భార్య ప్రియుడితో పరార్‌.. వ్యక్తి ఆత్మహత్య | Newly Married Man Commits Suicide In Siddipet | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Published Fri, Jul 12 2019 7:58 AM | Last Updated on Fri, Jul 12 2019 8:06 AM

Newly Married Man Commits Suicide In Siddipet - Sakshi

 చెత్రి బాలకిషన్‌ (ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘనట మండల పరిధిలోని రావురూకుల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల గ్రామానికి చెందిన చెత్రి బాలకిషన్‌కు పెద్దమల్లారెడ్డిపేటకు చెందిన లావణ్యతో నాలుగు నెలల కిత్రం వివాహం అయింది.

వారం రోజుల క్రితం లావణ్యను తల్లితండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో లావణ్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై లావణ్య తల్లిదండ్రులు బాలకిషన్‌ ఇంటికి ఫోన్‌ చేసి లావణ్య ఇంటికి వచ్చిందా అడగగా రాలేదని చెప్పారు. దీంతో గ్రామంలో విచారణ చేయగా లావణ్య ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలకిషన్‌ 9వ తేదీన తన పెద్దనాన్న కుమారుడికి ఫోన్‌ చేసి బావివద్ద పురుగుల మందు తాగుతున్నట్లు సమాచారం అందించాడు.

దీంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకునే సరికి బాలకిషన్‌ను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రాథమికి చికిత్స అందించిన అనంతరం వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వారు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, బాలకిషన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement