పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడగింపు! | PM Kisan KYC Last Date Extended, Check New Deadline | Sakshi
Sakshi News home page

పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడగింపు!

Published Wed, Mar 30 2022 1:01 PM | Last Updated on Wed, Mar 30 2022 6:01 PM

PM Kisan KYC Last Date Extended, Check New Deadline - Sakshi

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం-కిసాన్) రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువును 2022 మే 22 వరకు పొడిగించినట్లు అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు కచ్చితంగా ఆధార్ ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ-కేవైసీ చేసుకోలేకపోయినట్లయితే పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమ కాదు. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిందని వేచి చూడకుండా.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి రైతులు ఇకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు. ఈ పథకం కింద, సంవత్సరానికి ₹6,000 మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులను వచ్చే నెలలో రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. 

ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి?

  • పీఎం-కిసాన్ అధికారిక  వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
  • ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్‌లో ఈ-కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది.
  • ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
  • 'సబ్మిట్' పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
  • ప్రస్తుతం వెబ్‌సైట్ డౌన్‌లో ఉంది. పనిచేయడం లేదు. 

(చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement