వాల్జ్‌ను పరిచయం చేసిన కమల
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు.
అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడించారు. అమెరికాకు అన్నివిధాలా అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్ వాల్జ్ అని ప్రశంసించారు. కమలా హారిస్ మాట్లాడిన అనంతరం టిమ్ వాల్జ్ ప్రసంగం ప్రారంభించారు. జనం చప్పట్లు, కేకలతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. మనకు మరో 91 రోజులపాటు సమయం మాత్రమే ఉందని, ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.
అవిశ్రాంతంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాతే మనకు నిద్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీసీ న్యూస్ సర్వేలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. వాల్జ్ ఎవరో తమకు ఇప్పటిదాకా పెద్దగా తెలియదని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ఉపాధ్యక్ష అభ్యరి్థగా పేరు ఖరారైన తర్వాతే ఆయనెవరో తెలిసిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment