న్యూయార్క్: మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని పంపిణీ, టీకా డోసులు ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించింది. కోవిడ్–19 ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ దాడి చేస్తోంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు 19 మంది కలిసి ఒక విధానాన్ని రూపొందించారు. ఈ మేరకు పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వంలో నిపుణులు మూడు దశల్లో వ్యాక్సిన్ పంపిణీకి పలు సూచనలు ఈ విధంగా ఉన్నాయి.(చదవండి: నావల్ మాస్క్ తయా రు చేసిన శాస్త్రవేత్తలు)
- కరోనా వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
- కోవిడ్–19తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలి.
- వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి.
- దీని వల్ల కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
- వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment