
మాట్లాడుతున్న మంత్రి చెల్లుబోయిన, చిత్రంలో సజ్జల తదితరులు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్ల తమకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తోందని శెట్టి బలిజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ సొంత కాళ్లపై నిలబడగలుగుతున్నట్టు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ హయాంలో పెద్ద సంఖ్యలో పదవులు కూడా పొందగలుగుతున్నామని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా శెట్టి బలిజ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు చిల్లర హామీలతో బీసీలను మోసం చేస్తే.. సీఎం జగన్ బీసీలను సమాజానికి బ్యాక్ బోన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. శెట్టిబలిజలను గౌరవ ప్రదమైన పదవుల్లో ఉంచిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. తనను మంత్రిని చేసి, చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపిన విషయాన్ని ప్రస్థావించారు.
జగన్ హయాంలోనే రెట్టింపు పింఛన్లు..
మూస రాజకీయాల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన కనుసన్నల్లో నడిచే మీడియా పింఛన్లపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment