సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్‌లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్‌ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది.
అదే సమయంలో ఈ మ్యాచ్‌లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్‌లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్..
Comments
Please login to add a commentAdd a comment