Cell phone tower
-
నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు
కోదాడ రూరల్: సెల్ టవర్ టెక్నీషియన్లుగా పనిచేస్తూ టవర్లలో ఉండే బ్యాటరీలను చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన దీగుంట్ల లక్ష్మీనారాయణ, కోదాడ మండలం గుడిబండకు చెందిన బెజవాడ అశోక్‌కెడ్డి, చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గన్నా భాస్కర్ కొన్నేళ్లుగా జియో టవర్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్ధితో టవర్లకు ఎవరూ కాపలా ఉండకపోవడంతో బ్యాటరీలు దొంగతనం చేయాలని పథకం రచించారు. ఈ మేరకు సెప్టెంబర్ 2019 నుంచి ఈ నెల వరకు కోదాడ పట్టణం, రూరల్ పరిధితో పాటు మునగాల, మఠంపల్లి, చిలుకూరు, మేళ్లచెర్వు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పలు టవర్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా బుధవారం తెల్లవారుజామున పట్టణ పరిధిలోని మేళ్లచెర్వు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో బ్యాటరీలు తరలిస్తూ ఈ ముగ్గురు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురితో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు ఆటోలు, ఒక వ్యాన్, రూ.2 లక్షలు, 5 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ సీఐ ఏ. నర్సింహరావు, ఎస్ఐ రాంబాబు, రూరల్ ఎస్ఐ వై. సైదులు, చిలుకూరు ఎస్ఐ నాగభూషణరావు, సిబ్బందిని ఎస్పీ భాస్కరన్ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళన చేపట్టాడు. గత మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగడం లేదంటూ , తన భార్యను పిల్లల్ని పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాడు. సురేష్‌కు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కాగా, సురేష్‌ను సెల్ టవర్ నుండి దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సురేష్ భార్యతో పోలీసులు సెల్ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: దారుణం: భార్య, అత్తను గొడ్డలితో నరికి హత్య కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే! -
రిలయన్స్ జియో టవర్ల పేరుతో టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ‘సీజనల్ ఫ్రాడ్స్’ మొదలెట్టారు. రిలయన్స్‌కు చెందిన జియో సంస్థ ఇటీవల కాలంలో తమ నెట్వర్క్ విస్తరణ కోసం అనేక ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లు సదరు సంస్థకు చెందిన నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీని ఆధారంగా నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్, మేకలబండకు చెందిన ఓ వ్యాపారి ఇంటిపై కొంత స్థలం ఖాళీగా ఉంది. దీనిని ఏదైనా సర్వీస్ ప్రొవైడర్‌కు టవర్ ఏర్పాటు చేసుకోవడానికి అద్దెకు ఇస్తే అదనపు ఆదాయం వస్తుందని అతను భావించాడు. దీంతో టవర్లు ఏర్పాటు చేసుకునే సంస్థల కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి (towersjio.in) అనే వెబ్ చిరునామా లభించింది. ఆ లింకును ఓపెన్ చేసి చూసిన అతను దానికి ఆకర్షితుడయ్యాడు. తాము రిలయన్స్ జియో సంస్థకు టవర్లు ఏర్పాటు చేస్తుంటామంటూ అందులో ప్రచారం చేసుకున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 500 చదరపు అడుగుల స్థలానికి నెలకు రూ.35 వేలు అద్దె ఇస్తామని, అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు చెల్లిస్తామని ఆ సైట్లో ఉంది. కనీసం 15 ఏళ్ల కాలానికి అగ్రిమెంట్ చేయాలని, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.25,250, అగ్రిమెంట్ ఫీజుగా రూ.69,500 చెల్లించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆసక్తి చూపిన సదరు వ్యాపారి వెబ్ పేజ్ ఆఖరులో ఉన్న కాలమ్స్‌లో తన పూర్తి వివరాలు పొందుపరిచాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు ఫోన్లో సంప్రదించారు. భవనం, సైట్‌కు సంబంధించిన పూర్తి పత్రాలు, నిరభ్యంతర పత్రం పంపాల్సిందిగా కోరారు. దీంతో అతను వాటిని స్కాన్ చేసి ఆన్లైన్లో వారు చెప్పిన ఈ–మెయిల్ చిరునామాలకు పంపాడు. ఆపై మరోసారి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు టవర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. అయితే దానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుందని చెప్పారు. రిజిస్ట్రేషన్, టీడీఎస్, జీఎస్టీ... తదితరాల నిమిత్తం రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. దీనికి వ్యాపారి అంగీకరించడంతో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు ఇచ్చి వాటిలో నగదు డిపాజిట్ చేయాలని సూచించారు. తొమ్మిది విడతల్లో రూ.8 లక్షలు కాజేశారు. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమికంగా దుండగులు వాడిన ఫోన్ నంబర్లు, నగదు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బోగస్ వెబ్‌సైట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌ను మాత్రమే నమ్మి డబ్బు డిపాజిట్ చేయవద్దని కనీసం ఒకసారైనా వ్యక్తిగతంగా కలిసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. -
పాస్‌బుక్ కోసం... సెల్ టవర్ ఎక్కిన యువకుడు
సాక్షి, మెదక్ : అధికారుల అలసత్వంపై నిరసన తెలుపుతూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటనతో జిల్లాలోని నర్సాపూర్‌లో బుధవారం కలకలం రేగింది. రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు పథకం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యల్ని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని యువకుడు ఆరోపించాడు. సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అంటున్నాడు. యువకుడిని మండలంలోని ఆత్మకూరు తండాకు చెందిన రవిగా గుర్తించారు. కాగా, సమస్యలు పరిష్కరిస్తామని నర్సాపూర్ ఎస్సై వెంకటరాజు గౌడ్ హామి ఇచ్చినప్పటికీ యువకుడు కిందకి దిగి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం. -
రెస్ట్.. ఇన్ అరెస్ట్
మన శ్శాంతిని హరించడం కూడా ఆస్తుల్ని ధ్వంసం చేయడమే. ఈ సంగతి పెన్సిల్వేనియా మేయర్ బిల్ మిల్బ్రాండ్కి బాగా తెలిసివచ్చింది. సమాధులు ఉన్నచోట సెల్‌ఫోన్ టవర్ నిర్మించడానికి బిల్ అనుమతి ఇవ్వడంతో ఆ కాలనీ వాళ్లంతా బిల్‌పై విరుచుకుపడ్డారు. సమాధుల్లో గాఢ నిద్రలో ఉన్నవారి మనశ్శాంతిని ధ్వంసం చేయడానికి మీకెలా మనసొప్పిందని వారు బిల్ మీద కేసుపెట్టారు. పోలీసులొచ్చి ఆయన్ని ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ‘వాండలిజం’ (ఆస్తుల్ని ధ్వసం చేయడం) కింద ఆయన్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. మనుషులకే కాదు, ఆత్మలకూ హక్కులుంటాయని మేయర్‌గారు తెలుసుకుని, చే సిన తప్పుకు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. -
తమ్ముడి భార్య కోసం ఆత్మహత్యాయత్నం
కేకే.నగర్(చెన్నై): తమ్ముడి భార్యను తనతో పంపాలని, లేకపోతే సెల్‌ఫోన్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన కారైకుడిలో సంచలనం కలిగించింది. శివగంగై జిల్లా కారైకుడికి చెందిన కరుప్పయ్య. ఇతనికి జయచంద్రన్, మురుగన్ అనే కుమారులు ఉన్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మురుగన్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో అతనిపై కోపంతో భార్య ముంతాజ్‌బేగం అతడిని వదలి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మురుగన్ పీకల దాకా మద్యం తాగి అదే ఊరులో ఉన్నసెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. సమాచారాన్ని పోలీసులకు, అగ్నిమాపక దళానికి అందించడంతో వారు అతడిని కిందకు దిగాలని సూచించారు. తన తమ్ముడు జయచంద్రన్ భార్యను తనతో పంపించాలని లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు అతడిని నచ్చచెప్పి కిందకు దింపారు. కిందకు దిగిన మురుగన్ పారిపోవడానికి గోడ దూకడంతో గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
BIG STORY - టెక్నాలజీకో దండం
-
ఆరోగ్యాన్ని హరిస్తున్న టెక్నాలజీ