settibalija
-
సీఎం వల్లే శెట్టిబలిజల అభ్యున్నతి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్ల తమకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తోందని శెట్టి బలిజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ సొంత కాళ్లపై నిలబడగలుగుతున్నట్టు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ హయాంలో పెద్ద సంఖ్యలో పదవులు కూడా పొందగలుగుతున్నామని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా శెట్టి బలిజ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు చిల్లర హామీలతో బీసీలను మోసం చేస్తే.. సీఎం జగన్ బీసీలను సమాజానికి బ్యాక్ బోన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. శెట్టిబలిజలను గౌరవ ప్రదమైన పదవుల్లో ఉంచిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. తనను మంత్రిని చేసి, చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపిన విషయాన్ని ప్రస్థావించారు. జగన్ హయాంలోనే రెట్టింపు పింఛన్లు.. మూస రాజకీయాల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన కనుసన్నల్లో నడిచే మీడియా పింఛన్లపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
శెట్టిబలిజ మహానాడు బహిరంగ సభ
-
ఐక్యతే పెట్టుబడి.. గుర్తింపే లక్ష్యం..
రాజ్యాధికారం లేకే వెనుకబడిపోతున్నాం ఆత్మీయ సత్కార సభలో ప్రజాప్రతినిధులు గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఐక్యతే పెట్టుబడిగా బీసీలంతా నడవాలని, సంఘానికి నేనేమైనా చేశానా.. చేయగలనా అని ప్రతి బీసీ ప్రశ్నించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. అధిక జనాభా కలిగిన బీసీలను ఆయా రాజకీయ పార్టీలు గుర్తించేలా మన ఉద్యమాలు, పోరాటాలు ఉండాలన్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావులకు ఆదివారం రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్‌లో రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ మంజునాథ కమిషన్ విచారణకు మనమంతా బాగా స్పందించామని, పార్టీలకు అతీతంగా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని, ఐక్యతే మన శక్తి... స్ఫూర్తి అని నినదించారు. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. మంత్రి పితాని మాట్లాడుతూ తమకు ప్రస్తుతం లభించిన పదవులు కేవలం బీసీ కులాలు, ఆ సంఘాల ప్రజలను చూసి ఇచ్చినవేనని, ఈ విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయబోమని, బీసీల కోసం ఎల్లపుడూ తపిస్తామన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ, సంఘాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. తాము ఏ స్థాయిలో ఉన్నా సంఘాన్ని మరువబోమన్నారు. అంబేద్కర్ భవన్ లాగే ప్రతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ల నిర్మాణానికి ప్రయత్నిస్తామని, అందుకు స్థల దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. దీనిలో భాగంగా కొత్తపేటలో బీసీ కన్వెన్షన్ నిర్మిస్తున్నామన్నారు. అంగర రామ్మోహన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా బీసీలు ఒక శక్తిగా అవతరించాలన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, విప్ అంగర రామ్మోహనరావులను సత్కరించారు. కార్పొరేటర్లు గుత్తుల మురళీధరరావు, బాపన సుధారాణి, పిల్లి నిర్మల, ఆత్మీయ అభినంద సత్కార సభ ఆహ్వాన కమిటీ సభ్యులు బుడ్డిగ శ్రీనివాస్, కుడుపూడి పార్థసారధి, వాసంశెట్టి గంగాధర్, ఆతిథ్య కమిటీ సభ్యులు సూరంపూడి శ్రీహరి, మార్గాని రామకృష్ణగౌడ్, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, పాలిక శ్రీను, పెంకే సురేష్, లక్ష్మితులసి తదితరులు పాల్గొన్నారు. -
శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ కులాల జాబితా నుంచి శెట్టిబలిజలను తొలగించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సోమవారం నోటీసు జారీ చేసింది. ఇంతకుముందే కళింగ సామాజిక వర్గం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి కూడా కౌంటర్ దాఖలుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీసీ జాబితా నుంచి కులాలను తొలగించడంపై నాలుగు పిటిషన్లు దాఖలుకాగా... వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ అమితవరాయ్ నే తృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. శెట్టి బలిజల తొలగింపుపై న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘50 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ పొందుతున్న శెట్టి బలిజలను ఇప్పుడు విభజన జరిగిందంటూ తెలంగాణలో రిజర్వేషన్ దక్కకుండా చేయడం అన్యాయం. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో విద్యాభ్యాసం ద్వారా వారు తెలంగాణలో స్థానికులుగా మారారు. ఇప్పుడు వారికి ఇక్కడ రిజర్వేషన్ దక్కదు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత దక్కదు. ఈ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా తె లంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ మార్గదర్శనం లేకుండా తనంతట తానుగా బీసీ జాబితాను సవరించింది..’’ అని పేర్కొన్నారు. వాదన విన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కళింగ సామాజిక వర్గానికి చెందిన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించనుంది. విద్యార్థులకు లభించని ఊరట బీసీ జాబితా నుంచి తొలగించిన కారణంగా మెడిసిన్ ప్రవేశాన్ని కోల్పోయామంటూ గత వారం దాఖలైన పిటిషన్‌తో పాటు సోమవారం దాఖలైన మరో 3 పిటిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిరాశే ఎదురైంది. భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31లోగా మెడిసిన్ ప్రవేశాలు పూర్తికావాలని, ఆ ప్రకారం పూర్తయ్యాయని... ఇప్పుడు సీట్లు కూడా లేవని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు. దీనితో ఏకీభవించిన న్యాయస్థానం... ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కింది కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రవేశం పొంది ఫీజు కట్టిన విద్యార్థికి సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక విద్యార్థి తరఫు న్యాయవాది వాదనను న్యాయస్థానం సమర్థించింది. సీటు లభ్యతను పరిశీలించాలని ఎంసీఐని ఆదేశించింది. అయితే దీనిపై ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ కింది కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా వచ్చిన ఆ సీటు.. తదుపరి ఆ ఉత్తర్వులు రద్దయినప్పుడే రద్దయిందని వివరించారు. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఆ మేరకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవేళ సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆ దిశగా ప్రయత్నిస్తామని విన్నవించారు. దీంతో ఆ ఒక్క విద్యార్థికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం విచారణ జరపనున్నట్లు కోర్టు ప్రకటించింది. -
రాజ్యాధికారమే ధ్యేయం
కోటగుమ్మం (రాజమండ్రి) :గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత, శ్రీశయన కులాలకు చెందినవారందరూ విభేదాలు పక్కనపెట్టి రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. ఇందుకోసం సంఖ్యాబలం పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు రాజమండ్రి జేకే గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అన్ని కులా లూ సంఘీభావంతో మెలగి రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నా రు. జిల్లాలో విస్తృతంగా పర్యటించి సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఫిబ్రవరి 15న గౌడ, శెట్టిబలిజ మహాసభ విజయవాడలో జరుగుతుందని, ఇందులో భాగంగా ఆ రోజు చలో విజయవాడ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గౌడ, శెట్టిబలిజ, అనుబంధ కులాలకు చెందిన సమస్యలను అధికార, ప్రతిపక్షాల దృష్టికి తీసుకువెళ్తామని నారాయణరావు చెప్పారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ, రాజ్యాధికారం ద్వారానే సంఘీయుల అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్ని శాసించే స్థాయికి గౌడ, శెట్టిబలిజ సంఘం ఎదిగిందని అన్నారు. ఈ సభతో గౌడ, శెట్టిబలిజ, శ్రీైశయన, యాత తదితర కులాలను చిన్నచూపు చూస్తున్న పార్టీలకు కనువిప్పు కలగాలని అన్నారు. ఇప్పటికే 14 శాతం సీట్లు పొందుతున్న సంఘీయులు మరో 19 శాతం సీట్లు సాధిస్తే అధికారం వస్తుందన్నారు. ఐక్యతతో రాజకీయంగా సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గౌడ, శెట్టిబలిజ కులాలవారు విద్యావంతులు కావాలని సూచించారు. మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నా గౌడ, శెట్టిబలిజ సంఘీయులకు గుర్తింపు లేదని అన్నారు. రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించలేదన్నారు. విజయవాడలో జరిగే మహాసభ ద్వారా సత్తా చాటాలన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోటీ ఏర్పడిందని, శాసనసభలో, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఇందులో భాగంగా మద్యం షాపుల్లో కొన్నిటిని గౌడ, శెట్టిబలిజలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బుడ్డిగ శ్రీను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు సన్మానం ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన 411 మంది ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక విప్, ఒక ఎంపీ, 11 ఎంపీపీలు, తొమ్మిదిమంది జెడ్పీటీసీ సభ్యులు, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ఎనిమిదిమంది కార్పొరేటర్లు, జిల్లాలోని 36 మంది కౌన్సిలర్లు, 175 మంది ఎంపీటీసీ సభ్యులు, 157 మంది సర్పంచ్‌లు, ఐదుగురు బ్యాంక్ డైరక్టర్లకు ఈ అభినందన మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ పాలిక శ్రీను, మార్గాని చంటిబాబు, కుడుపూడి సత్తిబాబు, కడియాల వీరభద్రరావు, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.