రెస్ట్.. ఇన్ అరెస్ట్
మన శ్శాంతిని హరించడం కూడా ఆస్తుల్ని ధ్వంసం చేయడమే. ఈ సంగతి పెన్సిల్వేనియా మేయర్ బిల్ మిల్‌బ్రాండ్‌కి బాగా తెలిసివచ్చింది. సమాధులు ఉన్నచోట సెల్‌ఫోన్ టవర్ నిర్మించడానికి బిల్ అనుమతి ఇవ్వడంతో ఆ కాలనీ వాళ్లంతా బిల్‌పై విరుచుకుపడ్డారు. సమాధుల్లో గాఢ నిద్రలో ఉన్నవారి మనశ్శాంతిని ధ్వంసం చేయడానికి మీకెలా మనసొప్పిందని వారు బిల్ మీద కేసుపెట్టారు.
పోలీసులొచ్చి ఆయన్ని ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ‘వాండలిజం’ (ఆస్తుల్ని ధ్వసం చేయడం) కింద ఆయన్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. మనుషులకే కాదు, ఆత్మలకూ హక్కులుంటాయని మేయర్‌గారు తెలుసుకుని, చే సిన తప్పుకు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు.