ప్రధాని కావాలన్న కోరిక లేదు: అఖిలేశ్‌ | Not a desire to become prime minister: Akhilesh | Sakshi
Sakshi News home page

ప్రధాని కావాలన్న కోరిక లేదు: అఖిలేశ్‌

Published Sun, Feb 5 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

Not a desire to become prime minister: Akhilesh

లక్నో: తనకు దేశ ప్రధాని కావాలన్న కోరిక లేదని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.  శనివారం ఓ న్యూస్‌ చానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో అఖిలేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారని సరదాగా అన్నారు. ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికి రాబోయే ఎన్నికల్లో 300కు పైగా సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వారిలో కనీసం 50 శాతం మంది ఓటేసినా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement