'మరో దొంగ బాబాకు భరతం' | Violent protest breaks out at self-styled godman Sura Baba's ashram in Odisha | Sakshi
Sakshi News home page

'మరో దొంగ బాబాకు భరతం'

Published Mon, Aug 31 2015 1:56 PM | Last Updated on Tue, Aug 7 2018 4:29 PM

'మరో దొంగ బాబాకు భరతం' - Sakshi

'మరో దొంగ బాబాకు భరతం'

భువనేశ్వర్: ఒడిశాలో ప్రజలు మరో దొంగ బాబా భరతం పట్టారు. అక్రమంగా ఆశ్రమాన్ని నిర్మించడమేకాకుండా తన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతడిపై దాడికిపాల్పడి ఆయన ఆస్తులను ధ్వంసం చేశారు. భారీ ఎత్తున జనం గుమిగూడి ఆయనకు వ్యతిరేక నినాదాలు చేశారు.

సురా బాబా అనే వ్యక్తి తనకు తాను ఆధ్మాత్మిక గురువుగా ప్రకటించుకోవడమే కాకుండా భారీ మొత్తంలో స్తలాన్ని ఆక్రమించి ఆశ్రమం నిర్మించాడు. ఆయన ఆశ్రమానికి వస్తున్న మహిళలపై భక్తి పేరిట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పలువురు మహిళలు స్థానికులకు ఫిర్యాదు చేయడంతో వారంతా ఆశ్రమంపై దాడికి దిగారు. ప్రస్తుతం సురాబాబాను అతడి ఇద్దరి కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement