (65) మృతదేహం లభ్యమైంది. పెద్దశంకరంపేట ఎస్ఐ విజయరావ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున మహిళ శవం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మహిళ మృతదేహాన్ని చెరువులో నుండి వెలికితీయించారు. మృతురాలికి సంబంధించిన వివరాలు సేకరించగా అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన రుక్కమ్మగా గుర్తించామన్నారు. రుక్కమ్మ కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఉషాముళ్లపూడిలో గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోందన్నారు. గుండెకు సంబంధించిన బాధ ఎక్కువ కావడంతో ఆమె పేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటానని ఇంట్లో చెప్పి బయలుదేరిందని ఆయన తెలిపారు. బాధ ఎక్కువై తిరుమలాపూర్ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.