సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు | sex rocket burst in jayapuram | Sakshi
Sakshi News home page

సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

Published Sun, Mar 19 2017 2:30 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు - Sakshi

సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

భువనేశ్వర్(జయపురం):
ఒడిశాలోని జయపురంలో ఓ సెక్స్‌రాకెట్‌ గుట్టు రట్టయింది. పట్టణ శివారులో గల కుంభారిసాహిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా బ్రోతల్‌ హౌస్‌ను నిర్వహిస్తున్నట్లు   పోలీసులకు సమాచారం అందింది. వారు ఆకస్మిక దాడులు నిర్వహించి ఆరుగురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలలో  కేంద్రపడ, మల్కన్‌గిరి, జయపురంలకు చెందిన యువతులు ఉన్నారని పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్‌ విలేకరులకు వెల్లడించారు.

పట్టుబడిన విటులలో గోవింద హల్వ(28) తిరుపతి బాగ్‌(21)కృష్ణ బెహర(32)లు ఉన్నట్లు  తెలియజేశారు.  పట్టుబడిన మహిళలో ఒకామెకు బిడ్డ కూడా ఉంది. తాము మహిళా పోలీసులతో పాటు దాడి జరిపామని వారి వద్ద 18 అశ్లీల సీడీలతో పాటు కండోమ్‌లు, రూ.11వేలు లభించాయని వెల్లడించారు. వారిని జయపురం ప్రభుత్వఆస్పత్రికి తరలించి  వైద్యపరీక్షలు జరిపించామని అనంతరం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఈ దాడిలో జయపురం పట్టణ పోలీసులు, సదర్‌ పోలీసులతో పాటు మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ దాడులకు జయపురం ఏఎస్‌పీ ప్రభాత్‌ కుమార్‌ ప్రధాన్, పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్‌ నాయకత్వం వహించారు.

సమాచారం అందిస్తే ఆట కట్టిస్తాం
ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట గోవింద హల్వ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి తాను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)జయపురంలో పనిచేస్తున్నానని చెప్పి ఇంటిని అద్దెకు అడిగాడని వెల్లడించారు. కుటుంబంతో ఉంటామని చెప్పాడని  తమకు తెలిసిన కొంత మందిని వాకబు చేయగా అతడు మంచి వాడని తెలపడంతో ఇంటిని అద్దెకు ఇచ్చామని ఆయన వెల్లడించాడు. తమ ఇంటిని వ్యభిచార గృహంగా చేస్తాడని ఊహించలేక పోయామని వాపోయాడు. జయపురం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో కొంత మంది వ్యభిచార గృహాలను నడుపుతునారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని పక్కా సమాచారం అందితే దాడులు జరిపి ఆటకట్టిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు.  ఈ సెక్స్‌ రాకెట్‌కు ప్రధాన సూత్రదారి గోవిందహల్వ అని భావిస్తున్నారు. విలేకరుల సమావేశంలో జయపురం సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి రాజేష్‌ కుమార్‌ శనాపతి కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement