ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స | Ex Minister Botsa Satyanarayana Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స

Published Tue, Dec 10 2024 1:47 PM | Last Updated on Fri, Dec 13 2024 10:55 AM

Ex Minister Botsa Satyanarayana Fires On Chandrababu Government

సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్‌ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు.

పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ మంత్రి బొత్స

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement