
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాల ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో శకటాలపై ఉన్న చిన్నారుల అభివాదానికి చిరునవ్వుతో తిరిగి అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
ముందుగా అక్కడికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వస్తున్నారని తెలిసి కారు దగ్గరే వేచి ఉండి, గవర్నర్‌ను సాదరంగా ఆహ్వానించి కార్యక్రమానికి తోడ్కోని వచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.