పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్
దేవరకొండ (నల్గొండ): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది.
ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పది విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యసాయ అధికారులు రైతులకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చదవండి👉🏼 ‘పరువుహత్య’ విచారణపై ఒవైసీకి అభ్యంతరం ఎందుకు?
నమోదు ఇలా..
ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్‌డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్ అవుతుంది.
చదవండి👉🏾 India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment