
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావడానికి నిర్ణీత ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు ఎక్కడుంటే అక్కడి నుంచే సెల్‌ఫోన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని, అందులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ మందిరాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా నిరంతర పర్యవేక్షణకు ఈ రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్ర కార్యాలయం దోహదపడుతుందన్నారు. ప్రజలు, మీడియా, సోషల్ మీడియాల ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందన్నారు.