brothal house
-
వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్ బాత్‌లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్‌కు సూచించారు. మురుగన్‌కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్‌ను, బార్ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. -
వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఆదిలాబాద్/ఎదులాపురం: పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై గురువారం టాస్క్‌ఫోర్స్ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ రామకృష్ణతో కలిసి సంయుక్తంగా దాడి చేశారు. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని కైలాస్‌నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ తెలిపారు. గత కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నట్లు వివరించారు. (పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం అతడ్ని..) ఇందులో వడ్డెర కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్, శాంతినగర్‌కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్ మండలం పెండల్వాడకు చెందిన ఠాకూర్ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్‌బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్‌కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్ మండలం పెడల్‌వాడకు చెందిన చుక్కలవార్ ఆకాశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు నిర్వాహకులతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వన్‌టౌన్ ఎస్సైలు జి.అప్పారావు, జాదవ్ గుణవంత్‌రావు, టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు షేక్ తాజొద్దీన్, ఎం.రమేష్‌కుమార్, సయ్యద్ రాహత్, హనుమంత్‌రావు, ఎంఏ కరీమ్, మంగళ్‌సింగ్, ఠాకూర్ జగన్‌సింగ్, ఎన్.నగేష్, మహిళ కానిస్టేబుళ్లు మమత, సోనీ తదితరులు ఉన్నారు. (భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య ) -
వ్యభిచార గృహంపై దాడి; ఆరుగురి అరెస్ట్
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మురళీనగర్ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
యాదగిరి గుట్టలో కొనసాగుతున్న దాడులు
-
వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యాదాద్రిలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 15 మంది చిన్నారులను వ్యభిచార రొంపి నుంచి పోలీసులు కాపాడారు. గుట్టలో దాడులు జరుగుతున్నాయన్న సంగతి తెలుసుకున్న కొందరు నేరగాళ్లు ఇళ్లకు తాళాలు వేసి చిన్నారులతో సహా పరారయ్యారు. వీరందరూ సిద్ధిపేట, ధర్మపురి, నిజామాబాద్, రామాయంపేటలకు వెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. చిన్నారులకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్న ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు డాక్టర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో వ్యభిచారం పూర్తిగా నిర్ములించాలని, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యాదాద్రిలో వ్యభిచార గృహాలను నడుపుతున్న వారికి నాయకుడిగా భావిస్తున్న యాదగిరి అనే వ్యక్తి ప్రస్తుతం పీడీ యాక్ట్ కేసులో వరంగల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ జైల్లో నుంచే చక్రం తిప్పుతూ చిన్నారుల అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడని సమాచారం. కాగా, ఇప్పటికే యాదగిరి ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. -
స్పా సెంటర్ ముసుగులో..
సాక్షి, కర్ణాటక ,కృష్ణరాజపురం: స్పా సెంటర్ ముసుగులో వేశ్యావాటిక నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రామ్మూర్తినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పూర్ణేశ్, సాహిల్,కి శోర్లు రామ్మూర్తినగర్‌లో అస్నోటిక్ స్లిమ్ అండ్ స్పా సెంటర్ ముసుగులో వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యువతులతో బలవంగా వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రామ్మూర్తినగర్ పోలీసులు మంగళవారం స్పా సెంటర్‌పై దాడి చేసి ముగ్గరు యువతులను రక్షించి నిందితులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
సెక్స్‌రాకెట్ గుట్టురట్టు
భువనేశ్వర్(జయపురం): ఒడిశాలోని జయపురంలో ఓ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టయింది. పట్టణ శివారులో గల కుంభారిసాహిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా బ్రోతల్ హౌస్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఆకస్మిక దాడులు నిర్వహించి ఆరుగురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలలో కేంద్రపడ, మల్కన్‌గిరి, జయపురంలకు చెందిన యువతులు ఉన్నారని పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్ విలేకరులకు వెల్లడించారు. పట్టుబడిన విటులలో గోవింద హల్వ(28) తిరుపతి బాగ్(21)కృష్ణ బెహర(32)లు ఉన్నట్లు తెలియజేశారు. పట్టుబడిన మహిళలో ఒకామెకు బిడ్డ కూడా ఉంది. తాము మహిళా పోలీసులతో పాటు దాడి జరిపామని వారి వద్ద 18 అశ్లీల సీడీలతో పాటు కండోమ్‌లు, రూ.11వేలు లభించాయని వెల్లడించారు. వారిని జయపురం ప్రభుత్వఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు జరిపించామని అనంతరం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఈ దాడిలో జయపురం పట్టణ పోలీసులు, సదర్ పోలీసులతో పాటు మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ దాడులకు జయపురం ఏఎస్పీ ప్రభాత్ కుమార్ ప్రధాన్, పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్ నాయకత్వం వహించారు. సమాచారం అందిస్తే ఆట కట్టిస్తాం ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట గోవింద హల్వ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి తాను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)జయపురంలో పనిచేస్తున్నానని చెప్పి ఇంటిని అద్దెకు అడిగాడని వెల్లడించారు. కుటుంబంతో ఉంటామని చెప్పాడని తమకు తెలిసిన కొంత మందిని వాకబు చేయగా అతడు మంచి వాడని తెలపడంతో ఇంటిని అద్దెకు ఇచ్చామని ఆయన వెల్లడించాడు. తమ ఇంటిని వ్యభిచార గృహంగా చేస్తాడని ఊహించలేక పోయామని వాపోయాడు. జయపురం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో కొంత మంది వ్యభిచార గృహాలను నడుపుతునారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని పక్కా సమాచారం అందితే దాడులు జరిపి ఆటకట్టిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రదారి గోవిందహల్వ అని భావిస్తున్నారు. విలేకరుల సమావేశంలో జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ శనాపతి కూడా పాల్గొన్నారు. -
మహిళల విక్రయ ముఠా అరెస్ట్
మహిళల విక్రయ ముఠా అరెస్ట్ సత్యవేడు: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మహిళలను వ్యభిచార గహాలకు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠాపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నెల 14వ తేదీన సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం మండలం, తాటికాయలవారిపాళెంకు చెందిన ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో అతను మహిళలను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించి అక్కడ వ్యభిచార కేంద్రాలకు విక్రయించే ముఠా ఏజెంట్‌గా తేలిందని తెలిపారు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలకు ఎరవేస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నైలోని రఫి, పాండియన్, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఏరియా ఏజెంటుగా ఉన్న ఏసుప్రేమ తదితరులు నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పాంతాలకు చెందిన మహిళలను విదేశాలకు తరలించారని తెలిపారు. ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు ఇప్పటి వరకు 10మంది మహిళలను మలేషియాకు పంపించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.