ఇటలీ పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది.
పెన్సిల్వేనియా: ఇటలీ పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పెన్సిల్వేనియాలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.... మరికొంత మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ప్రమాదానికి గురైన బస్సు ఇటలీ పర్యాటక శాఖకు చెందినదని చెప్పారు. న్యూయార్క్ నుంచి నయాగార జలపాతం సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వివరించారు.