జయపురం: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అదే సమయంలో 18ఏళ్ల ఆదివాసీ యువతిపై అత్యాచారం జరిపి, అనంతరం మారణాయుధాలతో దాడి జరిపారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవరంగపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఈ అమానుష ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా గుడుపుతుండగా నవరంగపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని తెంతులికుంఠి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరి కంటే ఎక్కువమంది యువకులు ఆమెపై దాడి జరిపి, సామూహికంగా అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరిచినట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలు తీవ్రంగా గాయపడి గ్రామం సమీపంలోని జీడితోటలో సృహతప్పి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది గ్రామస్తులు మలవిసర్జన వెళ్లగా.. యువతి పరిస్థితిని గమనించి, బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం యువతిని నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
సైగలే.. సంకేతం?
ఇదిలా ఉండగా... బాధితురాలి తలపై తీవ్రంగా గాయమైంది. ఏదో ఆయుధతో తలపై గట్టిగా కొట్టడంతో ఈ విధంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటం వల్ల వివరాలు తెలియ రావడం లేదు. దీనిపై ఆమె తల్లిని ప్రశ్నించగా.. యువతి రెండు చేతి వేలు చూపించడం తప్ప, ఏమీ చెప్పలేకపోతోందని కన్నీటి పర్యంతమైంది. దాడిలో ఇద్దరు యువకులు ఉన్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా..ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు నవరంగపూర్ పోలీసులు బాధితురాలిని కలిసి, వివరాలను సేకరించేందుకు ప్రయ త్నించారు. యువతి కోలుకునే వరకు వివరాల కోసం వేచి ఉండక తప్పదని పోలీసు అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment