కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్ ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైప్ నేపథ్యంలో .. ఈ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
‘‘ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి.
.. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తాం.
.. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్‌సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్‌ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు’’ అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో.. తనను ఎవరూ పట్టించుకోలేదని అధికార యంత్రాంగంపైనా ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.
ఇదీ చదవండి: అందులో భాగంగానే తెరపైకి సీజ్ ద షిప్!
Comments
Please login to add a commentAdd a comment