పెన్సిల్వేనియా : అమెరికాలోని పెన్సిల్వేనియాలో చైనాకు చెందిన శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సైంటిస్టు బింగ్ లియు (37) రెండు రోజుల క్రితం తన ఇంట్లో శవమై కనిపించారు. అతనితోపాటు హోగూ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా విగతజీవిగా పడి ఉన్నాడు. బింగ్ లియు, హోగూ ఇద్దరు మంచి స్నేహితులుగా మెలిగేవారు. బింగ్ లియు మెడ, తల భాగంలో తీవ్ర గాయాలున్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బింగ్ పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా బింగ్ లియుని మొదట హోగు కాల్చి చంపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లియు చేస్తున్న పరిశోధనలకు, ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment