వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!! | High Court Stunned by Advocate Petition to Run Brothel | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!

Published Fri, Jul 26 2024 5:01 AM | Last Updated on Fri, Jul 26 2024 1:06 PM

High Court Stunned by Advocate Petition to Run Brothel

ఓ న్యాయవాది పిటిషన్‌ 

అవాక్కైన మద్రాస్‌ హైకోర్టు 

చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్‌ వేయడంతో మద్రాస్‌ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్‌ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్‌ బాత్‌లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్‌ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్‌ సమర్థించుకోవడాన్ని జస్టిస్‌ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. 

పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్‌ కౌన్సిల్‌కు సూచించారు. మురుగన్‌కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్‌ను, బార్‌ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement