సాక్షి, అమరావతి: పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.
చదవండి: అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్‌వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment